S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/05/2016 - 02:21

అరకులోయ, జూలై 4: పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఒక ఉద్యమంలా నిర్వహించాలని అటవీ శాఖ అరకులోయ రేంజి అధికారి బి.అప్పారావు పిలుపునిచ్చారు. స్థానిక గిరిజన సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల ప్రాంగణంలో గురువులు, అటవీ అధికారులు, విద్యార్థుల తల్లిదండ్రులు సోమవారం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీవకోటి మనుగడకు ప్రాణాధారమైన మొక్కలను ప్రతి ఒక్కరూ పెంచాలన్నారు.

07/05/2016 - 02:20

విశాఖపట్నం, జూలై 4: మహా విశాఖ నగరపాలక సంస్థ (జివిఎంసి) ప్రధాన వైద్యాధికారి (సిఎంఒ) పోస్టు భర్తీ రాజకీయ రంగుల రాట్నంలో గిరగిరా తిరుగుతోంది. దాదాపు రెండేళ్లుగా ఖాళీగా ఉన్న సిఎంఒ పోస్టు కోసం పదుల సంఖ్యలోనే వైద్యులు పోటీ పడ్డారు.

07/05/2016 - 02:18

సీతంపేట, జూలై 4: మన్యానికే వీరుడు అల్లూరి సీతరామరాజు అని కలెక్టర్ లక్ష్మినృసింహం పేర్కొన్నారు. స్థానిక పిఎంఆర్‌సి కేంద్రంలో సోమవారం అల్లూరి సీతరామరాజు 120వ జయంతి ఉత్సవాలను నిర్వహించారు. ముఖ్యఅతిథిగా కలెక్టర్ విచ్చేసి మాట్లాడారు. ముందుగా అల్లూరి సీతరామరాజు చిత్రపటానికి పూలమాలను వేసి నివాళులు అర్పించారు. మన్యం వాసుల కోసం అల్లూరి సీతరామరాజు అలుపెరుగని పోరాటాలు చేశారన్నారు.

07/05/2016 - 02:18

కొత్తూరు, జూలై 4: ఓ శుభకార్యంలో పాల్గొని, అక్కడి భోజనాలు చేసిన పలువురు అతిథులు ఆస్పత్రి పాలయ్యారు. మండల కేంద్రం కొత్తూరు చెవిటమ్మతల్లి ఆలయం సమీపంలో ఉన్న సారిపల్లివీధికి చెందిన సుమారు 50 మంది విషాహారం తిని సోమవారం అస్వస్థతకు గురయ్యారు. బాధితులను పాతపట్నం ఎమ్మెల్యే కలమట వెంకటరమణ ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు.

07/05/2016 - 02:17

శ్రీకాకుళం(రూరల్), జూలై 4: నానాటికి వ్యవసాయ రంగం సంక్షోభంలోకి కూరుకుపోతుండడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వీటిని నమ్ముకున్న కుటుంబాలను ఆదుకునేలా వివిధ కార్యక్రమాలను రూపొందిస్తూ ముందుకు సాగుతున్నాయి.

07/05/2016 - 02:16

శ్రీకాకుళం(టౌన్), జూలై 4: జిల్లా పోలీసు కార్యాలయం ఆవరణలో సోమవారం నిర్వహించే ఎస్పీ గ్రీవెన్స్‌కు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. మొత్తం 25 అర్జీలు రాగా వాటిని పరిశీలించిన జిల్లా ఎస్పీ జె.బ్రహ్మారెడ్డి సంబంధిత పోలీసు స్టేషన్ హౌస్ అధికారులతో మాట్లాడుతూ వివిధ సమస్యల పరిష్కారం నిమిత్తం ఎస్పీ కార్యాలయానికి వచ్చే అర్జీలను త్వరితగతిన పరిష్కరించి ఫిర్యాదు దారులకు న్యాయం జరిగేలా చూడాలని ఆదేశించారు.

07/05/2016 - 02:16

శ్రీకాకుళం(టౌన్), జూలై 4: జిల్లా ప్రజా ఫిర్యాదుల విభాగానికి వచ్చే సమస్యల పట్ల సంబంధిత అధికారులు స్పందించి తక్షణమే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ వివేక్ యాదవ్ ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించే డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమంలో ఫోన్‌ద్వారా ఆయన వినతులు స్వీకరించారు.

07/05/2016 - 02:15

శ్రీకాకుళం, జూలై 4: ఏభై కోట్ల రూపాయల వంశధార షట్టర్ల కుంభకోణాన్ని సి.ఐ.డి. అధికారులు విచారణలు చేసీచేసి... చివరికి ఐదు కోట్లు విలువచేసే షట్టర్లు తుప్పుపట్టిపోతున్నాయంటూ నివేదికలు ప్రభుత్వానికి ఇచ్చారు.

07/05/2016 - 02:14

శ్రీకాకుళం, జూలై 4: స్వామి వివేకానంద, అల్లూరి సీతారామరాజుల స్ఫూర్తితో యువత చైతన్యవంతులు కావాలని, దేశానికి దశదిశ నిర్థేశించేది యువత మాత్రమేనని పార్లమెంట్ సభ్యుడు రామ్మోహన్‌నాయుడు అన్నారు. స్థానిక బాపూజీ కళామందిర్‌లో సోమవారం స్వామివివేకానంద అమృతోత్సవాలు, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జన్మదినోత్సవం, సిక్కోలు యువశక్తి ఆవిర్భావ దినోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.

07/05/2016 - 02:14

ఎచ్చెర్ల, జూలై 4: తాతదండ్రుల నుండి సాగులో ఉన్న రైతులందరికీ పట్టాదారు పాస్ పుస్తకాలు జారీ చేసి భూవిస్తరణ ప్రాప్తికి మ్యుటీషన్ ప్రక్రియ పూర్తి చేయాలని కొంగరాంపంచాయతీ ఏజిఎన్ పేట రైతులు ఇంచార్జ్ తహశీల్దార్ బలివాడ శ్రీహరికి వినతిపత్రం అందించారు. సుమారు 150మంది రైతులు సర్వే నెంబర్ 501నుండి 520వరకు 125 ఎకరాలు భూమి కలిగి ఉన్నారు.

Pages