S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

08/21/2018 - 04:53

న్యూఢిల్లీ: దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ తదితర ప్రముఖ నేతలు సోమవారం నాడిక్కడ ఘనంగా నివాళులు అర్పించారు. రాజీవ్ గాంధీ 74వ జయంత్యుత్సవాల నేపథ్యంలో ఆయన సేవలను నేతలు కొనియాడారు.

08/21/2018 - 04:32

బళ్ళారి, ఆగస్టు 20: ఎగువ ప్రాంతాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో తుంగభద్ర జలాశయానికి వరద తగ్గిపోయింది. శివమొగ్గ, చిక్కమంగళూరు జిల్లాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టినట్టు అధికారులు తెలిపారు. దీంతో జలాశయానికి ఇన్‌ఫ్లో కూడా తగ్గింది. నాలుగు రోజులుగా 2 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదు కావడంతో 33 గేట్లు ఎత్తి అంతే మొత్తంలో నీటిని నదిలోకి విడుదల చేశారు. సోమవారం ఇన్‌ఫ్లో తగ్గడంతో 13 గేట్లు మూసివేశారు.

08/21/2018 - 02:44

న్యూఢిల్లీ, ఆగస్టు 20: దివంగత మాజీ ప్రధాని వాజపేయి వత్తిడిలో కృంగిపోవడం, కష్టాల్లో నిరాశపడటం ఎన్నడూ చేయలేదని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. వాజపేయికి సంతాపంగా జరిపిన ప్రార్థనల సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాశ్మీర్ అంశంపై కొన్నిదేశాల వైఖరిని మార్చడంలో వాజపేయి కృతకృత్యులయ్యారని అన్నారు. వాజపేయి కారణంగానే ఉగ్రవాదం అంశం ప్రపంచం దృష్టికి వచ్చిందని అన్నారు.

08/21/2018 - 02:41

న్యూఢిల్లీ, ఆగస్టు 20: దేశంలో నదులను అనుసంధానం చేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కుతుందని ఏపీ జల వనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు పేర్కొన్నారు. కేంద్ర జల వనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అధ్యక్షతన నేషనల్ వాటర్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ సమావేశానికి ఆయన హాజరయ్యారు. అనతంరం ఉమ విలేఖరులతో మాట్లాడుతూ సుప్రీం కోర్టు ఆదేశాలు ఇచ్చినందునే నదుల అనుసంధానంపై కేంద్రం సమావేశాలు నిర్వహిస్తోందని చెప్పారు.

08/21/2018 - 02:38

చండీగఢ్, ఆగస్టు 20: తనపై వస్తున్న విమర్శలకు అవసరమైనప్పుడు గట్టి సమాధానం చెబుతానని మాజీ క్రికెటర్, పంజాబ్ మంత్రి నవజోత్ సింగ్ సిద్ధు పేర్కొన్నారు. ఇటీవల పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ ప్రమాణస్వీకార వేడుకల్లో పాల్గొనేందుకు పాక్ వెళ్లిన సందర్భంగా సిద్దూ పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ కమ్ జావెద్ బజ్వాను ఆలింగనం చేసుకోవడం పట్ల పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ నిన్న తీవ్రంగా దుమ్మెత్తిపోసిన విషయం విదితమే.

08/21/2018 - 02:35

న్యూయార్క్‌లో నిర్వహించిన 38 ఇండియా డే పరేడ్‌లో పాల్గొన్న వెస్టిండీస్ మాజీ క్రికెటర్ వివియన్ రిచర్డ్స్, సినీనటులు కమల్‌హసన్, పూజా కుమార్, ప్రముఖ సూఫీ గాయకుడు కైలాష్ ఖేర్.

08/21/2018 - 02:33

న్యూఢిల్లీ, ఆగస్టు 20: భారతీయ విద్యార్థులను ఆకర్షించేందుకు తమ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందని భారత్‌లో న్యూజిలాండ్ రాయబారి జొన్నా కెంప్‌కెర్స్ వెల్లడించారు. ప్రతి ఏటా దాదాపు 20వేల మంది భారతీయ విద్యార్థులు తమ దేశంలో ఉన్నత విద్యను అభ్యసించేందుకు వస్తున్నారని, వారి సంఖ్యను మరింత పెంచేందుకు మూడేళ్ల కాలానికి పోస్ట్-స్టడీ వర్క్ వీసాను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు.

08/21/2018 - 02:31

న్యూఢిల్లీ, ఆగస్టు 20: కేంద్ర ప్రభుత్వం 2015లో ప్రవేశపెట్టిన ‘్భటీబచావో-్భటీ పడావో’ పథకం లోగోతో ఒక నకిలీ వెబ్‌సైట్ ప్రజలను మోసం చేస్తోందని, ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని కేంద్ర మహిళ, శిక్ష సంక్షేమ శాఖ అధికారులు హెచ్చరించారు.

08/21/2018 - 02:30

హిసార్, ఆగస్టు 20: బౌద్ధమతం స్వీకరించినందుకు దాదాపు 300 మంది దళితులను ఏడాదికి పైగా సాంఘిక బహిష్కరణ చేశారు. ఈ సంఘటన హర్యానాలోని హిసార్ జిల్లాలో వెలుగుచూసింది. భాట్లా గ్రామంలోని 300 మంది దళితులు బౌద్ధమతాన్ని స్వీకరించారు. దీనిని సహించలేని అగ్రవర్ణాలవారు వారిని ఏడాదిపాటు గ్రామ బహిష్కరణ విధించారు.

08/21/2018 - 02:29

న్యూఢిల్లీ, ఆగస్టు 20: బక్రీద్ సెలవు దినాన్ని ఈ నెల 22కు మారుస్తూ కేంద్ర ప్రభుత్వం సోమవారం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఢిల్లీలోని ప్రభుత్వ కార్యాలయాలకు గురువారం కాకుండా ఒకరోజు ముందే బుధవారం సెలవుదినం ఉంటుంది. చాంద్రమానం ఆధారంగా ఈ పండుగ నిర్ణయించే ఢిల్లీలోని షాహి ఇమాం సయ్యద్ అహ్మద్ బుఖారీ నేతృత్వంలోని కమిటీ రూయత్ హిలాల్ నిర్ణయం మేరకు ప్రభుత్వం ఈ మార్పు చేసింది.

Pages