S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

08/21/2018 - 04:10

న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ను రూ.13,000 కోట్లకు మోసం చేసి, విదేశాలకు పారిపోయన ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ యూకేలోనే ఉన్నట్టు అక్కడి అధికారులు ధ్రువీకరించారు. సీబీఐ అభ్యర్థనపై స్పందించిన యూకే అధికారులు నీరవ్ మోదీ అక్కడే ఉన్నట్టు పేర్కొన్నారు.

08/21/2018 - 04:08

గోదావరిఖని, ఆగస్టు 20: ఆదివారం నుంచి క్షణం తీరిక లేకుండా కురుస్తున్న విస్తారమైన వర్షాలతో సింగరేణి బొగ్గు పరిశ్రమలోని ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్‌లల్లో బొగ్గు ఉత్పత్తికి తీవ్ర విఘాతం కలిగింది. రోజూ లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి జరిగే ఓపెన్ కాస్ట్ మైన్స్‌లో వర్షం తీవ్ర ప్రతిబంధకంగా మారింది. రామగుండం రీజియన్‌లోని ఓసీపీ-1, 2, 3, 4 ప్రాజెక్టుల్లో సుమారు 48వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది.

08/20/2018 - 23:57

న్యూఢిల్లీ, ఆగస్టు 20: అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధర తగ్గింది. విదేశీ వ్యాపార లావాదేవీలు బలహీనపడడంతో, 13 రూపాయలు తగ్గిన బ్యారెల్ పెట్రోలియం ధర 4,558 రూపాయలకు చేరింది. మల్టీ కమోడిటీ ఎక్ఛ్సేంజ్ విధానంలో, గత ఏడాది సెప్టెంబర్‌లో పెట్రోలియం ధర బ్యారెల్‌కు 13 రూపాయలు తగ్గింది. ఆతర్వాత క్రమంగా పెరుగుతూ వచ్చింది. చాలాకాలం తర్వాత మళ్లీ 13 రూపాయలు తగ్గడం విశేషం. వెండి ధర కూడా సోమవారం పెరిగింది.

08/20/2018 - 23:56

ముంబయి, ఆగస్టు 20: బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజిలో సెనె్సక్స్ రికార్డు పరుగును కొనసాగిస్తున్నది. కాగా, గతంలో ఎన్నడూ లేని విధంగా నిఫ్టీ 11,500 పాయింట్ల మైలురాయిని అధిగమించి చరిత్ర సృష్టించింది. ఎల్ అండ్ టీ, టాటా మోటర్స్ భారీగా లాభపడ్డాయి. మొత్తం మీద స్టాక్ మార్కెట్ సోమవారం మరింత వేగాన్ని పుంజుకుంది.

08/20/2018 - 23:54

ముంబయి, ఆగస్టు 20: బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజి (బీఎస్‌ఈ) తాజాగా విడుదల చేసిన డీలిస్టింగ్ జాబితాలోకి 17 కంపెనీలు చేరాయి. సుమారు ఆరు నెలల కాలంలో వీటి ట్రేడింగ్‌పై నిషేధం విధించిన బీఎస్‌ఈ మంగళవారం నుంచి ఈ కంపెనీలను లిస్టింగ్ నుంచి తొలగిస్తున్నట్టు ప్రకటించింది.

08/20/2018 - 23:53

బెంగళూరులో సోమవారం ‘సియాజ్’ సిరీస్‌లో కొత్త మోడల్‌ను ప్రవేశపెడుతున్న
మారుతీ సుజికీ ఇండియా సీనియర్ ఎగ్జిక్యూటివ్, డైరెక్టర్ (మార్కెటింగ్ అండ్ సేల్స్) ఆర్‌ఎస్ కాల్సీ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఇంజనీరింగ్) సీవీ రామన్ (కుడి).

08/20/2018 - 23:50

న్యూఢిల్లీ, ఆగస్టు 20: వేతన చట్టాలను పకడ్బందిగా అమలు చేయాలని భారత్‌కు అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌వో) సూచించింది. ఒకే పనికి ఒకే రకమైన వేతనం అనే విధానం భారత్‌లో సక్రమంగా అమలు జరగడం లేదని తాజాగా విడుదల చేసిన ఒక నివేదికలో ఐఎల్‌ఓ స్పష్టం చేసింది. ప్రత్యేకించి మహిళా కార్మికుల పట్ల వివక్ష కొనసాగుతున్నదని పేర్కొంది.

08/20/2018 - 23:50

ముంబయి, ఆగస్టు 20: ఇటీవల కాలంలో అత్యంత దయనీయ పరిస్థితుల్లోకి వెళ్లిన రూపాయి మారకపు విలువ సోమవారం తేరుకుంది. డాలర్‌తో రూపాయి మారకం 38 పైసలు పెరిగి, 69.82 రూపాయలకు చేరింది. అమెరికా, చైనా దేశాలు వాణిజ్య యుద్ధం మరింత పెరిగడం రూపాయి మళ్లీ పుంజుకోవడానికి సహకరించంది. అయితే, రూపాయి విలువ పెరిగిందనడం కంటే, అంతర్జాతీయంగా డాలర్ బలహీనపడిందనే చెప్పాలని విశే్లషకులు అభిప్రాయం.

08/20/2018 - 23:48

న్యూఢిల్లీ, ఆగస్టు 20: జాతీయ మార్కెట్‌లో బంగారం మళ్లీ పుంజుకుంది. పది గ్రాముల బంగారం ధర 170 రూపాయలు పెరిగి, 30,420 రూపాయలకు చేరింది.

08/20/2018 - 23:45

ముంబయిలో
బంగారం (22 క్యారెట్స్)
1 గ్రాము: 2,887.00 రూపాయలు
8 గ్రాములు: 23,096.00 రూపాయలు
10 గ్రాములు: 28,870.00 రూపాయలు
100 గ్రాములు: 2,88,700.00 రూపాయలు
బంగారం (24 క్యారెట్స్)
1 గ్రాము: 3,087.701 రూపాయలు
8 గ్రాములు: 24,701.608 రూపాయలు
10 గ్రాములు: 30,877.01 రూపాయలు
100 గ్రాములు: 3,08,770.10రూపాయలు
వెండి

Pages