S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

09/27/2016 - 03:54

వికారాబాద్, సెప్టెంబర్ 26: వికారాబాద్ జిల్లా కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటించినా ఉనికి కోసమే కాంగ్రెస్, టిడిపి, బిజెపి.. అఖిలపక్షం పేరిట ఆందోళన, ఉద్యమాలు చేస్తున్నాయని టిఆర్‌ఎస్ పోలిట్‌బ్యూరో సభ్యుడు కొప్పుల హరీశ్వర్‌రెడ్డి విమర్శించారు. సోమవారం స్థానిక నర్సింగ్ గౌలికర్ ఫంక్షన్ హాలులో ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

09/27/2016 - 03:53

కాచిగూడ, సెప్టెంబర్ 26: నగరంలో ఐలమ్మ భవన్ ఏర్పాటుకు కృషి చేస్తానని రాష్ట్ర గిరిజన శాఖమంత్రి చందూలాల్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర రజక సంఘాల ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ జయంతి సభ సోమవారం బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన మంత్రి చందూలాల్ మాట్లాడుతూ భూమి, భూక్తి కోసం పోరాడిన వీరనారి చాకలి ఐలమ్మ అని కొనియాడారు.

09/27/2016 - 03:53

సికిందరాబాద్, సెప్టెంబర్ 26: తెరాస ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటుందని డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను నిర్మించి తీరుతామని మంత్రి పద్మారావుగౌడ్ పేర్కొన్నారు. సోమవారం నియోజకవర్గంలోని లాలాపేట్ ఇసుకబావి ప్రాంతంలోని రైల్వే స్థలాన్ని రెవెన్యూ అధికారులతో కలిసి పరిశీలించారు.

09/27/2016 - 03:49

కరీంనగర్, సెప్టెంబర్ 26: భారీ వర్షాలు, వరదల వల్ల తలెత్తిన పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొంటూనే, ఈ అనుభవాలతో భవిష్యత్‌లో అనర్థాలు జరుగకుండా చూడాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అధికారులకు సూచించారు. వరద ప్రాంతాలలో పర్యటించేందుకు జిల్లాకు వచ్చిన సిఎం సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు.

09/27/2016 - 03:49

కరీంనగర్ టౌన్, సెప్టెంబర్ 26: నిరుద్యోగం, ఆర్థిక ఇబ్బందులు, అందని ప్రభుత్వ పథకాలు, భారంగా మారిన కుటుంబపోషణ వెరసి సోమవారం జిల్లా పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి కెసిఆర్ ఎదుట ఓ యువకుడు ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టాడు. వరుసగా కురుస్తున్న వర్షాలతో నిండిన జలాశయాలతోపాటు తెగిన మిడ్‌మానేరు కట్టను పరిశీలించేందుకు సిఎం కెసిఆర్ జిల్లాకు వచ్చారు.

09/27/2016 - 03:46

హైదరాబాద్, సెప్టెంబర్ 26: మహానగరాన్ని కుదిపేసిన తర్వాత ఇపుడిపుడే జనజీవనం కొలుకుంటుంది. వర్షాలు తగ్గటం, భారీ వర్షాల కారణంగా ప్రభుత్వం ప్రకటించిన సెలవులు ముగియటంతో జనజీవనం క్రమంగా గాడిన పడుతోంది. తరచూ భారీవర్షాల కారణంగా శివార్లలోని నిజాంపేట, హకీంపేట, అల్వాల్ ప్రాంతాలు నీట మునగగా, వీటిలో నిజాంపేట, మహేశ్వరినగర్‌లు సోమవారం కూడా నీటిలోనే ఉన్నాయి.

09/27/2016 - 03:43

సదాశివపేట, సెప్టెంబర్ 26: తుపాను సృష్టించిన బీభత్సానికి తాము సాగు చేసిన పత్తి పంట పూర్తిగా నాశనమైందని, ఇందుకుగాను ప్రభుత్వం చెల్లించాల్సిన పరిహారాన్ని తమకే ఇప్పించాలని లేనిపక్షంలో ఆత్మహత్యలు చేసుకుంటామంటూ మెదక్ జిల్లా సదాశివపేట మండలం పొట్టిపల్లి గ్రామానికి చెందిన ఆరుగురు కౌలు రైతులు సోమవారం ఆందోళనకు దిగారు.

09/27/2016 - 03:41

గద్వాల, సెప్టెంబర్ 26: దేశ విదేశాల్లో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించిన మహబూబ్‌నగర్ జిల్లా గద్వాల చీరకు, నేతన్నకు పూర్వవైభవం తెచ్చేందుకు కృషి చేస్తామని టెక్స్‌టైల్ కమిషనర్ కవితగుప్తా, కార్యదర్శి రేష్మివర్మ, డెవలప్‌మెంట్ కమిషనర్ అలోక్‌కుమార్ బృందం తెలిపింది. సోమవారం గద్వాల పట్టణంలోని రాఘవేంద్రకాలనీలో చేనేత కార్మికులతో వారు సమావేశమయ్యారు.

09/27/2016 - 03:39

హైదరాబాద్, సెప్టెంబర్ 26: ప్రయాణికుల సౌకర్యార్థం ఆర్టీసి కొత్త రూట్లలో పలు బస్సు సర్వీసులను అందుబాటులోకి తెచ్చింది. సోమవారం ఆర్టీసి ఐదు కొత్త రూట్లలో బస్సులు ప్రారంభించినట్టు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పురుషోత్తం తెలిపారు.

09/27/2016 - 03:38

హైదరాబాద్, సెప్టెంబర్ 26: గత రెండు వారాల్లో రాచకొండ కమిషనరేట్ పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్లలో 14 ఈవ్‌టీజ్, 12 పిటీ కేసులు నమోదేనట్టు షీటీమ్స్ ఏసిపి స్నేహిత తెలిపారు. అయితే వీరిలో కొందరికి కౌనె్సలింగ్ నిర్వహించామని, మరికొందరిని రిమాండ్‌కు తరలించినట్టు ఆమె పేర్కొన్నారు. ఎవరైనా మహిళలను, యువతులను వేధిస్తే సమీపంలోని పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేయాలని, వాట్సాప్ నెం.

Pages