S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

09/27/2016 - 04:04

తాండూరు, సెప్టెంబర్ 26: తాండూరు మున్సిపల్ పరిధిలోని 31 వార్డులలో చోటు చేసుకున్నట్లు భావిస్తున్న ఆసరా పింఛన్ల అక్రమాల పట్ల సోమవారం చైర్‌పర్సన్ కొట్రిక విజయలక్ష్మీ ఆధ్వర్యంలో నిర్వహించిన మున్సిపల్ కౌన్సిల్ సర్వ సభ్య సమావేశంలో సభ్యులు అన్ని పార్టీలకు చెందినవారు తీవ్రంగా స్పందించారు.

09/27/2016 - 04:02

హైదరాబాద్, సెప్టెంబర్ 26: నగరంలో గంటసేపు దంచి వాన కొడితే చాలు రహదార్లన్నీ గోదారిని తలపిస్తాయి. వీధులు,సెల్లార్లు, ఇళ్లలోకి భారీగా వర్షపు నీరు చేరుతోంది. ఇటీవల నగరంలో రికార్డు స్థాయిలో కురిసిన భారీ నుంచి అతి భారీ వర్షాలతో గుణపాఠం నేర్చుకున్న అధికారులు పరిస్థితి ఇలాగే కొనసాగితే మున్ముందు నగరం నీట మునిగే ప్రమాదమున్నట్లు గుర్తించారు.

09/27/2016 - 04:01

జీడిమెట్ల, సెప్టెంబర్ 26: జీడిమెట్ల ఫ్యాక్స్‌సాగర్ చెరువు డేంజర్ స్థాయికి చేరింది. గత 25 ఏళ్ల తరువాత ఫ్యాక్స్‌సాగర్ చెరువు మళ్లీ నిండుకుండలా మారింది. సుమారు 2000 సంవత్సరంలో ఫాక్స్ సాగర్ చెరువు నిండి కట్ట తెగిపోవడంతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. మళ్లీ దాదాపు పదిహేను ఏళ్ల తరువాత ఫ్యాక్స్‌సాగర్ చెరువు డేంజర్ స్థాయికి చేరింది.

09/27/2016 - 04:00

హైదరాబాద్, సెప్టెంబర్ 26: నగరంలో నాలుగైదు రోజుల పాటు ఎడతెరపి లేకుండా దంచికొట్టిన భారీ వర్షాల కారణంగా రూ. వంద కోట్ల మేరకు నష్టం వాటిల్లినట్లు జిహెచ్‌ఎంసి అధికారులు లెక్కలేశారు. ముఖ్యంగా ఈ వర్షాల కారణంగా గ్రేటర్ పరిధిలోని దాదాపు 180 కిలోమీటర్ల విస్తీర్ణంలో రోడ్లు ధ్వంసమయ్యాయని ఇంజనీరింగ్ అధికారులు నివేదికలను సమర్పించినట్లు జిహెచ్‌ఎంసి కమిషనర్ జనార్దన్ రెడ్డి తెలిపారు.

09/27/2016 - 03:59

శేరిలింగంపల్లి, సెప్టెంబరు 26: రెవెన్యూ రికార్డుల్లో ఫోర్జరీ చేసిన నేరం కింద తహశీల్దార్‌తో సహా మరో ఆరుగురు నిందితులకు మూడేళ్ల జైలు శిక్ష పడింది. తహశిల్దార్‌కు 30వేల జరిమానా, మిగతా నిందితులకు 25వేలు జరిమానా విధిస్తూ 19వ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి సోమవారం తీర్పు వెల్లడించారు. చందానగర్ ఇన్‌స్పెక్టర్ ఎన్.తిరుపతిరావు కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి.

09/27/2016 - 03:57

హైదరాబాద్, సెప్టెంబర్ 26: జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న చెరువులు, కుంటలు, రోడ్లకు యుద్ధప్రాదిపదికన మరమ్మతులు చేపట్టాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పి.మహేందర్‌రెడ్డి అన్నారు. సోమవారం సచివాలయంలో భారీ వర్షాల వల్ల జరిగిన నష్టంపై సంబధిత శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ ఎం.రఘునందన్‌రావుతో కలిసి సమీక్షించారు.

09/27/2016 - 03:57

శంకర్‌పల్లి, సెప్టెంబర్ 26: శంకర్‌పల్లి మండలాన్ని వికారాబాద్‌లో కలపాలనే కుట్రలను ఆ ప్రాంత నాయకులు సహృదయంతో మానుకోవాలని లేకుంటే ఊరుకోమని శంకర్‌పల్లి మండల అఖిలపక్షం నాయకులు హెచ్చరించారు. సోమవారం స్థానిక అతిథి గృహంలో అఖిలపక్షం నాయకులు విలేఖరుల సమావేశంలో వికారాబాద్ నాయకుల ఆలోచనలపై తీవ్రంగా ధ్వజమెత్తారు.

09/27/2016 - 03:56

హైదరాబాద్, సెప్టెంబర్ 26: అయిదు రోజుల పాటు మహానగరాన్ని కుదిపేసిన భారీ నుంచి అతి భారీ వర్షాలు తగ్గుముఖం పట్టడంతో నగరంలో జనజీవనం సాధారణ స్థితికి చేరుకుంది. సోమవారం పనిరోజు కావటంతో నగరవాసులు యథావిధిగా తమ దైనందిన రోజువారీ కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు.

09/27/2016 - 03:55

మేడ్చల్, సెప్టెంబర్ 26: మేడ్చల్ - కిష్ఠాపూర్ మధ్య ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వాగులో సోమవారం ఉదయం ఓ వ్యక్తి బైక్‌తో సహ కొట్టుకుపోతుండగా గమనించిన స్థానికులు వ్యక్తిని కాపాడగా బైక్ మాత్రం నీటి ప్రవాహంలో కొట్టుకుపోయింది. బాధితుడి కథనం ప్రకారం వారం రోజులుగా కుండపోతగా కురిసిన వర్షాలకు మేడ్చల్ పెద్ద చెరువు అలుగు ఉద్ధృతంగా పారుతున్న విషయం తెలిసిందే.

09/27/2016 - 03:55

ఖైరతాబాద్, సెప్టెంబర్ 26: చలామణిలో లేని విదేశీ కరెన్సీతో మోసం చేసేందుకు యత్నించిన ఐదుగురు నిందుతులను అరెస్టు చేసి పంజాగుట్ట పోలీసులు రిమాండ్‌కు తరలించారు. సోమవారం పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో డిసిపి వెంకటేశ్వరరావు కేసు వివరాలను వెల్లడించారు.

Pages