S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

05/18/2016 - 07:27

దుబాయ్, మే 17: అమెరికా అ ధ్యక్ష పదవి నుంచి త్వరలో వైదొలగనున్న బరాక్ హుస్సేన్ ఒబామా ఇస్లామ్ మతం గురించి సరిగా అర్థం చేసుకునేందుకు వీలుగా తన సంస్థలో ఉద్యోగం ఇస్తానని దుబాయ్‌కి చెందిన ఈసా బిన్ హైదర్ అనే న్యాయవాది ప్రకటించాడు.

05/18/2016 - 06:46

ఓడ పేరు - హార్మనీ ఆఫ్ సీస్
బరువు - 1,20,000 టన్నులు
వెడల్పు - 66 మీటర్లు (217 అడుగులు)
ఎత్తు - 362 మీటర్లు
(ఈఫిల్ టవర్ కంటే 50మీటర్లు ఎక్కువ)
అంతస్థులు - 16
ప్రయాణికులు - 6360
సిబ్బంది - 2100
నిర్మాణ ఖర్చు - 100 కోట్ల డాలర్లు

05/18/2016 - 06:39

బాగ్దాద్, మే 17: ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లో షియాలు అధిక సంఖ్యలో ఉండే నివాస ప్రాంతాల్లోని మార్కెట్లలో మంగళవారం సంభవించిన వరస బాంబు పేలుళ్లలో కనీసం 54 మంది చనిపోగా, దాదాపు వందమంది దాకా గాయపడ్డారు. మొదట ఆరుబయలు మార్కెట్‌కు చుట్టూ ఉన్న ప్రహరీ గోడకు వెలుపల ఒక బాంబు పేలింది. ఆ పేలుడులో గాయపడిన వారికి సాయపడడం కోసం జనం చేరినప్పుడు వారి మధ్యలో ఓ మానవ బాంబు పేల్చేసుకున్నాడని ఓ పోలీసు అధికారి చెప్పారు.

05/18/2016 - 06:36

వాషింగ్టన్, మే 17: తీవ్రమైన జనన లోపాలతో ప్రపంచాన్ని వణికిస్తున్న జికా వైరస్‌ను క్లోన్ చేయటంలో శాస్తవ్రేత్తలు విజయం సాధించారు. జికా నిర్మూలనకు అవసరమైన వ్యాక్సిన్, చికిత్స విధానాల రూపకల్పనలో ఈ క్లోనింగ్ బాగా ఉపయోగపడుతుందని శాస్తవ్రేత్తలు భావిస్తున్నారు. 2007 నుంచి వివిధ దేశాల్లో వ్యాపిస్తూ వచ్చిన జికా.. తీవ్రమైన జనన లోపాలకు కారణమవుతున్న సంగతి తెలిసిందే. చిన్న తలలతో శిశువులు జన్మించటం..

05/17/2016 - 08:00

బీజింగ్, మే 16: సరిహద్దు సమస్య పరిష్కారానికి భారత్ చైనాలు చేస్తున్న ప్రయత్నాలను గౌరవించాలని అమెరికాకు చైనా హితవు చెప్పింది. భారత్ సరిహద్దుల్లో చైనా అదనపు బలగాలను మోహరించినట్లు అమెరికా రక్షణ మంత్రిత్వశాఖ ప్రధాన కేంద్రం పెంటగాన్ తాజాగా తన 2016 వార్షిక నివేదికలో హెచ్చరించటంపై చైనా తీవ్రంగా మండిపడింది. ‘మేము భారత్‌తో సరిహద్దు సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవటానికి ప్రయత్నిస్తున్నాం.

05/16/2016 - 07:17

బీజింగ్, మే 15: పెళ్లికాని ఓ యువకుడు మూడేళ్ల క్రితం మరణించాడు. పెళ్లికాని మరో యువతి ఇటీవలే గతించింది. అయితేనేం... వారిద్దరికీ ఆదివారం పెళ్లి జరిగింది. ఆశ్చర్యంగానూ, భయం కలిగించేదిగానూ ఉంది కదూ... ఒక్క ముక్కలో చెప్పాలంటే అది ‘ఆత్మల వివాహం’... ఇంకా చెప్పాలంటే ‘మరణానంతర వివాహం’! ఇది చైనా గ్రామీణ ప్రాంతంలో ఇప్పటికీ కొనసాగుతున్న ఈ ఆచారం అతి ప్రాచీనమైనదే కాదు, ప్రసిద్ధి చెందింది కూడా.

05/15/2016 - 02:30

వాషింగ్టన్, మే 14: అమెరికాలో రిపబ్లికన్ పార్టీ క్రమేణా డొనాల్డ్ ట్రంప్ వైపు మొగ్గు చూపుతోంది. అధ్యక్ష ఎన్నికల్లో బరిలోకి దిగిన రిపబ్లికన్ పార్టీ అభ్యర్థుల్లో అందరికంటే ముందున్న డొనాల్డ్ ట్రంప్ అభ్యర్థిత్వాన్ని ప్రతినిధుల సభలోని తొమ్మిది పార్లమెంటరీ కమిటీల చైర్మన్లు ఆమోదించడం ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. ‘జీవిత కాలంలోనే అత్యంత ముఖ్యమైన ఈ ఎన్నికల్లో మేము ఏటవాలు శిఖరంపై నిలబడి ఉన్నాం.

05/15/2016 - 02:17

వాషింగ్టన్, మే 14: ఇండో-అమెరికా ఫ్యాషన్ డిజైనర్ నరుూమ్ ఖాన్ రూపొందించిన దుస్తుల్లో అమెరికా ప్రథమ మహిళ మిషెల్లీ ఒబామా మరోసారి మెరిసిపోయింది. నార్డిక్ దేశాల నాయకుల గౌరవార్థం అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా శుక్రవారం ఏర్పాటు చేసిన విందు కార్యక్రమంలో ఆమె నరుూమ్ రూపొందించిన దుస్తుల్లో తళుక్కుమన్నారు. మిషెల్లీకి అత్యంత ఇష్టమైన ఫ్యాషన్ డిజైనర్లలో నరుూమ్ ఒకరు.

05/15/2016 - 02:14

వాషింగ్టన్, మే 14: క్షిపణి సాంకేతిక పరిజ్ఞాన నియంత్రణ సంస్థ (ఎంటిసిఆర్) నిర్దేశించిన అర్హతలను భారత్ సాధించిందని, అణు పదార్థాల సరఫరాదారుల గ్రూప్ (ఎన్‌ఎస్‌జి)లో చేరడానికి సిద్ధంగా ఉందని అమెరికా ప్రకటించింది. అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జాన్ కిర్బి శుక్రవారం ఇక్కడ ఈ విషయం చెప్పారు.

Pages