S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

08/04/2016 - 15:35

దిల్లీ: ఎపి సిఎం చంద్రబాబు శుక్రవారం ఉదయం 11 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీని కలుస్తారు. ఈ మేరకు ఆయనకు ప్రధాని కార్యాలయం నుంచి అపాయింట్‌మెంటు మంజూరైంది. ప్రధానితో భేటీ సందర్భంగా ఎపికి ప్రత్యేక హోదా అంశాన్ని చంద్రబాబు ప్రస్తావించనున్నట్టు సమాచారం. ఈ రోజు సాయంత్రం చంద్రబాబు దిల్లీ చేరుకుని కృష్ణా పుష్కరాలకు రావాల్సిందిగా రాష్టప్రతి, ఇతర ప్రముఖులను కలుస్తారు.

08/04/2016 - 15:35

విజయవాడ: కాంగ్రెస్ నేత దేవినేని నెహ్రూ గురువారం ఇక్కడ ఎపి టిడిపి అధ్యక్షుడు కె.కళావెంకట్రావును కలవడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. సుమారు పది నిమిషాల సేపు వీరి భేటీ కొనసాగింది. టిడిపిలో చేరేందుకు నిర్ణయించుకున్నందునే నెహ్రూ కళాను కలిశారని సమాచారం.

08/04/2016 - 15:34

కాకినాడ: ఎపికి ప్రత్యేక హోదా సాధించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ సిద్ధమేనా? అని కాపు ఉద్యమనాయకుడు ముద్రగడ పద్మనాభం ప్రశ్నించారు. తనవి దొంగదీక్షలని అంటున్నవారు దీక్షలు చేయగలరా? అని ఆయన సవాల్ విసిరారు. ఈ మేరకు ఆయన చంద్రబాబుకు ఒక లేఖ రాశారు. ప్రత్యేకహోదా కోసం చంద్రబాబుతో పాటు తాను కూడా దీక్షలో కూర్చుంటానని, అపుడు ఎవరు ఎక్కువ రోజులు దీక్ష చేయగలుగుతారో ప్రజలకు తెలుస్తుందన్నారు.

08/04/2016 - 15:34

దిల్లీ: దేశ రాజధాని ప్రాంతం (ఎన్‌సిఆర్)లో పూర్తి అధికారాలు దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌కే ఉంటాయని దిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. లెఫ్టినెంట్ గవర్నర్ అధికారాలను సవాల్ చేస్తూ దాఖలైన పలు పిటిషన్లపై హైకోర్టు గురువారం తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు దిల్లీ సిఎం కేజ్రీవాల్‌కు అశనిపాతం లాంటిదని పరిశీలకులు భావిస్తున్నారు.

08/04/2016 - 15:33

గుంటూరు: వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయం రెండో బ్లాకులో హోం శాఖ కార్యాలయాన్ని రాష్ట్ర హోం మంత్రి ఎన్.చినరాజప్ప గురువారం ప్రారంభించారు. ఇక్కడి నుంచే తమ శాఖ కార్యకలాపాలన్నీ జరుగుతాయని ఆయన తెలిపారు. డిజిపి ఎన్.సాంబశివరావు, పోలీసు శాఖకు చెందిన పలువురు సీనియర్ అధికారులు పాల్గొన్నారు.

08/04/2016 - 15:33

చిత్తూరు: ఎపికి ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం వైఖరికి నిరసనగా టిడిపి నాయకుడు, మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమ నాయుడు నగరి నియోజకవర్గంలో గురువారం భిక్షాటన చేశారు. ఈ సందర్భంగా వచ్చిన 15వేల రూపాయలను ముఖ్యమంత్రి సహాయనిధికి పంపుతున్నట్లు ఆయన తెలిపారు. విభజన సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని మాత్రమే ఎపి ప్రజలు కోరుతున్నారని అన్నారు.

08/04/2016 - 15:32

హైదరాబాద్: రాష్ట్ర విభజన జరిగిన సమయంలో ఎపికి అయిదేళ్లు కాదు, పదేళ్లపాటు ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ బిజెపి నేతలు గొప్పగా మాట్లాడారని, నేడు హోదా గురించి అడిగితే కాదంటున్నారని సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ విమర్శించారు. ఆయన గురువారం ఉదయం మీడియాతో కాసేపు మాట్లాడుతూ బిజెపి నేతలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

08/04/2016 - 14:41

హైదరాబాద్ : పోలీసులతో సమానంగా హోంగార్డులు పనిచేస్తున్నా 30శాతం తక్కువ జీతాలు ఉన్నాయని, తెలుగు రాష్ట్రాల్లో హోంగార్డుల జీతాలు పెంచాలని బీజేపీ నేత కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు. హోంగార్డుల సమస్యలపై గవర్నర్‌కు గురువారంకిషన్‌రెడ్డి వినతిపత్రం అందజేశారు. మహిళా హోంగార్డులకు ప్రసూతి సెలవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

08/04/2016 - 14:38

గుజరాత్ : ఆర్థికంగా వెనుబడినవారికి గుజరాత్ ప్రభుత్వం కల్పించిన 10 శాతం రిజర్వేషన్లను ఆ రాష్ట్ర హైకోర్టు గురువారం కొట్టివేసింది. ఈబీసీలకు 10 శాతం రిజర్వేషన్లు ఇస్తూ మే నెలలో ప్రభుత్వం తీసుకున్ననిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ బీసీలు, విద్యార్థులు, సాంఘిక సంస్థలు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఆ రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంది.

08/04/2016 - 13:20

చెన్నై: కృష్ణగిరి జిల్లా దసంపట్టి ప్రాంతంలో గత రాత్రి చెన్నై-పళని ఎక్స్‌ప్రెస్‌ రైలు పట్టాలు తప్పింది. ఇంజను, రెండు బోగీలు పట్టాలు తప్పాయి. సంఘటనలో ఎవరూ గాయపడలేదని రైల్వే అధికారులు వెల్లడించారు. ఘటనపై విచారణకు ఆదేశించినట్లు చెప్పారు. 3 గంటలపాటు ఆ మార్గంలో రైళ్లను నిలిపేసి తర్వాత తిరిగి ప్రారంభించారు.

Pages