S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

04/10/2018 - 21:00

మానవులు- సామాన్యంగా ఎక్కువగా ప్రాధాన్యం ఇచ్చేది శరీర సుఖానికే. రుచికరమైన తిండి, సుఖవంతమైన నిద్ర, నచ్చిన వాటిపై కోరిక స్వంతం చేసుకోవాలనే తపన. ఇది నేడు సామాన్యంగా మానవుల జీవనంలో కనిపించే విషయాలు తిండి, గృహం, బట్ట మొదలైన వాటికై ధనం సంపాదన ఉండేవి. నిజమే శరీర నిర్వహణ తప్పనిసరిగా ద్రవ్యం అవసరం. ధనంతో నేడు అవసరాలన్నీ సమకూరుతాయి. అందుకని ధన సంపాదన అవసరం. అది ఎంత వరకో అంతవకు అయితే బాగుంటుంది.

04/09/2018 - 21:18

ముఖానికి ప్రత్యేక సౌందర్యాన్ని ఇచ్చేవి కళ్లు. వేసవిలో మండుతున్న ఎండల వేడికి కంటిలో తేమ కూడా అవిరై పోతుంటుంది. ఫలితంగా కళ్లు ఎర్ర బడటం, దురద, మంటలతో పాటు కంట్లో ఇసుక ఉన్నట్లు బాధ.. పైగా వైరస్ వల్ల ఎదురయ్యే కళ్ల కలక.. ఇలాంటి ఎన్నో సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి వేసవికాలంలో కళ్లను సంరక్షించుకోవడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.
*

04/08/2018 - 21:31

ఉద్యోగాలు చేసే మహిళలైనా, కొత్తగా కాపురం పెట్టిన కొత్త కోడళ్ళైనా ఇంట్లో తప్పనిసరిగా చేయాల్సిన పనులు కొన్ని ఉంటాయి. రోజూ క్రమం తప్పకుండా కొన్ని వస్తువులను శుభ్రం చేయాలి. లేకుండా అవి అందర్నీ చికాకు పరుస్తాయి. కొంతమంది ఏ పనైనా వారాంతంలో లేదా ఆదివారం శుభ్రం చేద్దామనుకుని వదిలేస్తుంటారు. ఆ పద్ధతి ఎప్పుడూ సరికాదు. ప్రతిరోజూ శుభ పరచుకోవాల్సిన వస్తువులేమిటో ఒకసారి పరిశీలిద్దాం.

04/05/2018 - 21:17

వేసవికాలం వేడెక్కిస్తోంది. చర్మం, జుట్టుతో పాటు కళ్లనూ కాపాడుకోవాలి. చలువకళ్లద్దాలు వాడితే అందంతో పాటు ఆరోగ్యం కూడా.. వేసవిలో బయటకు వెళ్లాల్సి వస్తే తప్పనిసరిగా కళ్లద్దాలు ధరించాలి. ఎందుకంటే ఈ అద్దాలు ప్రమాదకరమైన అతినీలలోహిత కిరణాలను మన కంటివరకు చేరనివ్వకుండా అడ్డుపడతాయి. వేసవిలో కళ్లకలక వచ్చే అవకాశాలు ఎక్కువ.

04/04/2018 - 22:32

కొంతమంది కొన్ని సందర్భాలల్లో ఎదుటివారితో మాట్లాడేటపుడు చాలా మొహమాటపడుతుంటారు. మరికొన్ని సందర్భాల్లో ఇష్టమైన వస్తువులు ఎదురుగా ఉన్నా వాటిని ఎదుటివాళ్లు తీసుకోమని చెబుతున్నా సరే వీరు తీసుకోలేక వద్దు వద్దండి, చాలండి అని చెబుతుంటారు. మనసులో నేమో తీసుకోవాలని ఉంటుంది. పైకిమాత్రం చెప్పలేరు.

04/03/2018 - 23:59

అనుకొన్నది సాధించేది మహిళలే. అందుకే నేటి కార్యాలయాల్లోకూడా మహిళలను కీలక పోస్టుల్లో నియమించడానికి ముందుకు వస్తున్నారు. ఇంతకుముందుకాలంలో వంటింటికే పరిమితం గా ఉన్నా కూడా నేడు మాకు పరిమితన్నది లేదని నిరూపిస్తున్నారు.

04/01/2018 - 22:27

ఒక్క ఇల్లాలునే ఇంట్లో స్వచ్ఛమైన వాతావరణాన్ని తేగలదు. పరిశుభ్రతను నెలకొల్పగలదు. ఇంట్లో ఉన్నవారందరి చిన్న పెద్దా అందరి ఆరోగ్యాన్ని రక్షించగలదు. అందుకే ఇంటిని చూసి ఇల్లాలిని చూడండి అన్నారు. ఇంట్లో ఏ వస్తువు ఎక్కడ పెట్టాలన్నా, ఏ వస్తువును ఎంత మేరకు తినాలన్నా అందరూ ఆ ఇల్లాలు మీదనే నేటికీ ఆధారపడుతునే ఉన్నారు.

04/01/2018 - 22:25

పది కాలాలపాటు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండి, సమాజానికి మేలు చేస్తేనే మానవ జన్మకు సార్థకత. ఇలా ఉండాలంటే, ప్రతీ ఒక్కరూ తప్పక పాటించాల్సిన పద్ధతులు బోలెడు ఉన్నాయి. అబ్బే... టైం లేదు... అంతా బిజీబీజీ అయిపోతున్నాం... అంటున్నా వారిని తరచూ చూస్తుంటాం. అసలు ఈ బిజీబిజీ దేనికని ఒకమారు ప్రశ్నించుకుంటే, అసలు సంగతి బోధపడుతుంది.

03/30/2018 - 21:22

స్ర్తిశక్తిస్వరూపిణి. స్ర్తి సృష్టిస్థితి లయకారిణి. తన కనుసన్నులలో ప్రకృతి నంతా పచ్చదనంతో అలరారేట్లుచేస్తుంది. ఆమె రుద్రరూపిణిగా మారితే ప్రళయం ఎదుర్కోవలసి వస్తుంది. ఎంత సున్నిత మనస్కురాలో కాఠిన్యం వహిస్తే అంత వజ్రసదృశరూపిణిగా కూడా కనబడుతుంది.

03/28/2018 - 21:29

టెక్నాలజీ.. ఇది లేని మానవ జీవితం ఊహించలేం మనం. ముఖ్యంగా ఇంటర్నెట్ వచ్చిన తరువాత మనిషి ప్రతి కదలికనూ టెక్నాలజీయే శాసిస్తోందంటే అతిశయోక్తికాదు. ఈ కొత్త మిలీనియం తరానికి చెందిన వారికైతే (వీరినే జనరేషన్ జడ్ అంటున్నారు) టెక్నాలజీయే సర్వస్వం అయిపోయింది. ఈ కొత్త తరానికి చెందిన ప్రతి ఒక్కరూ ఆన్‌లైన్‌లో తమ ఉనికిని చాటుకోడానికి తహతహ లాడుతున్నారు.

Pages