S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

08/04/2016 - 08:36

న్యూఢిల్లీ, ఆగస్టు 3: దేశీయ ఐటి రంగంలో నాలుగో అతిపెద్ద సంస్థగా ఉన్న హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ ఏకీకృత నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో 2,047 కోట్ల రూపాయలుగా నమోదైంది.

08/04/2016 - 08:32

మహద్, ఆగస్టు 3: వరదల ధాటికి మహారాష్ట్ర అల్లల్లాడిపోతోంది. రాష్ట్రంలోని సా విత్రి నది ఉప్పొంగటంతో రాయ్‌గఢ్ జిల్లా మహద్ ప్రాంతంలో ముంబై-గోవా రహదారిపై బ్రిటిష్ కాలం నాటి ఓ వంతెన మంగళవారం అర్ధరాత్రి కొట్టుకుపోయింది. ఈ ఘటనలో ప్రయాణికులతో వెళ్తున్న రెండు బస్సులు నదిలో కొట్టుకుపోయాయి. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు రెండు మృతదేహాలు లభ్యమైనట్లు అధికారులు తెలిపారు.

08/04/2016 - 08:30

దుబాయి, ఆగస్టు 3: కేరళలోని తిరువనంతపురంనుంచి దుబాయి వస్తున్న ఎమిరేట్స్ విమానానికి బుధవారం పెను ప్రమాదం తప్పింది. 282 మంది ప్రయాణికులు, 18మంది సిబ్బంది మొత్తం 300 మందితో తిరువనంతపురం నుంచి దుబాయి వస్తున్న ఈ విమానం దుబాయి అంతర్జాతీయ విమానాశ్రయంలో క్రాష్ లాండింగ్ అయింది. ఆ వెంటనే విమానంలో పెద్దఎత్తున మంటలు, పొగలు చెలరేగాయి.

08/04/2016 - 08:24

న్యూఢిల్లీ, ఆగస్టు 3: గుజరాత్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన ఆనందీబెన్ పటేల్ వారసుడి ఎంపిక బాధ్యతను బిజెపి పార్లమెంటరీ పార్టీ పార్టీ అధ్యక్షుడు అమిత్ షాకు బుధవారం అప్పగించింది. అమిత్ షా గురువారం గుజరాత్ వెళ్తున్నారు. అక్కడ ఆయన పార్టీ నాయకులతో చర్చలు జరపడమే కాకుండా లెజిస్లేచర్ పార్టీ కొత్త నాయకుడి ఎంపికకోసం శుక్రవారం జరగనున్న లెజిస్లేచర్ పార్టీ సమావేశానికి కూడా హాజరవుతారు.

08/04/2016 - 08:24

న్యూఢిల్లీ, ఆగస్టు 3: చైనాను ఆనుకుని ఉన్న సరిహద్దుల్లో అదనంగా సూపర్‌సోనిక్ బ్రహ్మస్ క్షిపణులను మోహరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. 290 కి.మీ దూరంలోని ఏ లక్ష్యాన్నైనా ఛేదించగలిగే సామర్థ్యం ఈ క్షిపణులకు ఉం టుంది. చైనాను ఆనుకుని ఉన్న తూర్పు సెక్టార్ సరిహద్దు పొడవునా రక్షణపరమైన సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలన్న ఉద్దేశంతోనే బ్రహ్మోస్‌ను మోహరింపును ఆమోదించినట్లుగా అధికార వర్గాలు తెలిపాయి.

08/04/2016 - 08:21

ఖాట్మండు, ఆగస్టు 3: నేపాల్ కొత్త ప్రధానిగా మావోయిస్టు పార్టీ అధినేత పుష్ప కమాల్ దహాల్ అలియాస్ ప్రచండ ఎన్నికయ్యారు. కొత్త రాజ్యాంగ పుణ్యమాని రాజకీయ అనిశ్చితి ఏర్పడింది. దీంతో కెపి శర్మ ఓలి ప్రధాని పదవి నుంచి తప్పుకోవల్సి వచ్చింది. దీంతో కొత్త ప్రధానిగా ప్రచండను సోమవారం పార్లమెంటు ఎన్నుకుంది. 595 మంది సభ్యులున్న సభలో ప్రచండకు అనుకూలంగా 363 ఓట్లు వచ్చాయి.

08/04/2016 - 08:20

న్యూఢిల్లీ, ఆగస్టు 3: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా ఇవ్వడానికి రాజ్యాంగం అడ్డంకి అని ప్రజలను, సభను కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ తప్పుదోవ పట్టించారని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపించారు. బుధవారం కాంగ్రెస్ నాయకులు జైరాం రమేశ్, కెవిపి రామచంద్రరావు, సుబ్బిరామిరెడ్డి, జెడి శీలంలు విలేఖరులతో మాట్లాడారు. రాజ్యసభ సభ్యుడు జైరాం రమేశ్ మాట్లాడుతూ, ఆర్థిక సంఘం రాష్ట్రాలకు ప్రత్యేక హోదా రద్దు చేయలేదన్నారు.

08/04/2016 - 08:20

లండన్, ఆగస్టు 3: హిందూ సంప్రదాయం బలవంతపు మత మార్పిళ్లను ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించదని, వ్య క్తుల మానవ హక్కులను హరించే విధంగా మార్పిళ్లను ఒప్పుకోదని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ సంఘ్ చాలక్ మోహన్ భాగవత్ అన్నారు. ‘‘హిందూయిజం ఒక మతం కాదు. ఒక సంప్రదాయం. ఈ సంప్రదాయం ప్రతి ఒక్కరికీ స్వాతంత్య్రాన్నిచ్చింది. మతం, విశ్వాసం అనేది వ్యక్తిగతమైంది. వారి ఇష్టానుసారం ఇష్టమైన ధర్మాన్ని అనుసరించవచ్చు.

08/04/2016 - 08:19

సియోల్, ఆగస్టు 3: ఉత్తర కొరియా బుధవారం తొలిసారి నేరుగా జపాన్ సముద్ర జలాల్లోకి ఒక ఖండాంతర క్షిపణిని ప్రయోగించింది. దీనిపై జపాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అలాగే అమెరికా, దక్షిణ కొరియా, జపాన్ దేశాలకు.. ఉత్తర కొరియాల మధ్య మళ్లీ ఉద్రిక్తతలకు ఇది కారణమైంది.

08/04/2016 - 08:18

న్యూఢిల్లీ, ఆగస్టు 3: ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్ గ్యాంగ్‌రేప్ ఘటన సమాజ్‌వాదీ పార్టీ, బిజెపి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. బులంద్‌షహర్‌లో తల్లీ, 13 ఏళ్ల కుమార్తెపై బందిపోట్ల ముఠా అత్యాచారం చేసింది. అయితే ఇదంతా ప్రతిపక్షాల కుట్రేనని, అధికారంలోకి రావాలన్న దురుద్దేశంతోనే రాజకీయం చేస్తున్నారని సమాజ్‌వాదీ పార్టీ సీనియర్ మంత్రి ఆజంఖాన్ ఆరోపించారు. దీనిపై బిజెపి తీవ్రంగా మండిపడింది.

Pages