S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

09/25/2018 - 01:45

యాంగన్, సెప్టెంబర్ 24: ఐరాసపై మైన్మార్ సైనికాధినేత ధిక్కార స్వరాన్ని వినిపించారు. మైన్మార్ స్వార్వభౌమత్యానికి సంబంధించిన అంశాలపై జోక్యం చేసుకునే అధికారం ఐక్యరాజ్య సమితికి ఎంత మాత్రం లేదని ఆర్మీచీఫ్ మిన్ అంగ్ హాయింగ్ తేల్చిచెప్పారు.

09/25/2018 - 01:43

వాషింగ్టన్, సెప్టెంబర్ 24: తమతో చర్చలు జరిపేందుకు భారత్ విముఖంగా ఉన్నప్పటికీ దక్షిణాసియా ప్రాంతంలో శాంతి స్థాపన ప్రయత్నాలను తాము కొనసాగిస్తూనే ఉంటామని పాకిస్తాన్ స్పష్టం చేసింది. కాశ్మీర్‌లో ముగ్గురు పోలీసుల హత్య నేపథ్యంలో పాక్ విదేశాంగ మంత్రితో జరుపతలపెట్టిన చర్చలను భారత్ రద్దు చేసుకున్న నేపథ్యంలో ఆ దేశ విదేశాంగ మంత్రి ఖురేషీ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

09/25/2018 - 01:04

న్యూయార్క్, సెప్టెంబర్ 24: ‘ భారత్ అంటే నాకెంతోప్రేమ. నా మిత్రుడు నరేంద్ర మోదీకి నా అభినందనలు తెలపండి’అంటూ భారత్ విదేశాగ మంత్రి సుష్మా స్వరాజ్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఐరాస జనరల్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా వీరిద్దరి మధ్య కొద్దిసేపుమాటలు సాగాయి. మాదక ద్రవాల నిరోధనపై మాట్లాడిన ట్రంప్ తన ప్రసంగాన్ని ముగించుకుని వేదిక నుంచి వెళ్లిపోయారు.

09/24/2018 - 04:22

ఇస్లామాబాద్, సెప్టెంబర్ 23: భారత్‌తో చర్చలకు ఎందుకు తొందరపడ్డారని, ఈ విషయంలో ముందుగా అవసరమైన ప్రణాళిక లేకుండా ప్రధాని ఇమ్రాన్ ఖాన్ దూకుడుగా వ్యవహరించడం తగదని ప్రధాన ప్రతిపక్ష పార్టీలు విమర్శించాయి. ఇరుదేశాల మంత్రుల మధ్య మీటింగ్ అంటే ప్రత్యేక వ్యూహ రచన, ముందస్తు ప్రణాళిక ఉండాలన్నారు. దౌత్యపరంగా పాకిస్తాన్ అంతర్జాతీయంగా ఏకాకి కావడానికి ఇమ్రాన్ చర్యలు దోహదపడుతాయన్నారు.

09/24/2018 - 02:10

లండన్, సెప్టెంబర్ 23: మొదటి ప్రపంచ యుద్ధంలో బ్రిటన్ తరఫున అవిభక్త భారత్ నుంచి దాదాపు 1.3 మిలియన్ల మంది సైనికులు యుద్ధం చేశారు. కాని వారి పట్ల బ్రిటన్ ప్రభుత్వం వివక్ష ప్రదర్శించిందని చెప్పేందుకు కీలకమైన డాక్యుమెంట్లు లభించాయి. ఈ వివరాలు బ్రిటన్ లైబ్రరీలోని డాక్యుమెంట్లలో అప్పటి ఆర్మీ డాక్టర్లు పొందుపరిచారు.

09/23/2018 - 01:56

ఇస్లామాబాద్, సెప్టెంబర్ 22: భారత్, పాక్ మధ్య న్యూయార్కులో చర్చల ప్రక్రియను భారత్ ఏకపక్షంగా రద్దు చేయడంపై పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మండిపడ్డారు. ఈ నిర్ణయాన్ని భారత్ దుందుడుకు వైఖరిని తెలియచేస్తుందన్నారు. భారత్ ప్రతికూల నిర్ణయం తనను నిరాశకు గురి చేసిందన్నారు. తన జీవిత కాలంలోదార్శనికత లేని పెద్ద మనుషులు చిన్న బుద్ధులు కలిగి ఉండడాన్ని చూశాను అని ఇమ్రాన్ ఖాన్ పేర్కొన్నారు.

09/23/2018 - 01:54

టెహ్రాన్, సెప్టెంబర్ 22: ఇరాన్‌లో సైనిక కవాతుపై శనివారం ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో 24 మంది మృతి చెందగా, 53 మంది గాయపడ్డారు. ఇరాన్‌లోని చమురు సంపద అధికంగా గల నైరుతి ప్రాంతమయిన అహ్వాజ్‌లో నిర్వహిస్తున్న మిలటరీ పరేడ్‌పై ఈ దాడి జరిగింది. అయితే, ఈ దాడికి పాల్పడింది తామేనని ఇప్పటి వరకు ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటించలేదు.

09/23/2018 - 01:50

వాషింగ్టన్, సెప్టెంబర్ 22: 2017వ సంవత్సరంలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు చేసిన కృషిలో గణనీయమయిన పురోగతిని సాధించిన 14 దేశాలలో భారత్ ఉందని అమెరికా విడుదల చేసిన ఒక నివేదిక వెల్లడించింది.

09/23/2018 - 01:30

వాషింగ్టన్, సెప్టెంబర్ 22: అమెరికాలో పనిచేస్తున్న భారతీయ దంపతులకు పిడుగులాంటి వార్త. హెచ్- 4 వీసాదారుల పని వీసాలను రద్దుచేస్తామంటూ ఇంతకాలం ప్రకటిస్తూ వచ్చిన డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం మూడు నెలల్లోనే దానిపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించింది. దీంతో హెచ్- 1 బీ వీసాలపై అమెరికాలో పనిచేస్తున్న భారతీయుల జీవిత భాగస్వాములకు కష్టాలు తప్పని పరిస్థితి వస్తోంది.

09/22/2018 - 05:09

ఐక్యరాజ్యసమితి: వచ్చే వారం జరగనున్న ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో సిరియా, యెమెన్‌లో అల్లకల్లోలంతో పాటు పర్యావరణం-వాతావరణ మార్పులు, వివిధ దేశాల్లో చోటు చేసుకుంటున్న శాంతి సాధనకు తీసుకుంటున్న చర్యలపై వాడీవేడిగా చర్చ జరిగే అవకాశం ఉంది.

Pages