S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

08/04/2016 - 05:44

హైదరాబాద్, ఆగస్టు 3: మహానగరంలో ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను, అలాగే జిహెచ్‌ఎంసి సేవలైన జనన, మరణ ధృవీకరణ పత్రాలను మరింత త్వరితగతిన పొందేందుకు వీలుగా గ్రేటర్ ఇటీవలే ప్రారంభించిన ‘మై జిహెచ్‌ఎంసి’యాప్‌కు అంతర్జాతీయ స్థాయిలో ఆదరణ వస్తోంది.

08/04/2016 - 05:42

హైదరాబాద్, ఆగస్టు 3: సికిందరాబాద్‌లో నకిలీ పోలీసులు హల్‌చల్ చేశారు. ఓ వ్యాపారి బ్యాగుల్లో బ్రౌన్ షుగర్ ఉందంటూ తనిఖీ చేస్తూ దృష్టి మరల్చారు. దుండగులు వ్యాపారి వద్ద నుంచి రూ. 7.5 లక్షలతో ఉడాయించిన సంఘటన బుధవారం మహాంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సికిందరాబాద్ సుభాష్‌నగర్‌కు చెందిన గోపినాథ్ ఇటీవల వ్యాపార నిమిత్తం చెన్నై వెళ్లారు. చెన్నై-హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్ రైలులో రూ.

08/04/2016 - 05:00

విజయవాడ, ఆగస్టు 3: దేశంలో పెరుగుతున్న బాలకార్మిక వ్యవస్థ బాల్యవిహాహాలు, అక్రమ తరలింపులపై స్వచ్ఛంద సంస్థలు మరింత విస్తృతంగా పని చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని విజయవాడలో జరిగిన దక్షిణ భారత రాష్ట్రాల స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. స్వచ్ఛంద సంస్థలు చేపట్టే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రభుత్వ సహాయ సహకారాలు అవసరమని వారు పేర్కొంటున్నారు.

08/04/2016 - 04:58

అవనిగడ్డ, ఆగస్టు 3: మండల పరిధిలోని కొత్తపేట, దక్షిణ చిరువోల్లంక, వేకనూరు, రామచంద్రపురం, తుంగలవారిపాలెం, పులిగడ్డ గ్రామాల్లోని పుష్కర ఘాట్లను బుధవారం శాసనసభ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ పరిశీలించారు. కొత్తపేటలో నిర్మాణంలో ఉన్న పుష్కరఘాట్‌ను పరిశీలించిన ఆయన పనులు మరింత వేగవంతం చేయాలని, ముళ్ళపొదలు తొలగించాలని, పాత ఘాట్ వద్ద టైల్స్ ఏర్పాటు చేయాలని సూచించారు.

08/04/2016 - 04:57

నాగాయలంక, ఆగస్టు 3: తెలుగు రాష్ట్రాలైన ఆంధ్ర, తెలంగాణలో గ్రామాల అభివృద్ధికి ఆర్థిక సంఘం నిధులు కేటాయించకుండా కేంద్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధిని అణగదొక్కుతోందని రాష్ట్ర పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షులు, ఎమ్మెల్సీ యలమంచిలి బాబూ రాజేంద్రప్రసాద్ అన్నారు.

08/04/2016 - 04:55

విజయవాడ, ఆగస్టు 3: ఘాట్ల అన్నింటిలో మల్టీ డిసిప్లిన్ టీమ్‌ను ఒక ఐఎఎస్ అధికారి లేదా డెప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారి ఆధ్వర్యంలో నియమిస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ గంధం చంద్రుడు చెప్పారు. స్థానిక జాయింట్ కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో బుధవారం నిర్వహించిన అధికార్ల సమావేశంలో జెసి పలు సూచనలు చేశారు. పుష్కర యాత్రికులకు సేవలందించే అన్ని ప్రభుత్వశాఖల అధికార్లు ఈ బృందంలో సభ్యులుగా ఉంటారన్నారు.

08/04/2016 - 04:54

మచిలీపట్నం (కోనేరుసెంటర్), ఆగస్టు 3: నవ్యాంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ జిల్లా తెలుగుమహిళ సంఘం ఆధ్వర్యంలో స్థానిక బస్టాండు సెంటరులోని అంబేద్కర్ విగ్రహం వద్ద బుధవారం నోటికి నల్ల బ్యాడ్జీలు కట్టుకుని నిరసన తెలిపారు. ఈసందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షురాలు ఆచంట సునీత మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నవ్యాంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేశారు.

08/04/2016 - 04:53

మచిలీపట్నం, ఆగస్టు 3: నవ్యాంధ్రప్రదేశ్‌లో తొలిసారిగా గత ఏడాది నిర్వహించిన గోదావరి పుష్కరాలకు దీటుగా కృష్ణా పుష్కరాలు నిర్వహించాలన్న ప్రభుత్వ సంకల్పం నెరవేరేలా కనిపించడం లేదు. పుష్కరాల సమయం సమీపిస్తున్నా అభివృద్ధి పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా తయారయ్యాయి. ఫలితంగా పుష్కర యాత్రికుల భద్రతకు ముప్పు జరిగే ప్రమాదం పొంచి వుందని భయపడుతున్నారు.

08/04/2016 - 04:39

శనిసింగనాపూర్ ఆలయంలోకి స్ర్తీలను అనుమతిం చడం లేదన్నది అసత్యం. అలాగే నల్లదుస్తులే ధరిం చాల న్న నియమం కూడా లేదు. ఆలయంలోకి స్ర్తిపురు షులిద్దరికీ ప్రవేశం ఉంది. అయతే శనేశ్వరుడికి తైలంతో అభిషేకం మాత్రం పురుషులే చేస్తారు. ఇంచుమించు 20అడుగుల ఎత్తులో ఉండే రాతిఫలకమే శనేశ్వరుడు. ఒక చేతిలో పూజ సామగ్రి, మరో చేతిలో నూనె సీసాతో మోకాటి మీదుగా కట్టుకున్న అంగవస్త్రంతో అంత ఎత్తుకు వెళ్లాలి.

08/04/2016 - 04:38

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రోత్సాహం కరువై మూతపడుతున్న అనుబంధ వ్యవసాయ పరిశ్రమల్లో ఉప్పు తయారీ పరిశ్రమ కూడా చేరిపోయింది. ఎటువంటి యం త్రాల సహాయంలేకుండా కేవలం మానవశక్తితో తయారయ్యే సాధారణ ఉప్పు పరిశ్రమ ఏలికల నిర్లక్ష్యంతో ఏ ఏటికాయేడు కరిగిపోతోంది.

Pages