S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకృష్ణ లీలారింఛోళి

07/16/2019 - 19:28

పంక్తి భోజన సంస్కృతిఁబార ఁ ద్రోలె
బిచ్చమెత్తెడి రీతిన వేగఁబోయి
చేతఁబళ్ళాలు పడుదురే చిత్రరీతి
చూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!
భావం: పంక్త్భిజన సంస్కృతిని బారద్రోలారు. బిచ్చమెత్తిన విధంగా త్వరత్వరగా పోయి చేతులతో పళ్లాలు పట్టుకుని బారులు కడుతున్నారు. కర్మసాక్షివైన ఓ సూర్యదేవ చూడవయ్య!
ఇంట వండినవౌ పిండివంటలేవి
నేటివారికి నచ్చక బైటకరిగి

07/15/2019 - 19:45

అంతరంగాననున్నట్టి యార్గురైన
కామక్రోధాది శత్రుమూకలనుఁ దరుమఁ
గొట్టఁ బూనరు పోషించు కునెదరకట
చూడుమో కర్మసాక్షి! యోసూర్యదేవ!
భావం: అంతరంగాన కొలువు దీరిన అరిషడ్వర్గమైన కామక్రోధలో భమోహమదమాత్సర్యాలను తరిమిగొట్టరు. సరికాదా! పెంచి పోషించుకుంటున్నారు. అయ్యో! కర్మసాక్షివైన ఓ సూర్యదేవ! చూడవయ్య.
ముసలి వారన్న వారల మూల్గులన్న
స్వంత రక్తంబునకసహ్యమింత దయయు

07/10/2019 - 18:57

కనగ నిజభక్త తతికెల్ల కల్పవృక్ష
మై దయారసాంబోనిధి యైనవాడు
పరమ పురుషుండు గోపాలబాలకుండు
వరముల నొసంగి మనల కాపాడుగాక!
శ్రీరమామధవుండు చిత్తజుజనకుండు
గరుడవాహనుండు ఘనగుణుండు
పరమపావనుండు పంకజనేత్రుండు
అభయ దాయి యగుచు శుభములొసగు
లచ్చికి హృదయంబున చో
టిచ్చిన నవమోహనునకు ఇంద్రాదిసురల్
నిచ్చలు గొల్చెడు వానికి

07/09/2019 - 19:45

పట్టబట్టియు హరిని చేపట్టినట్టి
ముద్దు పట్టి రక్మిణిన్ పొగడిరంత
సుప్రసన్నముగ సుభద్రచూచె హరిని
భీష్మకుని భాగ్యమున్ గని వే విధముల
ప్రస్తుతించిరి కుండిన పౌరులెల్ల
విదిత రుక్మిణీ కల్యాణ వేళ లోన

07/08/2019 - 18:48

లేమియను మాట తన వీట లేక యుండ
నవ నిధుల నిల్పి సర్వమానవుల గాచి
ఎంచ సమసమాజమును సాధించినట్టి
ద్వారకా ధీశ్వరునకిదె వందనమ్ము

07/05/2019 - 19:41

బాలకృష్ణుని మాయ
వెన్న తినుచును దొరకని వేణుధరుని
వనితలు తలకొక్క హరిని పట్టి తీగ
ఆ యశోదమ్మ ఒడిలోన ఆడుకొనుచు
చిన్ని నవ్వు రువ్వెడు శౌరి సేమమొసగు

07/04/2019 - 18:47

వీరూ దేవతలే
అతి రహస్యముగ పరముడాహరునకు
పూని బలరామ కృష్ణులు పూజసేయ
శివుడె తావచ్చి తన కేల స్వీకరించె
దాని గన్న సాందీపని తలచెనిట్లు
వీరు మానవ మాత్రులుగారు ధరకు
వచ్చి తిరుగాడు చున్న దేవతలుగానీ

07/03/2019 - 19:42

జగద్గురువు కు గురువు
కనగ అరువది నాలుగు దినములందె
వేద వేదాంగముల నేర్పి విశ్వమందు
అరయ నా జగద్గురువుకు గురువని యెడు
ఖ్యాతి గొన్న సాందీపని కంజలింతు

07/02/2019 - 19:32

ధర్మపరిపాలకుడు
తండ్రిని చెరలో బెట్టియు తానెపట్ట
మంది గర్వించు కంసుని హతము జేసి
ఉగ్రసేనునకున్ రాజ్యమొసగినట్టి
ధర్మపరిపాలకుడ వీవె, ధన్యచరిత

07/01/2019 - 19:52

మంచినీళ్లప్రాయమే!
మున్ను పాషాణమును తాకి ముదిత జేసి
నట్టి నీకు త్రివక్ర అతివనొక్క
చెలవ మొప్పెడు భామగా సేయుటన్న
మంచినీళ్లప్రాయముగదా! మాన్యచరిత!

Pages