S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

08/04/2016 - 07:47

ఎల్లారెడ్డిపేట, ఆగస్టు 3: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ఈనెల 9 నుంచి జాతీయ వేడుకలను ఘనంగా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పించింది. ప్రతి పల్లెలో పండుగ వాతావరణం మధ్య వేడుకలు జరిపేందుకు సిద్ధం చేశారు. జాతీయ జెండా, మూడు రంగులు కలిగిన తోరణాలతో ప్రభుత్వ, ప్రభుత్వేతర కార్యాలయాలు ముస్తాబవుతాయి.

08/04/2016 - 07:40

గుంటూరు, ఆగస్టు 3: ఆంధ్రప్రదేశ్ సచివాలయానికి మూడోవిడత మరో మూడు కీలక శాఖలను గురువారం తరలించనున్నారు. రాష్ట్ర హోం, ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప తన చాంబర్‌ను మధ్యాహ్నం 12.30 గంటలకు, రవాణాశాఖ మంత్రి శిద్దా రాఘవరావు తన పేషీని 11 గంటలకు, పురపాలకశాఖ మంత్రి డాక్టర్ పి నారాయణ తన కార్యాలయాన్ని ఉదయం 11.30 గంటలకు ప్రారంభించనున్నారు.

08/04/2016 - 07:39

మిడుతూరు, ఆగస్టు 3: ‘ది గ్రేట్ ఇండియన్ బస్టర్డ్’గా పిలువబడే బట్టమేక పక్షి ఎట్టకేలకు కనిపించింది. గత పది రోజుల్లో ఏకంగా మూడు బట్టమేక పక్షులు కర్నూలు జిల్లాలోని రోళ్లపాడు వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో కనిపించినట్లు రైతులు తెలిపారు. గత ఆరేళ్లుగా ఆనవాళ్లు లేకుండా పోయిన ఈ పక్షి మళ్లీ కనిపించడంతో అటవీశాఖ అధికారులు, పక్షి ప్రేమికుల్లో ఆనందం చోటుచేసుకుంది.

08/04/2016 - 07:38

విజయవాడ, ఆగస్టు 3: ప్రత్యేక హోదాకై సిఎం, కేంద్ర మంత్రుల నివాస గృహాల ఎదుట రోడ్లు ఊడ్చాలంటూ పిసిసి అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి ఇచ్చిన పిలుపుమేరకు నందిగామ సమీపంలోని పొన్నవరంలోని కేంద్ర మంత్రి సుజనా చౌదరి నివాస గృహం ఎదుట రోడ్లను యువజన కాంగ్రెస్ కార్యకర్తలు రాష్ట్ర అధ్యక్షుడు దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో చీపుర్లు చేతబట్టి ఊడ్చారు. గ్రామస్థులంతా తరలివచ్చి ఈ దృశ్యాన్ని ఆసక్తిగా తిలకించారు.

08/04/2016 - 07:37

అద్దంకి, ఆగస్టు 3: ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గంలో పింఛన్ల పంపిణీ విషయంలో వివాదం చోటుచేసుకుంది. ఆది నుండి టిడిపిలో తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు కరణం బలరామకృష్ణమూర్తి, స్థానిక ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతూనే ఉంది. బుధవారం బల్లికురవ మండల కేంద్రంలో పింఛన్ల పంపిణీలో చోటుచేసుకున్న ఉద్రిక్తత ఘటనలే నిదర్శనం.

08/04/2016 - 07:35

విజయవాడ, ఆగస్టు 3: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలకు ప్రజల్లోకి తీసుకువెళ్లి, వాటికి ప్రచారం కల్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. విజయవాడ సిఎం క్యాంపు కార్యాలయంలో సంక్షేమ పథకాలపై ఆయన బుధవారం సమీక్ష నిర్వహించారు. సంక్షేమ శాఖల్లోని పథకాలన్నీ ఏకరూపత కలిగి ఉండాలని దిశా నిర్దేశం చేశారు.

08/04/2016 - 07:29

హైదరాబాద్, ఆగస్టు 3: దేశంలో ఐఐటిలు, ఎన్‌ఐటిలు, ఇతర జాతీయ సాంకేతిక విద్యాసంస్థల్లో ప్రవేశానికి నిర్వహించే ఐఐటి జెఇఇలో వచ్చే విద్యాసంవత్సరం నుండి ఇంటర్ మార్కుల వెయిటేజీకి మంగళం పలకాలని జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అపెక్స్ బోర్డు నిర్ణయించింది. అయితే ఐఐటి జెఇఇ రాయాలంటే అభ్యర్థులకు ఇంటర్‌లో కనీసం 75 శాతం మార్కులు రావడం తప్పనిసరి.

08/04/2016 - 07:28

తిరుమల, ఆగస్టు 3: కృష్ణా పుష్కరాలను పురస్కరించుకుని కృష్ణమ్మకు సమర్పించేందుకు తిరుమల వేంకటేశ్వర స్వామివారి సారెతో కూడిన పుష్కర యాత్రను టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షుడు డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి, ఇఓ డాక్టర్ డి.సాంబశివరావు బుధవారం తిరుమలలో ప్రారంభించారు. ముందుగా శ్రీవారి ఆలయంలో పూజలు నిర్వహించి పసుపు, కుంకుమ, పట్టువస్త్రాలను ఆలయం నుంచి శ్రీవారి వైభవోత్సవ మండపం వరకు ఊరేగింపుగా తీసుకొచ్చారు.

08/04/2016 - 07:26

నాగార్జునసాగర్, ఆగస్టు 3: తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలు సమన్వయంతో పనిచేసి కృష్ణా పుష్కరాలు ప్రశాంతంగా నిర్వహిద్దామని తెలంగాణ రాష్ట్ర డిఐజి అకుల్ సబర్వాల్ అన్నారు. నాగార్జునసాగర్ విజయవిహార్‌లో బుధవారం రెండు రాష్ట్రాలకు చెందిన పోలీసు శాఖ డిఐజి స్థాయి నుండి డిఎస్‌పిల వరకు పుష్కరాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు.

08/04/2016 - 07:26

రాజమహేంద్రవరం, ఆగస్టు 3: ఎపి బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా గత ఏడాది 15వేల మందికి లబ్ధిచేకూర్చామని, ఈఏడాది 35వేల మందికి లబ్ధి చేకూర్చాలని నిర్ణయించామని కార్పొరేషన్ చైర్మన్ ఐవైఆర్ కృష్ణారావు వెల్లడించారు. రాజమహేంద్రవరంలో బుధవారం ఆయన విలేఖర్ల సమావేశంలో మాట్లాడారు.

Pages