S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

05/27/2018 - 22:17

పారే సెలయేరు...
వీచే చల లగాలి.....
స్పర్శించే పచ్చాపచ్చని గడ్డి .....
వీటనన్నింటిని వదిలేసి
ఎక్కడకు నేస్తమా నీ పయనం.....

వడగాలి సోకుతుందనా?
జడివాన కురుస్తుందనా?
పచ్చపచ్చని పచ్చిక
ఎండిపోతుందనా?
ఎక్కడకు నేస్తమా నీ పయనం....

నాలో నవనవోనే్మషం
ఉన్నంతవరకూ
నీ తోడుంటుందనుకొన్నా.......

05/28/2018 - 00:41

జనారణ్యంలో అన్నీ కాంక్రీటు భవనాలే కనిపిస్తాయి. రోడ్డువైపు చూస్తే అన్నీ భారీ వాహనాలే కనిపిస్తాయి. రోడ్టున నడిచివెళ్లేవాళ్లు వేళ్లమీద లెక్కపెట్టవచ్చు. దగ్గర దారి అయిన సరే బుర్రుమని బండీ తీస్తారు. అలా రోడ్లన్నీ చిన్న పెద్దవాహనాలతో నిండి పోయి ఉంటాయి.

05/25/2018 - 21:08

పేద బాలికలంతా బడిబాట పట్టినపుడే ఏ దైశమైనా అభివృద్ధి సాధిస్తుంది. బాలికల విద్య అన్నది ప్రచారం కోసం కాదని, దాన్ని ‘తీవ్రమైన ఆర్థిక అంశం’గా పరిగణించాలని సూచిస్తున్నారు. పేదరికం కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది బాలికలు పనులకు వెళుతున్నారని, సమస్యల నుంచి గట్టెక్కి గెలుపుతీరాన్ని చేరాలంటే వారంతా చదువులో రాణించాలన్నారు. చిన్నపుడు ఏ మాత్రం తీరిక దొరికినా ఏదో ఒక పుస్తకాన్ని చదవడం అలవాటు చేసుకోవాలి.

05/24/2018 - 21:52

ఆసనాల వల్ల మహిళలు ఎనర్జిటిక్‌గా ఉంటారు. ఎక్కడ వంగాలన్నా, లేవాలన్నా తటపటాయంచకుండా పనిని చేసేయగలగాడానికి శరీరానికి కొద్దిపాటి వ్యాయామం అవసరం. అట్లాంటి వ్యాయామాల్లో భుజంగాసనం ఒక్కటి. ఈ ఆసనం అన్నింటిలోకి సులువైనది. ఈ ఆసనం చేసి పూర్తి ఫలితాలను పొందాలంటే ఈ ఆసనం గురించి తెలుసుకొందాం.

05/24/2018 - 21:51

మేడ మిద్దెలో ఉన్నా
పూరి గుడిసెలో ఉన్నా
మహరాణులైనా
పేదరాలైనా
మాతలంతా ఒక్కటే!

వెన్నముద్దలు తిన్నా
జొన్న ముద్దలు తిన్నా
అమ్మ చేతి ముద్ద
అమృతం కన్న మిన్న!
పట్టు పరుపైనా
కటిక నేలనైనా
జోలపాడే అమ్మ
పాటెంత మధురమో

05/24/2018 - 21:49

వారంతా కష్టపడితే కాని కడుపు నిండని బాలికలు.. అమ్మానాన్నలు లేని అనాథలు.. ఇళ్లలో, చిన్న చిన్న ఫ్యాక్టరీల్లో పని చేస్తూ సాయంత్రానికి ఏ నీడకో చేరి సేదతీరుతుంటారు.. ఎవరికీ పట్టని ఈ బాలికలకు ఆటపాటలంటే మహా ఇష్టం.. చెన్నైలోని పలు మురికివాడల్లో ఉంటున్న వీరికి ‘కరుణాలయ’ స్వచ్ఛంద సంస్థ ఆశ్రయం కల్పించింది. ఫుట్‌బాల్ అంటే తెగ ఇష్టపడే ఈ బాలికలు తాము కూడా పెద్ద పెద్ద స్టేడియంలలో ఆడాలని కలలు కనేవారు.

05/23/2018 - 23:39

ఎవరికైనా ఎప్పుడైనా కాస్తంత అలసట వస్తుంది. కొందరికైతే ఎన్నో చేయాలనుకొన్నాం. కాని, సమయం సరిపోవడం లేదు. ఎన్నో ఆలోచనల్లు. వాటిని అమలుపరిస్తేనా .... అంటూ కోతలు కోస్తుంటారు. మరికొద్దిమంది. మేము ఎంతో చేయాలనుకొన్నాం. కాని, ఇదిగో వీరి వల్ల అనుకొన్నది సాధించలేకపోయాం అంటారు. ఇలా వేరొకరి మీద తోయడమో, లేక సమయం చాలలేదని చెప్పడమో కాక అనుకొన్నది అనుకొన్నట్టు గా చేయాలంటే ఒక్కటే మార్గం.

05/23/2018 - 23:28

‘వీడు నా అంత వాడయ్యాడు’ అన్నాడు నాన్న
‘పిచ్చి వెధవ! ఇంకా వీడికి పసితనం పోలేదు
అమ్మ కొంగుపట్టుకు తిరుగుతున్నాడు
ఎలా బ్రతుకుతాడో ఏమో?’ అంటుంది అమ్మ!
ఉన్నత విద్యా ప్రావీణ్యత ఉన్నా, అత్యున్నత అధికారం సంప్రాప్తించినా,
అమ్మచేతి వంట వంటపట్టిన ఫలితమేగా?
నేనేనా? పాతికేళ్లు అమ్మస్పర్శతో ప్రాపంచిక వాసనలు ఆఘ్రాణించింది!

05/22/2018 - 21:31

పిల్లల్లో సృజనాత్మకత, చురుకుదనం పెరగాలంటే చిన్నతనంలోనే పునాది ఉండాలి. చిన్న వయసులో మెదడు అతివేగంగా కొత్త వస్తువులను, అంశాలను గురించి తెలుసుకోవటమే కాక, వాటిని రికార్డ్ చేసుకుంటుంది. అయిదు లేక ఆరు సంవత్సరాల లోపుగా పిల్లలు ఎక్కువ విషయాలను గురించి తెలసుకొంటే వారి మేధస్సు అంతగా వికసిస్తుంది. రికార్డ్ అంటే మనకు గుర్తుకొచ్చేది టేప్‌రికార్డ్. అందులో క్యాసెట్ పెట్టి పాటలు వినేవాళ్లం.

05/22/2018 - 21:23

* ఇంట్లో ఎవరి పనులు వారే చేసుకొనేవారు- అంటే ఉతకడం, పాత్రలు కడగటం, ఇల్లు తుడవడం, శుభ్రపరచడం, తోట పని వంట పనులు చేసేవారికి వ్యాయామం చేసే అవసరం తగ్గుతుంది. వీరు కొద్ది పాటి వ్యాయామం చేస్తే చాలు.
* రోజువారీ పనులు - నడక, సైకిలు ద్వారా చేసుకొనే వారికి సహజంగానే వ్యాయామం లభిస్తుంది.
* ఏ వ్యాయామమైనా క్రమం తప్పకుండా చేయాలి.
* ఏ వ్యాయామం ఆనందాన్నిస్తే అదే చేయవచ్చును.

Pages