S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

03/15/2018 - 22:21

బలవంతపెడితే అమృతం కూడా చేదుగా ఉంటుంది. కష్టంగా ఏదైనా చేయమంటే బాధేస్తుంది.
అదే ఇష్టమైతే ఎంత కష్టమైనా సులభంగా చేసే పనిని మెళుకువతో నేర్పుగా చేసేస్తారు.

03/14/2018 - 22:12

మనమంతా అమితంగా ఇష్టపడే అష్టయశ్వరాలలో- అన్నిటికన్నా అమూల్యమైనది ‘ఆరోగ్య భాగ్య’మనే ఐశ్వర్యమంటే అతిశయోక్తి కాదేమో! అదే నిజం కూడా! కానీ మానవుల ‘జిహ్వ’ చాపల్యం అటువంటి అమూల్యమైన ఐశ్వర్యాన్ని మనకి అందకుండా చేస్తుంది. ఆరోగ్యంగా వుండడానికి ‘ఆహారం’ ఎంత ముఖ్యమో- అదే ‘ఆరోగ్యం’ పాడయిపోవడానికి దోహదపడేది కూడా అసంతులిత ఆహారమే!

03/13/2018 - 21:56

‘ప్రపంచమంతా నేడు బాలికల వైపు ఆసక్తిగా చూస్తోంది.. అసాధ్యాలను సుసాధ్యం చేసే అద్భుత శక్తి అమ్మాయిల్లోనే ఉంది.. విశ్వవ్యాప్తంగా చట్టసభల్లో, న్యాయస్థానాల్లో, కార్పొరేట్ సంస్థల్లో, విశ్వవిద్యాలయాల్లో మీ భాగస్వామ్యం పెరగాలి.. ఇవన్నీ నెరవేరాలంటే అక్షరాస్యతలో బాలికలు అగ్రభాగాన నిలవాలి..’- అంటూ గతంలో అమెరికా చేపట్టిన ప్రచార ఉద్యమానికి దేశదేశాల్లో అనూహ్య మద్దతు లభించింది.

03/12/2018 - 23:12

ప్రాచీన కాలంనుంచి భారతదేశ వ్యవస్థలో స్ర్తిలది గౌరవప్రదమైన స్థానమే! భారతదేశంలో దేవతలు (దేవులు) అందరూ స్ర్తిమూర్తులే! భారతదేశాన్ని కూడా స్ర్తిగానే ఎంచి ‘్భరతమాత’గా ఆరాధించి, గౌరవించారు! నాటి ఋషులు, మునులు, తాపసులు దేవీ ఉపాసకులు! పురుషుల పేరు కన్నా ముందు స్ర్తి పేరేవచ్చేది / వస్తోంది.. లక్ష్మీనారాయణులు, పార్వతీ పరమేశ్వరులు, సీతారాములు, రాధాకృష్ణులు వగైరాలుగా.. ఎప్పటి సంగతో ఎందుకు...

03/11/2018 - 20:49

ఏవైనా మహిళలకు సంబంధించిన కార్యక్రమాలు జరిగినప్పుడు ఆ కార్యక్రమాలకు హాజరయ్యే పెద్దలు మహిళల అభివృద్ధి పట్ల ప్రసంగాల్లో దంచేస్తారు. ఆ ఘాటు ప్రసంగాలన్నీ అక్కడి వరకే.. కార్యరూపం శూన్యం. అయితే అనంతపురం జిల్లాలోని రూరల్ డెవ్‌లప్‌మెంట్ ట్రస్ట్ ( ఆర్డీటి) మహిళల అభివృద్ధికి ప్రాముఖ్యతనిచ్చి అనేక కార్యక్రమాలను చేబడుతోంది.

03/09/2018 - 21:14

మన దేశంలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా స్ర్తిలు శారీరక, మానసిక, లైంగిక, ఆర్థిక హింసకు బలవుతున్నారు. మహిళలపై హింసకు సంబంధించి ఐక్యరాజ్యసమితి విడుదల చేసిన నివేదికలో ఎన్నో దిగ్భ్రాంతికరమైన నిజాలు వున్నాయి. ఆదిమ సమాజంలో పురుషునితో సమానంగా స్ర్తి స్వేచ్ఛ అనుభవించింది. ‘‘అడవికి వెళ్ళా - పిట్టను కొట్టా - పొయ్యిలో పెట్టా’’ అనేంత కాలం స్ర్తి స్వేచ్ఛకు ఆటంకం రాలేదు.

03/08/2018 - 20:49

మహిళా దినోత్సవాన్ని జరుపుకున్న సందర్భంగా ముందుగా మహిళలందరికీ శుభాకాంక్షలు! గడప దాటిరానివాళ్ళం ఈనాడు రాజకీయ సింహాసనాలు మనవే. ప్రతి ఉన్నత స్థానంలో మహిళలే. ప్రధానమంత్రి పదవినుంచి అన్నింటా తామై నిలుస్తున్నాం. ఎవరెస్ట్ అంత ఎత్తుకి ఎదగడం కాదు అక్కడా పతాకాన్ని ఎగురవేశారు. విమానాల్లో ఎయిర్‌హోస్టెస్‌గా ఉండటమే గొప్ప అనుకుంటుంటే పైలట్స్‌గా రాణించారు. యుద్ధ విమానాలను కూడా నడిపేస్తున్నారు.

03/07/2018 - 23:18

చాలా చోట్ల స్థానిక సంస్థల్లో పలువురు రాజకీయ నాయకులకు పట్టు ఉంది. అయితే ఆయా చోట్ల మహిళా రిజర్వేషన్ వస్తే తమ కుటుంబంలోని వారిని, అనుచర కుటుంబాల్లోని మహిళలను ఎన్నికల్లో పోటీ చేయించి గెలిపించుకుంటున్నారు. వారిని నామమాత్రంగా కూర్చోబెట్టి అధికారం చెలాయిస్తున్నారు. అధికారిక సమావేశాల్లో కూడా వారే నిర్ణయాలు తీసుకుంటున్నారు.

03/06/2018 - 21:32

సమయపాలన అందరికీ అవసరమే... కేవలం విద్యార్థులు సమయపాలన పాటిస్తే చాలంటుంటారు కొంతమంది. కాదు నేడు ఇంట్లో ఉన్న వారంతా ఏదో ఒక పనుల మీద బయటకు వెళ్లేవాళ్లే ఎక్కువగా ఉంటున్నారు. అందరికీ అన్నీ సమయానికి ఇవ్వవలసిన బాధ్యత మాత్రం అందరికన్నా ఎక్కువగా మహిళలమీదే ఉంది.

03/05/2018 - 22:20

డియర్ పద్మా...,
ఉభయకుశలోపరి. నీ ఉత్తరం అందింది.

Pages