S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

05/15/2016 - 02:13

వాషింగ్టన్, మే 14: చైనా తన రక్షణ సామర్థ్యాన్ని పెంచుకుందని, భారత సరిహద్దుల్లో మరిన్ని సైనిక బలగాలను మోహరించిందని అమెరికా రక్షణ శాఖ కార్యాలయం పెంటగాన్ తెలిపింది. చైనా ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో గల తన సైనిక స్థావరాల్లో ప్రత్యేకించి పాకిస్తాన్‌లో సైనిక బలగాలను పెంచుతోందని అమెరికా హెచ్చరించింది.

05/13/2016 - 03:55

ఐక్యరాజ్య సమితి, మే 12: ఉగ్రవాదులు తమ విధ్వంసక కార్యకలాపాల పట్ల యువతను ఆకర్షించడానికి సామాజిక మాధ్యమాలను దుర్వినియోగం చేస్తున్నందు వల్ల నిజమైన, అవసరమైన భావ ప్రకటన స్వేచ్ఛకు భంగం కలగని రీతిలో సామాజిక మాధ్యమాలను జాగ్రత్తగా పర్యవేక్షించాల్సిన అవసరం ఉందని భారత్ పేర్కొంది.

05/13/2016 - 02:12

ఢాకా, మే 12: క్రీడల్లో ప్రత్యర్థి ఆటగాళ్ల మధ్య మాటల యుద్ధాలు సర్వసాధారణం. ఒక్కోసారి అవి శ్రుతిమించి ఆటగాళ్లు కొట్టుకునే స్థాయికి సైతం చేరుకుంటూ ఉంటాయి. క్రికెట్, ఫుట్‌బాల్‌లాంటి ఆటల్లో ఇలాంటివి మనం తరచూ చూస్తూనే ఉంటాం. అయితే బంగ్లాదేశ్‌లో జరిగిన ఓ లోకల్ క్రికెట్ మ్యాచ్‌లో ఇలాంటి సంఘటనే ఒక యువకుడి ప్రాణాలను తీసింది.

05/12/2016 - 08:05

చార్లెస్టన్(అమెరికా), మే 11: అమెరికా అధ్యక్ష పదవి అభ్యర్థిత్వ రేసులో డెమొక్రాట్ల మధ్య పోరు ఉత్కంఠగా మారుతోంది. ఓ వైపు రిపబ్లికన్‌ల తరపున ఖాయమైన అభ్యర్థిగా డొనాల్డ్ ట్రంప్ వరుస విజయాలతో దూసుకుపోతుంటే.. డెమొక్రాట్ల హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగిన హిల్లరీ క్లింటన్‌కు ఆమె ప్రత్యర్థి బెర్నీ సాండర్స్ షాక్‌లపై షాక్‌లు ఇస్తున్నారు.

05/11/2016 - 12:36

లండన్: బ్యాంకులకు రుణాల ఎగవేత, మనీ లాండరింగ్ కేసుల్లో అభియోగాలు ఎదుర్కొంటున్న కింగ్‌ఫిషర్ అధినేత విజయ్ మాల్యాను తమ దేశం నుంచి భారత్‌కు పంపలేమని బ్రిటన్ స్పష్టం చేసింది. ఆయన పాస్‌పోర్టును రద్దు చేసినప్పటికీ తమ చట్టాల ప్రకారం వెనక్కి పంపలేమని బ్రిటన్ అధికారులు స్పష్టం చేశారు. అయితే, మాల్యాను వెనక్కిరప్పించేందుకు భారత్ చేసే ప్రయత్నాలకు సహకరిస్తామని వారు తెలిపారు.

05/10/2016 - 03:17

న్యూఢిల్లీ, మే 9: ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పనామా పేపర్ల వ్యవహారంలో భారతదేశానికి సంబంధించి వెల్లడైన ప్రముఖుల లావాదేవీలపై సీబీఐ విచారణ జరిపించే అంశంపై జవాబు చెప్పాల్సిందిగా సుప్రీం కోర్టు సోమవారం కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. జస్టిస్ దీపక్ మిశ్రా, శివకీర్తి సింగ్‌లతో కూడిన ధర్మాసనం ఇందుకు సంబంధించి కేంద్రానికి నోటీసులు జారీ చేసింది.

05/10/2016 - 03:17

న్యూఢిల్లీ, మే 9: గగన తలంలో ఇదో అద్భుతం.. తనివితీరా ఆస్వాదించాల్సిన అరుదైన ఖగోళ పరిణామం.సూర్యుడు భూమికి మధ్యగా బుధగ్రహం సోమవారం రాత్రి పయనించింది. ఈ క్రమంలో ఇది సూర్యుడిపై ఓ చిన్న చుక్కగానే కనిపించింది. భారత్‌లో ఇది పరిపూర్ణంగా ద్యోతకం కావడం వల్ల దీన్ని ప్రతిఒక్కరూ తిలకించారు. ఓ శతాబ్ధకాలంలో కేవలం పదమూడు సార్లు మాత్రమే ఈ పరిణామం సంభవిస్తుంది.

05/09/2016 - 17:37

కాబుల్‌: అఫ్గానిస్థాన్‌లో కునార్‌ ప్రావిన్స్‌లోని ఘజియాబాద్‌ జిల్లాలో భద్రతా బలగాలకు ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 45 మంది తాలిబన్‌ ఉగ్రవాదులు మృతిచెందారు. ఈ ఘటనలో ఓ ఆర్మీ అధికారి మృతిచెందగా ముగ్గురికి గాయాలయ్యాయి. సెక్యూరిటీ పోస్టుల వద్ద ఉగ్రవాదులు దాడులకు పాల్పడేందుకు యత్నించగా విజయవంతంగా తిప్పికొట్టినట్లు అఫ్గాన్‌ నేషనల్‌ ఆర్మీ అధికారులు తెలిపారు.

05/09/2016 - 00:37

బీజింగ్, మే 8: చైనాలోని ఫుజియన్ ప్రావెన్స్‌లో కురిసిన భారీ వర్షాలకు మట్టిపెళ్లలు విరిగిపడటంతో 35 మంది గల్లంతుకాగా, ఏడుగురు గాయాలతో బయటపడ్డారు. ఫుజియన్‌లో నిర్మిస్తున్న ఒక హైడ్రో పవర్ ప్లాంట్ వద్ద ఈ దుర్ఘటన జరిగింది. పవర్ ప్లాంట్ సిబ్బంది ఏర్పాటు చేసుకున్న తాత్కాలిక షెడ్‌పై మట్టిపెళ్లలు పడటంతో సిబ్బందిలోని 35 మంది గల్లంతయ్యారు. వారికోసం గాలింపు చర్యలను తీవ్రం చేశారు.

05/09/2016 - 00:33

కరాచి, మే 8: పాకిస్తాన్‌లోని సింధ్ రాష్ట్రంలో 11 ఏళ్ల హిందూ బాలుడిపై అత్యాచారం చేసి దారుణంగా చంపేసిన సంఘటన పెద్ద ఎత్తున ఆందోళనలకు దారితీసింది. సింధ్ రాష్ట్రంలోని హైదరాబాద్ క్లబ్‌లో గత నెల 13న ఈ సంఘటన చోటుచేసుకుంది.

Pages