S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

03/02/2018 - 22:35

ప్రాణులన్నింటికీ ప్రకృతే తల్లి. తండ్రి శ్రీమన్నారాయణుడు. ఇది ఆధ్యాత్మిక వాదులుచెప్పేది. అందరికీ అర్థమయ్యేభాష కాదిది.

03/02/2018 - 22:26

నోటితో వద్దు.. చేతితో చేయి.. అనమంటారు పెద్దలు. ఎందుకంటే కఠినంగా చెప్తే నొచ్చుకుంటారు. అదే చేతల్లో పది ఇచ్చే చోట పరక ఇచ్చినా ఇదిగో ఇది ఉంది తీసుకొని సర్ధుకో అనమంటారు. అపుడు జరగబోయే పోట్లాట నవ్వులాటతో పోతుంది.
ప్రతివారికీ తాను గొప్పగా ఉండాలన్న ఆశ ఉంటుంది. తానే అందరిలోకి అధికంగా ఉండాలన్న ఆశయమూ ఉంటుంది. అయితే దీనికోసం ఒక్కొక్కరూ ఒక్కోపద్ధతిని అలవర్చుకుంటారు.

03/01/2018 - 22:22

‘‘దేవ భాష అయిన సంస్కృతానికి అతి దగ్గరగా ఉన్న భాష తెలుగు ఒక్కటే. తెలుగులో ఉన్న మాధుర్యం మరి ఏ భాషలోను లేదు. తెలుగువారు తమ భాష యొక్క విలువ తెలుసుకోవడం లేదు సరికదా దానిని చిన్న చూపు చూస్తూ పెరటిలోని మొక్క ఔషధానికి పనికిరాదన్నట్లు భావిస్తున్నారు’’.

03/01/2018 - 02:19

సాధించాలని ఉండాలే కాని ఏవీ ఆటంకాలేవీ ఆటంకపర్చలేవు.పట్టుదల, లక్ష్యం లాంటివి ఉంటే చాలు గమ్యాన్ని నిశ్చయంగా చేరవచ్చు అని చరిత్రలో ఎందరో మహామహులు చాటిచెప్పారు. ఆకాశంలో సగం అనే మహిళలు అన్ని రంగాల్లో దూసుకెళ్లుతూ అన్నీ అవకాశాలను మేము సద్వినియోగం చేసుకొంటున్నాము అని నిరూపిస్తున్నారు.

02/27/2018 - 22:01

కొందరు ఆడవాళ్లు కాళ్లనిండా పసుపు పూసుకొని, ముఖాన కుంకుమ బొట్టు పెట్టుకొని, చేతులకు గాజులు, మెళ్లో హారాలు, పట్టుచీరనో ఆమెకు తగ్గ చీరేదో కట్టుకొని మూర్త్భీవించి స్ర్తితత్వంలాగా కనిపిస్తుంటారు. ఒకటే గుళ్లు గోపురాలకు ప్రతిరోజు వెళ్తుంటారు. మరికొందరు అందంగా అలంకరించుకొని మహిళామండలులకు క్రమం తప్పకుండా వెళ్తుంటారు. గుడికి వెళ్లి అందరికోసం మొక్కుతున్నామని చెబుతుంటారు.

02/26/2018 - 22:20

ప్రతి వ్యక్తికీ, ప్రతి కుటుంబానికీ, ప్రతి ప్రదేశానికీ అందరికీ బహిరంగంగా తెలిసిన విషయాలతోపాటు.. ఎవరికీ తెలియకూడని వ్యక్తిగత, కుటుంబపర విషయాలు కూడా కొన్ని ఉంటాయి. మానవ సంబంధాలకు, మానసిక బలహీనతలకు, ప్రవర్తనా లోపాలకు ఇలా అనేక కారణాలకు సంబంధించిన ఆ రహస్యాలు మనిషి మనసులో అంతర్గతంగా.. ఇంటి గుట్టులో భద్రంగా ఉంటేనే ఆ మనిషి పరువు ప్రతిష్ఠలు, కుటుంబ గౌరవం సమాజంలో పదిలంగా ఉంటాయి.

02/25/2018 - 19:30

నిండు జాబిలిని చూపిస్తూ ఏవేవో ఊసులు చెప్తూ తన రెండేళ్ల కుమారుడికి అన్నం తినిపిస్తోంది. ఓ అమ్మ.. పిల్లాడి బొజ్జనిండా బువ్వెట్టిన అమ్మ తన దిష్టే తన బిడ్డకు తగులుద్దేమోనని చివర్లో ఓ ముద్ద దిష్టిగా తీసి పడేసింది. టౌనుకెళ్లిన భర్త మరుసటిరోజు వరకు రాడు బిడ్డను ఆడించుకుంటూ నిద్రపుచ్చి తానూ నిద్రపోయింది ఆ అమ్మ. అర్థరాత్రి సమయంలో ఆ చంటోడు ఒకటే ఏడుపు. బిడ్డ ఏడుపుని చూసి కడపున తడిమింది.

02/23/2018 - 21:01

కేరళ రాష్ట్రంలోని చూర్ణిక్కార ఓ కుగ్రామం. ప్రధాన మార్గానికి ఇరువైపుల చాల సంవత్సరాల కిందట అధిక దిగుబడినిచ్చే పొలాలు చూపురులకు కనువిందు చేసేవి. అయితే, ఆ గ్రామంలోని రైతులంతా జీవనోపాధి కోసం వేరే వృత్తులు స్వీకరించడంతో ఆ వరి పొలాలన్నీ ప్రస్తుతం చెత్తకుప్పలుగా మారిపోయాయి. అంతేకాకుండా ఆ ప్రాంతమంతటా భూగర్భ జల నిక్షేపాలు దాదాపుగా అడుగంటిపోయాయి.

02/22/2018 - 21:06

ఆత్మజ్ఞానాన్ని పొందడానికి స్ర్తిపురుష వివక్షలేదు. వయో విద్యార్హతలు లేవు. భౌతిక విషయాలపట్ల వైరాగ్యం చూపగలిగినవారికి వెంటనే శివసాక్షాత్కారం లభిస్తుందని జ్ఞానులు చెప్తారు. అటువంటి ఆత్మజ్ఞానాన్ని పొందిన లలనామణి లల్లేశ్వరీ దేవి. ఈమె కాశ్మీర బ్రాహ్మణ కుటుంబంలో క్రీ.శ. 1355 సం.లో పండ్రెథాన్ గ్రామంలో లల్లేశ్వరి జన్మించారు. . చిన్న వయసునుండీ మనస్సులో భక్తి భావాన్ని పెంపొందించు కున్నారు.

02/21/2018 - 20:54

ఇంట్లో చాలామంది గలగలామాట్లాడేస్తుంటారు. అదే నలుగురిలోకి వెళ్లి మాట్లాడమంటే తడబడుతుంటారు. నేటికాలంలోమహిళామండలులు ప్రతి కాలనీకి ఒక్కటి ఉన్నాయి. ఆ మహిళామండలిలోనో లేక ఏ టీవీ చానల్ వాళ్లో వచ్చి నాలుగు మాటలు చెప్పండి అని అడిగితే చాలు గొంతు తడారిపోతుంటుంది. మాటలు పెగలవు. ఎందుకిలా జరుగుతోంది.

Pages