S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డైలీ సీరియల్

05/09/2017 - 23:52

ఎప్పుడో చేసిన నేరాలకి కాదు.. వాళ్ళు యిప్పటికీ చాటుమాటుగా అవే నేరాలు చేస్తున్నారు. సంఘంలో పెద్ద మనుషులుగా చెలామణీ అవుతూ చేసిన తప్పులే మళ్లీ మళ్లీ చేస్తూ.. అందుకే వాళ్ళకి ఇంకా యింకా తప్పులు చేసే అవకాశం ఇవ్వకుండా చంపేసేను.. వాళ్ళకేదో అన్యాయం జరిగినట్టు యింత రాద్ధాంతం చేస్తున్నారే.. యిరవై ఏళ్ళుగా నేను అనుభవిస్తున్న నరకానికి ఏమంటారు..

05/07/2017 - 09:20

‘‘ఒక పని చేద్దాం. నీ దగ్గర వున్న అన్ని సాక్ష్యాధారాలతో ‘సాహూ’ మీద ఒక పోలీస్ కంప్లైంట్ ఇయ్యి.. ఇంతవరకూ జరిగిన మొత్తం హత్యలలో అతనే నేరస్థుడనీ, దానికి సంబంధించిన అన్ని సాక్ష్యాలూ కోర్టులో ప్రవేశపెడతామని అందులో వ్రాయి.. దాని ఆధారంగా అతనిని కస్టడీలోకి తీసుకుని ఇంటరాగేట్ చేస్తారు. వాళ్ళు అతనిమీద ఇనె్వస్టిగేట్ చేసి నేరం రుజువైతే కోర్టులో ప్రవేశపెడతారు.

05/06/2017 - 08:32

‘‘మై గాడ్.. అయితే సాహూ ఎప్పుడో యిరవై ఏళ్ళ క్రింద జరిగినదానికి ప్రతీకారంగా యిపుడు ఈ హత్యలు చేస్తున్నాడా’’ ఆశ్చర్యంగా అడిగాడాయన.
‘‘అదే సార్ నాకూ అర్థం కావడంలేదు.. అయితే వెంటనే చంపాలి, లేదూ అప్పుడు చిన్నవాడు.. అంత ధైర్యం, బలం లేవనుకుంటే కనీసం పోలీస్ ఆఫీసర్ అయిన వెంటనే చంపాలి.. అలాంటిది యిన్ని సంవత్సరాలు ఆగి యిప్పుడు చంపడం దేనికో..’’

05/05/2017 - 06:45

‘‘ఆ బాబు భలే సరదా అయిన మనిషి.. ఎప్పుడూ అందరితో కలివిడిగా జోకులేస్తూ నవ్వుతూ, నవ్విస్తూ ఉన్నాడు ఆ వారం రోజులూ. ఇంక రేపు ప్రయాణం అనగా ఆ ఘోరం జరిగిపోయింది. చిత్రంగా ఏ ఆధారం దొరకలేదు. పోలీస్ కుక్కలు కూడా ఏం కనుక్కోలేకపోయాయి.. ఆయన వంటిమీద ఏ వేలిముద్రలూ దొరకలేదు. కానీ గొంతు తాడుతో ఉరేసి చంపినట్టు మాత్రం తెలిసింది. ఊరుగాని ఊరులో యిక్కడ ఆయనకి శత్రువులెవరుంటారు..

05/04/2017 - 05:12

అందుకే నా పుట్టుక, చదువు అన్నీ యిక్కడే.. కాకపోతే యింట్లో మా అమ్మా నాన్నా.. తెలుగు మాత్రమే మాట్లాడేవారు. అందుకే నాకు తెలుగు యింత బాగా వచ్చేసింది.. ఇంక కోర్టులో అంటావా, జడ్జి తెలుగు ఆయనే. కేసుల్ని బట్టి.. తెలుగేతరులయితే హిందీ, యింగ్లీష్ వాడతాం.. ఏదో అలా నడిచిపోతోంది.. యిక్కడి వాతావరణం, మనుష్యులూ అంతా బాగుంటుందయ్యా, అందుకే ఇక్కడే సెటిల్ అయిపోయాం.. అయినా యిప్పుడంతా ప్రపంచీకరణం వచ్చేసింది కదా..

05/02/2017 - 21:19

సుమారు పావు గంటకి అన్నట్టుగానే ఆ గదిలోకి వచ్చేడు భగవాన్..
ఎదురుగా వున్న కుర్చీలో కూర్చుంటూ అడిగాడు ఆయన, ‘‘నేను మీకు ఏం చెయ్యగలను’’ అని.. ఆయన యిప్పుడు మామూలుగా ఉన్నాడు.

04/30/2017 - 21:24

..యింతలోనే అరుణ్ నుంచి ఫోన్.. ట్రైనింగ్ సెంటర్‌లో సాహూ సర్ పెట్టిన సెలవులతో ఆ మర్డర్స్ జరిగిన తారీఖులు సరిపోయాయని, కానీ ఎంత ప్రయత్నించినా ఆయన మెయిల్ ఐ.డి మాత్రం దొరకలేదనీ..
రాహుల్ వెంటనే అడిగాడు సాహూ పూర్తి పేరేమిటని?

04/30/2017 - 04:40

ఎంత మేధావి అయినా, ఎంత కరుడుగట్టిన హంతకుడు అయినా తప్పకుండా ఎక్కడో అక్కడ తప్పడుగు వేస్తాడు, యిప్పటికే వేసాడు- ఎందుకంటే గత ఆరునెలలుగా అంతుచిక్కని హత్యలూ, అడవిలో అమర్ హత్య ఏ రకమైన ఆధారం దొరక్కపోయినా, అరుణ్ జోలికి ఇంద్రజిత్‌ని పంపి చేసిన పొరపాటు ఆ హంతకుడిని కొద్దిగా అయినా గెస్ చేసే అవకాశం ఇచ్చింది. సో.. తను నిరుత్సాహపడకుండా ప్రయత్నిస్తే ఖచ్చితంగా హంతకుడి జాడ దొరుకుతుంది..

04/28/2017 - 21:13

మిగతావాళ్ళు అంతా యమా సీరియస్‌గా ఏవో క్లాసెస్ అటెండ్ అవడం వరకే తప్ప, ఎవరితోనూ పెద్దగా కలవరు.. అక్కడ వున్న ఏడాదిలో ఎవరి ప్రవర్తనా అనుమానాస్పదంగా లేదు.. మరి యిప్పుడు ఎవరిని అనుమానించాలో.. అసలు తమ అనుమానం నిజమేనా లేక ఉత్త అనుమానమేనా? కానీ అలా కాకపోతే అమర్ అలా ఎందుకు రాస్తాడు?

04/27/2017 - 21:24

మొదటినుంచీ జరుగుతున్న హత్యల పరంపర.. విధానం జాగ్రత్తగా పరిశీలిస్తున్న రాహుల్‌కి అన్వర్ మాటల వలన అర్థం అయిన విషయం.. ప్రణవ్ బిజినెస్ పనిమీద హైదరాబాద్ రావడం తెలుసుకుని అది అవకాశంగా తీసుకుని హతుని కారు పార్కింగ్‌లో వుండగా, డ్రైవర్ అన్వర్ ఏమరుపాటుగా ఉన్న అదను చూసుకుని.. దొంతనంగా ఆ కారులో పెట్రోల్ ఖాళీచేసి.. వాళ్ళు బయలుదేరే సమయంలో కారు డిక్కీలో చేరి.. పెట్రోల్ అయిపోయి...

Pages