S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

11/21/2015 - 06:18

హైదరాబాద్, నవంబర్ 20: వైట్నర్, ఇతర చౌక రకం మత్తు పదార్ధాలకు బానిసలవుతున్న బాలలను ఆదుకోవాలని, ఈ మత్తు పదార్ధాల విక్రయాలపై తీసుకుంటున్న చర్యలపై నివేదిక ఇవ్వాలని హైకోర్టు ఆంధ్ర, తెలంగాణ ప్రభుత్వాలను ఆదేశించింది.

11/21/2015 - 06:18

హైదరాబాద్, నవంబర్ 20: నిజామాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో మరో 11వందల ఇళ్లు అదనంగా కేటాయించాలని ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్ణయించారు. జగిత్యాల నియోజకవర్గంలో త్వరలోనే పర్యటించనున్నట్టు ముఖ్యమంత్రి చెప్పారు. నిజామాబాద్ ఎంపి కవిత, నిజామాబాద్ ఎమ్మెల్యే బి గణేష్ గుప్తా, జగిత్యాల టిఆర్‌ఎస్ ఇన్‌చార్జ్ డాక్టర్ సంజయ్ సచివాలయంలో ముఖ్యమంత్రి కెసిఆర్‌ను శుక్రవారం కలిశారు.

11/21/2015 - 06:13

బెంగళూరు, నవంబర్ 20: కర్నాటకలో బేలెకెరె రేవునుంచి ఖనిజం అక్రమ ఎగుమతి కేసులో గనుల వ్యాపారి గాలి జనార్దన్‌రెడ్డిని శుక్రవారం లోకాయుక్త పోలీసులు అరెస్టు చేశారు. ఇనుప ఖనిజం ఎగుమతికి సంబంధించి చోటుచేసుకున్న అక్రమాల్లో గాలి కంపెనీ ప్రమేయం ఉన్నట్టు లోకాయుక్త ప్రత్యేక దర్యాప్తు విభాగం ఆరోపణ. ఇంతకు ముందు గనుల అక్రమ తవ్వకం కేసుల్లో అరెస్టయిన జనార్దన్‌రెడ్డి చాలాకాలం జైలులో ఉండి బెయిల్‌పై బయటకు వచ్చారు.

11/21/2015 - 06:12

న్యూఢిల్లీ, నవంబర్ 20: జిహెచ్‌ఎంసి పరిధిలో ఓటర్లను తొలగిస్తున్నారంటూ ఫిర్యాదు చేసిన రాజకీయ పార్టీలకు దురుద్దేశాలు ఆపాదించిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ భన్వర్‌లాల్‌ను వెంటనే తొలగించాలని తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి కేంద్ర ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేశారు.

11/21/2015 - 06:11

విశాఖపట్నం, నవంబర్ 20: మానవ తప్పిదాల వలనే ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తున్నాయని నిపుణులు అభిప్రాయపడ్డారు. విశాఖలో జరుగుతున్న విపత్తుల నిర్వహణపై రెండో ప్రపంచ సదస్సులో భాగంగా రెండో రోజైన శుక్రవారం రెండు ప్లీనరీలు, తొమ్మిది సెషన్స్ జరిగాయి. రెండో రోజు సదస్సులో చర్చించిన అంశాల గురించి సాయంత్రం సదస్సు ప్రతినిధులు వివరించారు.

11/21/2015 - 06:10

హైదరాబాద్, నవంబర్ 20: అక్రమ నిర్మాణం జరుగుతోందని ఫిర్యాదు చేసినా జిహెచ్‌ఎంసి అధికారులు స్పందించలేదంటూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు శుక్రవారం తీవ్రంగా స్పందించింది. ఫిర్యాదు చేసినా స్పందించక పోవడానికి కారణం ఏమిటో ఈ నెల 24న కోర్టుకు హాజరై సంజాయిషి ఇవ్వాల్సిందిగా జిహెచ్‌ఎంసి కమిషనర్‌ను హైకోర్టు శుక్రవారం ఆదేశించింది.

11/21/2015 - 06:10

హైదరాబాద్, నవంబర్ 20: దేశంలో విద్యాబోధన స్వభావం మారిందని, తదనుగుణంగా విద్యార్ధులు ఆధునికతను అందిపుచ్చుకుని ప్రపంచమార్కెట్‌కు దీటుగా సిద్ధం కావాలని ఇగ్నో మాజీ విసి, ‘నేక్’మాజీ డైరెక్టర్, ఏసియా పసిఫిక్ క్వాలిటీ ఎడ్యుకేషన్ నెట్ వర్క్ వైస్ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ వి ఎస్ ప్రసాద్ పేర్కొన్నారు.

11/21/2015 - 06:09

హైదరాబాద్, నవంబర్ 20: రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో భారీ ఎత్తున అవకతవకలు జరుగుతున్నాయని, తమకు కావాల్సిన కాంట్రాక్టులకు ఏకపక్షంగా పనులు కేటాయిస్తూ కోట్లాది రూపాయల నిధుల మళ్లింపుకు టిడిపి ప్రభుత్వం పాల్పడుతోందని వైకాపా తీవ్రస్ధాయిలో ధ్వజమెత్తింది.

11/21/2015 - 06:09

న్యూఢిల్లీ, నవంబర్ 20: వ్యాపం కుంభకోణంతో సంబంధం ఉన్నట్లు అభియోగాలు ఎదుర్కొంటున్న మధ్యప్రదేశ్ గవర్నర్ రాంనరేశ్ యాదవ్‌ను ఆ పదవిలోనుంచి తొలగించాలని కోరుతూ దాఖలయిన పిటిషన్‌పై సమాధానం ఇవ్వాలని ఆయనను, కేంద్ర ప్రభుత్వాన్ని శుక్రవారం సుప్రీంకోర్టు ఆదేశించింది.

11/21/2015 - 06:08

హైదరాబాద్, నవంబర్ 20: వైట్నర్, ఇతర చౌక రకం మత్తు పదార్ధాలకు బానిసలవుతున్న బాలలను ఆదుకోవాలని, ఈ మత్తు పదార్ధాల విక్రయాలపై తీసుకుంటున్న చర్యలపై నివేదిక ఇవ్వాలని హైకోర్టు ఆంధ్ర, తెలంగాణ ప్రభుత్వాలను ఆదేశించింది.

Pages