S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

12/17/2018 - 18:22

ఇప్పుడా తేనెపట్టు ముదురు గోధుమరంగులో నిగనిగలాడుతూ, నాణ్యమైన మామిడి తాండ్ర వ్రేలాడుతున్నట్టుంది!
పట్టునుంచి బొట్లుబొట్లుగా తేనె చుక్కలు పడుతూంటే ఓ బుంగను దానిక్రింద పెట్టారు.
తేనె బొట్లు లీలగా చప్పుడు చేస్తూ, బుంగలో పడుతున్నాయి.

12/17/2018 - 16:41

భోపాల్: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా కమలనాథ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు డిప్యూటీ సీఎంగా జోతిరాదిత్య వ్వవహరిస్తారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, మన్నోహన్ సింగ్, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, ఫరూక్ అబ్దుల్లా, స్టాలిన్, మాజీ ప్రధాని దేవెగౌడ తదితరులు హాజరయ్యారు.

12/17/2018 - 16:40

విజయవాడ: పెథాయ్ తుపాను వల్ల కోనసీమలోని పలుప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కాకినాడలో భారీవర్షాలతో పాటు బలమైన ఈదురు గాలులు వీస్తున్నాయి. విద్యుత్ స్తంభాలు నేలకొరుగుతున్నాయి. చాలా కొబ్బరిచెట్లు, సెల్ టవర్లు కుప్పకూలాయి. ప్రజలు బయటకు రావద్దని హెచ్చరికలు జారీ చేశారు. విజయనగరం జిల్లాలోనూ వర్షాలు కురుస్తున్నాయి.

12/17/2018 - 16:38

విజయవాడ: పెథాయ్ తుపాను కారణంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. విజయవాడలో కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీనికితోడు డ్రైనేజీ తవ్వకాల కోసం గుంతలు తీయటంతో డ్రైనేజీ నీరు, వర్షం నీరు చేరటంతో చిట్టినగర్, ఇస్లాంపేట, వన్‌టౌన్ తదితర ప్రాంతాలు జలమయమయ్యాయి.

12/17/2018 - 13:40

తిరుపతి: తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం నైవేద్య విరామం అనంతరం గవర్నర్ దంపతులు స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

12/17/2018 - 13:39

అమరావతి : పెథాయ్‌ తుపాను తూర్పుగోదావరి జిల్లా కాట్రేనికోన వద్ద ఇది తీరం తాకినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఇది అమలాపురానికి 20 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. తుపాను ప్రభావంతో ఇప్పటికే తూర్పుగోదావరి జిల్లాలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి.

12/17/2018 - 13:20

న్యూఢిల్లీ: 1984 సిక్కుల ఊచకోత కేసులో కాంగ్రెస్ నేత సజ్జన్ కుమార్‌ను దోషిగా తేల్చింది ఢిల్లీ హైకోర్టు. ఆయనకు జీవిత ఖైదు విధించింది. ట్రయల్ కోర్టులో సజ్జన్ కుమార్‌ను నిర్దోషిగా తేల్చగా.. ఆ తీర్పును హైకోర్టు తిరగరాసింది. ఈ నెల 31లోపు కోర్టులో లొంగిపోవాల్సిందిగా సజ్జన్‌కుమార్‌ను ఆదేశించింది.

12/17/2018 - 13:07

కోదాడ: దొరకొంట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు సచివాలయ ఉద్యోగులు చనిపోయారు. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళుతుండగా ఈప్రమాదం చోటుచేసుకుంది. మృతుల్లో సచివాలయ ఉద్యోగులు హరికృష్ణ, పీఎస్ భాస్కర్ ఉన్నారు. తీవ్రంగా గాయపడిన విజయలక్ష్మీ, పాపయ్యను నకిరేకల్ ఆసుపత్రికి తరలించారు.

12/17/2018 - 13:06

విశాఖపట్నం: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తుపానుగా మారటంతో విశాఖపట్నంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో విశాఖపట్నం నుంచి వెళ్లాల్సిన విమానాలను, రైళ్లను అధికారులు రద్దు చేశారు. విశాఖ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన 14 విమానాలను రద్దు చేసినట్లు అధికారులు వెల్లడించారు. రైళ్లను కూడా రద్దు చేయటంతో ప్రయాణీకులు పలు ఇబ్బందులు పడుతున్నారు.

12/17/2018 - 13:05

అమరావతి: పెథాయ్ తుపాను కాకినాడకు చేరువకావటంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. ఏ క్షణానైనా తీరందాటే అవకాశం ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. గంటకు 19 కి.మీ వేగంతో కదులుతున్న పెథాయ్ తుని-యానం మధ్య తీరందాటే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ఉత్తరాంథ్ర జిల్లాల్లో 80-90 కి.మీ వేగంతో గాలులు వీస్తున్నాయి.

Pages