S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

05/29/2016 - 05:05

వాషింగ్టన్, మే 28: ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బెర్గ్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ (ఐఎస్‌ఎస్)లోని ముగ్గురు వ్యోమగాములతో ముఖాముఖి మాట్లాడతారు. ఫేస్‌బుక్ వినియోగదారులు నాసా ఫేస్‌బుక్ పేజీలో ఉంచిన ప్రశ్నలను అడిగి సమాధానాలు రాబడతారు. ఎంతగానో ఆసక్తి రేకెత్తించే ఈ కార్యక్రమం జూన్ 1వ తేదీ మధ్యాహ్నం 12.55 గంటలకు ప్రసారమవుతుందని నాసా ఒక ప్రకటనలో తెలిపింది.

05/29/2016 - 05:04

రియోడిజనీరో, మే 28: మహిళలపై లైంగిక దాడులకు పరాకాష్ఠ ఈ ఘటన. లాటిన్ అమెరికాలోని అతిపెద్ద దేశమైన బ్రెజిల్‌లో ఒక టీనేజీ బాలికపై 33 మంది గ్యాంగ్‌రేప్‌కు పాల్పడిన అమానుష ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సామూహిక అత్యాచారం వల్ల అచేతనంగా పడిపోయిన ఆ 16 సంవత్సరాల బాలిక మరునాడు స్పృహలోకి వచ్చినట్లు సమాచారం.

05/29/2016 - 05:03

వాషింగ్టన్, మే 28: అణు సరఫరాల గ్రూపు (ఎన్‌ఎస్‌జి)లో భారత్ సభ్యత్వంపై పాకిస్తాన్ వ్యతిరేకత వ్యక్తం చేయడంపై అమెరికా స్పందించింది. ఇది అణ్వాయుధాల తయారీకి ఎంతమాత్రం కాదని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి మార్క్ టోనర్ స్పష్టం చేశారు. ‘అణ్వాయుధాల ఉత్పత్తికి లేదా పోటీకోసం కాదు. అణు ఇంధనాన్ని పౌర శాంతికోసం దోహదపడే ప్రక్రియ మాత్రమే. దీన్ని పాకిస్తాన్ ఆ కోణంలోనే చూడాలి’ అని స్పష్టం చేశారు.

05/29/2016 - 05:02

న్యూయార్క్, మే 28: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా వచ్చే నెల ఐక్యరాజ్య సమితిలో జరిగే యోగా కార్యక్రమానికి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గురు జగ్గి వాసుదేవ్ నాయకత్వం వహించనున్నారు. జూన్ 21న రెండవ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించనున్న విషయం తెలిసిందే.

05/29/2016 - 05:01

జెనీవా, మే 28: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న జికా వైరస్ ప్రభావం ఒలింపిక్ క్రీడలపై పడింది. అంతర్జాతీయ క్రీడోత్సవాల వేదిక మార్చడం లేదా పొడిగించడం ఏదొకటి చేయాలని 150 దేశాల వైద్య నిపుణులు, శాస్తవ్రేత్తలు, పరిశోధకులు ముక్తకంఠంతో కోరుతున్నారు. ఈ మేరకు వారంతా సంతకం చేసిన విజ్ఞాపనను ప్రపంచ ఆరోగ్య సంస్థకు పంపారు. ఆగస్టు 5 నుంచి సెప్టెంబర్ 18 వరకూ రియో డి జెనిరియోలో ఒలింపిక్స్ జరగనున్న సంగతి తెలిసిందే.

05/29/2016 - 05:00

సింగపూర్, మే 28: సింగ్‌పూర్‌కు చెందిన భారతీయ రచయిత్రి అదితి కృష్ణకుమార్‌కు ప్రతిష్ఠాత్మక ఆసియన్ బుక్ అవార్డు లభించింది. లవ్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ పేరుతో ఆమె రాసిన పుస్తకానికి ఈ పురస్కారం దక్కింది. 31 ఏళ్ల కృష్ణకుమార్‌కు ఈ అవార్డు కింద పదివేల సింగపూర్ డాలర్లు అందచేస్తారు.

05/29/2016 - 05:00

ఇస్లామాబాద్, మే 28: వైద్య పరీక్షల నిమిత్తం ప్రస్తుతం లండన్‌లో ఉన్న పాకిస్తాన్ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్ (66) మంగళవారం ఓపెన్‌హార్ట్ శస్తచ్రికిత్స చేయించుకోనున్నారు. నవాజ్ షరీఫ్ కుమార్తె మరియమ్ నవాజ్ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించింది. ‘ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్ మంగళవారం ఓపెన్‌హార్ట్ శస్తచ్రికిత్స చేయించుకుంటున్నారు.

05/28/2016 - 08:09

షిల్లాంగ్, మే 27: ఆగ్నేయాసియాకు ఈశాన్య భారతం ముఖద్వారమని ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. తూర్పు దృక్కోణంతోనే తమ ప్రభుత్వం ముందుకు వెళుతోందని, ఈ ప్రాంతాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయడానికి వౌలిక సదుపాయాలను బలోపేతం చేస్తోందని శుక్రవారం నాడిక్కడ జరిగిన భారీ బహిరంగ సభలో స్పష్టం చేశారు.

05/27/2016 - 17:32

హిరోషిమా: హిరోషిమాపై జరిగిన అణుబాంబు దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా శుక్రవారం నివాళులర్పించారు. ఏడు శతాబ్దాల తర్వాత మొదటి అణుబాంబు దాడి ప్రాంతాన్ని ఒబామా పరిశీలించారు. అణుబాంబు దాడిలో ప్రాణాలతో బయటపడిన వారిని ఆయన కలిశారు.

05/27/2016 - 04:19

బీజింగ్, మే 26: భారత్-చైనా సంబంధాలు వ్యూహాత్మక ప్రాధాన్యతను సంతరించుకున్నాయని, ఈ రెండు దేశాలు గనుక కలిసి పని చేసినట్లయితే అవి ప్రపంచ శాంతి, సౌభాగ్యాలకు గొప్ప ఊపును కల్పించగలవని రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ గురువారం చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌కు చెప్పారు.

Pages