S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

04/16/2016 - 07:02

వాషింగ్టన్, ఏప్రిల్ 15: వర్షాలు సమృద్ధిగా కురిసి, ద్రవ్యోల్బణం దిగివస్తే వడ్డీరేట్లను మరింతగా తగ్గిస్తామని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) గవర్నర్ రఘురామ్ రాజన్ అన్నారు. ‘ద్రవ్యోల్బణం కదలికలను గమనిస్తున్నాం.

04/16/2016 - 07:01

విజయవాడ, ఏప్రిల్ 15: భారతీయ రైల్వే విభాగమైన రైల్‌టెల్ అతిత్వరలో విజయవాడ రైల్వేస్టేషన్‌లో త్వరలోనే హైస్పీడ్ పబ్లిక్ ఫ్రీ వైఫై సేవలను ఆరంభించనుంది. ఇది రైల్‌వైర్‌గా తన విస్తృత నెట్‌వర్క్‌లో గూగుల్‌తో కలసి ఇంటర్నెట్ సేవలను అందిస్తోంది. దీంతో గూగుల్ దేశవ్యాప్తంగా పది ముఖ్యమైన రైల్వేస్టేషన్లలో పబ్లిక్ వై-ఫై సేవలను అందు బాటులోకి తెస్తున్నట్లైంది.

04/16/2016 - 06:53

మాంటే కార్లో, ఏప్రిల్ 15: మాంటే-కార్లో మాస్టర్స్ టెన్నిస్ టోర్నమెంట్‌లో బ్రిటన్ ఆటగాడు ఆండీ ముర్రే, ‘స్పెయిన్ బుల్’ రాఫెల్ నాదల్, ఫ్రాన్స్‌కు చెందిన జో-విల్‌ఫ్రెడ్ సోంగా, గేల్ మోన్‌ఫిల్స్ సెమీఫైనల్స్‌కు దూసుకెళ్లారు. అయితే స్విట్జర్లాండ్‌కు చెందిన దిగ్గజ ఆటగాడు రోజర్ ఫెదరర్‌కు క్వార్టర్ ఫైనల్స్‌లోనే చుక్కెదురైంది.

04/16/2016 - 06:52

న్యూఢిల్లీ, ఏప్రిల్ 15: ఇండియన్ ప్రీమియర్ లీగ్ ట్వంటీ-20 క్రికెట్ టోర్నమెంట్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టు బోణీ చేసింది. ఇంతకుముందు కోల్‌కతా నైట్ రైడర్స్‌తో ఆడిన తొలి మ్యాచ్‌లో ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్న ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టు శుక్రవారం న్యూఢిల్లీలోని సొంత మైదానం ఫిరోజ్‌షా కోట్లా స్టేడియంలో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌ను 8 వికెట్ల తేడాతో మట్టికరిపించి తొలి విజయాన్ని అందుకుంది.

04/16/2016 - 06:52

కరాచీ, ఏప్రిల్ 15: పాకిస్తాన్ క్రికెట్ చీఫ్ సెలెక్టర్‌ను ఎంపిక చేసేందుకు పిసిబి (పాక్ క్రికెట్ బోర్డు) తన అనే్వషణను ముమ్మరం చేసింది. ఈ పదవిని చేపట్టేందుకు పాక్ జాతీయ జట్టు మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్‌హక్ ఆసక్తిని వ్యక్తం చేశాడు. దీంతో ఈ పదవి కోసం రేసులో ఉన్న ఆశావహుల జాబితాలో ఇంజమామ్ పేరును కూడా చేర్చి ఆ జాబితాను పిసిబి మరింత పొడిగించింది.

04/16/2016 - 06:51

న్యూఢిల్లీ, ఏప్రిల్ 15: కరవుతో అల్లాడుతున్న మహారాష్టన్రుంచి 13 ఐపిఎల్ మ్యాచ్‌లను వేరే చోటికి మార్చాలన్న ముంబయి హైకోర్టు ఆదేశం తర్వాత తన షెడ్యూల్ అంతా ఒక్కసారిగా కకావికలు కావడంతో ఐపిఎల్ ఫైనల్ మ్యాచ్‌కి వేదికగా ముంబయికి బదులు బెంగళూరును ఎంపిక చేసుకోవడంతో పాటు హైకోర్టు తీర్పు కారణంగా నష్టపోయిన రాష్ట్రానికి చెందిన ప్రాంచైజీలకు నాలుగు ప్రత్యామ్నాయ హోమ్ ఆప్షన్లను ఇచ్చింది.

04/16/2016 - 05:47

హైదరాబాద్, ఏప్రిల్ 15: రైతుల పంట రుణాల మాఫీ కోసం రూ.17 వేల కోట్ల భారీ మొత్తాన్ని కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులలో అనర్హుల వడపోత చర్యల్ని చేపట్టింది. ఒక్కో రైతు కుటుంబానికి లక్ష రూపాయల వరకు పంట రుణాన్ని మాఫీ చేసి ఇప్పటికే రెండు వాయిదాలు బ్యాంకులకు చెల్లించిన ప్రభుత్వం అనర్హులైన వారిని గుర్తించడానికి రెవిన్యూ శాఖ, బ్యాంకర్లు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.

04/16/2016 - 05:43

హైదరాబాద్, ఏప్రిల్ 15: రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు, త్రీడి తెర ఉన్న టీవి, సెల్‌ఫోన్‌లను తయారు చేసే కంపెనీని తెలంగాణలో ఏర్పాటు చేసేందుకు చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ తయారీ సంస్థ కెడిఎక్స్ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. కళ్లద్దాలు లేకుండా త్రీడి చిత్రాన్ని చూడగలిగే తెరలను తయారు చేసే ఏకైక సంస్థ ప్రపంచంలో కెడిఎక్స్ మాత్రమే.

04/16/2016 - 05:42

వేలేరుపాడు, ఏప్రిల్ 15: విలీనపోలవరం ముంపు మండలాల్లో బుధవారం జరిగిన సి ఎం చంద్రబాబునాయుడు పర్యటన నిర్వాసితులకు తీవ్ర నిరాశను మిగిల్చింది. ఎప్పటి నుంచో పోలవరం ప్రాజెక్టు కారణంగా సర్వం కోల్పోయిన తమకు మెరుగైన పునరావాసం, నష్టపరిహారం కల్పిస్తామని అధికార యంత్రాంగం అనాధి నుంచి బాకాలు కొట్టడం అందరికీ తెలిసిందే.

04/16/2016 - 05:42

వీరవాసరం, ఏప్రిల్ 15: శ్రీ రామనవమి సందర్భంగా శుక్రవారం వీరవాసరం మండలంలో నవమి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. వీరవాసరం శ్రీ సీతారామస్వామి ఆలయంలో రాష్ట్ర ఇంటిలిజెన్స్ అడిషనల్ డిజిపి రావాడ ఆజాద్ చంద్రశేఖర్ దంపతులు స్వామివారి కల్యాణాన్ని నిర్వహించారు. గత పదేళ్లుగా వీరి కుటుంబ సభ్యులే కల్యాణం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.

Pages