S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

12/21/2015 - 03:32

భగవంతుని ఉత్తర ద్వారం గుండా దర్శిస్తే మోక్షదాయకమని భక్తుల విశ్వాసం. ముక్కోటి దేవతలు కూడా భగవంతుని ఉత్తర ద్వారం నుండి దర్శిస్తారని, అందుకే ముక్కోటి ఏకాదశిగా పిలువబడుతున్నదని అంటారు. మరొక విశేషమేమంటేఈ ఏకాదశినే ‘గీతా జయంతి’ పరిగణిస్తున్నారు.

12/21/2015 - 03:37

* కలియుగాంతంలో హిమాలయముల నుండి సిద్ధపురుషులు వచ్చి ఇక్కడి ప్రజలకు ధర్మాన్ని బోధిస్తారని భాగవతంలో వుంది. దేవీభాగవతంలో మాత్రం కలియుగాంతంలో ప్రళయం వచ్చి ప్రపంచాన్ని ముంచివేయగా, ఆ తరువాత మళ్ళీ కృతయుగం ఆరంభమవుతుందని రాశారు. ఇందులో ఏది సత్యం?
- సి.వాసుదేవరావు, శ్రీకాకుళం

12/21/2015 - 03:28

ధ నుర్మాసం రాగానే విల్లిపుత్తూరు లోని విష్ణుచిత్తుడే మదిలో మెదలుతుంటాడు. ఆ రోజుల్లో విష్ణుచిత్తునకు దొరికిన చిన్నది గోకులంలో ఉన్నానని, తాను గోపికనని, తనతో ఉన్నవారందరూ గోపికలే నని అనుకొంటూ మనమందరం కలసి గోపాలబాలదేవుని కొలుద్దాం రండి అని తన చెలులందరినీ పిలిచేది.

12/21/2015 - 03:38

ఆదిపరాశక్తి కనులు తెరిస్తే సృష్టి ఆ తల్లి కనులు మూస్తే ప్రళయం. కనుక ఆ తల్లిని కీర్తించని వారు ఎవరూ ఉండరు. అంతా తల్లినే కనుక ఆమె సృష్టిలోని ప్రాణులల్లో ఉత్తమ జీవులైన మానవులకు వివేక విచక్షణాదులతో ఉన్న బుద్ధి చాతుర్యములతో అమ్మను అనేకానేక విధాలుగా కీర్తిస్తుంటారు. అమ్మ వైభవమును, అమ్మశక్తిని కొనియాడటానికి వర్ణించడానికి ఎవరికినీ శక్తి చాలదు.

12/21/2015 - 03:16

ఆత్మ పరమాత్మల పరిశోధనకు
ఉపక్రమించటం లేదు
ఆంతర్ముఖ ఆలోచన్ల పాతర లోతుల్ని
లెక్కించటం లేదు
వర్తమాన జీవన స్రవంతిపై జలతరంగిణి
వినిపించాలనీ లేదు
బాల్యం తప్పటడుగుల్ని
తడిమి తడిమి చూచుకుంటూ
వయసు ఎక్కుతున్న నిచ్చెనమెట్లపై నుండి
వెనక్కు వెనక్కు ఆలోచించుకుంటున్నాను

12/21/2015 - 03:13

చెట్టుకు వేలాడుతున్న
మట్టి పాదాల చుట్టూ మూగి
ఎంతగా పరితపించినా
ఏం ప్రయోజనం

చావు రహస్యాన్ని
పలుసార్లు చెవిలో ఊదినా
చలించని పాలకుల్ని
నిలదీయాలి గాని

రుతువు వెళ్లిపోయాక
రాలిన బంతిపూల మీద
ఎంతగా సానుభూతి వొలకబోసినా
ఏం ఫలితం

పొలాలమీద
పొరలు పొరలుగా విస్తరిస్తున్న
విషాద మేఘాల్ని
పసిగట్టాల్సి ఉంది

12/21/2015 - 03:11

ప్రఖ్యాత కవి, గాయకుడు గోరటి వెంకన్నకు మువ్వా పద్మవతి, రంగయ్య ఫౌండేషన్ జీవన సాఫల్య పురస్కారాన్ని ప్రదానం చేయనున్నట్లు కవి మువ్వా శ్రీనివాసరావు ప్రకటించారు. ఈ అవార్డు కింద 25వేల నగదు, మెమొంటో బహూకరిస్తారు. ఈ నెల 27వ తేదీన ఖమ్మంలోని భక్త రామదాసు కళాక్షేత్రంలో సత్కార సభ జరగనుంది.

12/21/2015 - 03:10

హిందీ సాహిత్య రంగంలో ప్రసిద్ధిగాంచిన సుప్రసిద్ధ కవి జయశంకర్ ప్రసాద్ రాసిన ‘ఆంసూ’ గేయ కవిత్వాన్ని ‘వేదన’గా జలజం సత్యనారాయణ అనుసృజించారు. ఈ నెల 24న మహబూబ్‌నగర్ పట్టణంలోని జిల్లా కోఆపరేటివ్ బ్యాంక్ ఆడిటోరియంలో ఉదయం 10 గంటలకు ‘వేదన’ ఆవిష్కరణ సభ జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత ఆచార్య ఎన్.గోపి విచ్చేసి ఆవిష్కరిస్తారు. సభాధ్యక్షులుగా తె.ర.వే.

12/21/2015 - 03:09

తెలుగు నుడి ఏనాటిదో శక తేదీలతో చెప్పలేం కానీ... ప్రాచీన కాలం నాటిదే. మూల ద్రావిడ భాష నుండి విడివడినదే తెలుగు నుడి. మూలం నుండి విడివడినప్పుడు, ఆ మూలంలోని కొన్ని ధాతువులు కొత్త నుడిలోకి వస్తాయి. అలా వచ్చిన ధాతువుల మాటలు కొత్త అలికిడి (ఉచ్ఛారణ)ని సంతరించుకుంటాయి. తెలుగు నుడి పుట్టుక, వ్రాలు (లిపి) ఏనాటికి పుట్టిందో కాని, అది సరిగా చెప్పలేం. మనకు దొరికిన 6వ శతాబ్దం నాటి తెలుగు శాసనమే మొదటిది.

12/21/2015 - 03:08

ఏ వ్యాసం చదివినా, పుస్తక సమీక్ష చదివినా, పుస్తక పరిచయం చదివినా, విన్నా... ప్రతిచోటా కన్పించేది, విన్పించేది వస్తువైవిధ్య ప్రస్తావనలే. కొంచెం అందంగా దీనే్న కవిత్వ విస్తృతి అంటుంటారు. ఇది ఆహ్వానించదగినదే. నిజానికి అట్లా ఎంతవరకు రాస్తున్నాయన్నదే ప్రశ్న. ఆయా కవితా సంపుటాల్లో, సంకలనాల్లో ఇందుకు పూర్తి విరుద్ధంగా తరచు కన్పిస్తుంటాయి. సంపుటాల్లో పూర్తిగా కవిదే బాధ్యత. కానీ సంకలనాల్లో అది సంపాదకులదీ.

Pages