S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

11/21/2015 - 05:45

ఏలూరు, నవంబర్ 20: దేశంలోనే తొలిసారిగా పోలీసు విభాగంలో ఇ-ఆఫీసు విభాగాన్ని డిజిపి జెవి రాముడు పశ్చిమగోదావరి జిల్లా కేంద్రం ఏలూరులో శుక్రవారం ప్రారంభించారు. ఈ విధానం ద్వారా అన్ని ఫైళ్లు ఆన్‌లైన్‌లో నడుస్తాయని, ఫలితంగా పోలీసు కార్యకలాపాలు వేగంగా, సులభంగా జరుగుతాయన్నారు. ఈ విధానం దేశంలోనే తొలిసారిగా పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రవేశపెట్టామని, రానున్న రోజుల్లో మరింతగా విస్తరిస్తామని తెలిపారు.

11/21/2015 - 05:44

విశాఖపట్నం, నవంబర్ 20: అసహనం అన్నది కాంగ్రెస్ జీవకణాల్లోనే ఉందని, సహనం అంటే కమ్యూనిస్టులకు తెలీదని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం వెంకయ్యనాయుడు విమర్శించారు. విశాఖలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశ ప్రజల తీర్పును కాంగ్రెస్ సహించలేక అసహనంతో కుంగిపోతోందని ఆరోపించారు.

11/21/2015 - 05:43

మనుబోలు, నవంబర్ 20: వర్షాలకు జాతీయరహదారి కుంగిపోయి నిన్న రాత్రి నుంచి ఒకపక్కే రాకపోకలు జరుగుతుండగా సిఎం రాక సందర్భంగా పోలీసులు వాహనాల నిలుపుదల చేయడంతో ప్రయాణికులు నానా అవస్థలు పడాల్సి వచ్చింది. పోలీసుల అతి వల్ల నాలుగుగంటలపాటు ప్రయాణికులు నరకం అనుభవించారు.

11/21/2015 - 05:43

శ్రీశైలం, నవంబర్ 20: శ్రీశైలం జలాశయానికి దిగువన ఎడమగట్టు పరిధిలో తెలంగాణ జెన్‌కో ఆధ్వర్యంలో కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న ఓవర్ రివర్ వ్యూ డ్యామ్‌కు గురువారం రాత్రి భారీ గండి పడింది. దీంతో రూ.2 కోట్ల మేరకు నష్టం వాటిల్లినట్లు సమాచారం. 2003 నుంచి ఈ టెయిల్ పాండ్ (ఓవర్ రివర్ వ్యూ) డ్యామ్ నిర్మిస్తున్నారు. సుమారు 90 శాతం పనులు పూర్తయ్యాయి.

11/21/2015 - 05:42

ఖమ్మం, నవంబర్ 20: హిందు సంప్రదాయం ప్రకారం రాష్ట్రంలోనే మొదటి సారిగా గోతులాభారాన్ని శుక్రవారం ఖమ్మం నగరంలో ఘనంగా నిర్వహించారు. సంస్కృతి, సాంప్రాదాయాలను తెలియ చేస్తూ గోవుల ప్రాముఖ్యతను వివరిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. వేల సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమానికి హాజరై భక్త్భివాన్ని చాటుకున్నారు. గోవుకు అత్యంత ప్రీతిపాత్రమైన దాణాతో తులాభారాన్ని నిర్వహించారు.

11/21/2015 - 05:41

తిరుమల, నవంబర్ 20: తిరుమలలో శ్రీవారి ఆర్జిత సేవ టిక్కెట్ల ధరలు పెరిగే అవకాశం కన్పిస్తోంది. ఈమేరకు తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆర్జిత సేవా టికెట్లు, లడ్డూ ప్రసాదం ధరలు, గదుల అద్దె పెంపు ప్రతిపాదనపై చర్చించేందుకు టిటిడి పాలక మండలి ఏర్పాటు చేసిన హేతుబద్ధీకరణ కమిటీ శుక్రవారం తిరుమల్లోని అన్నవయ్య భవనంలో తొలిసారిగా సమావేశమైంది.

11/21/2015 - 05:40

భీమవరం, నవంబర్ 20: తుపాన్ల వంటి ప్రకృతి వైపరీత్యాలను దృష్టిలో ఉంచుకుని వచ్చే సీజను నుండి ఖరీఫ్ పంట నవంబర్ నాటికి రైతు ఇంటికి చేరేలా ప్రణాళికలు సిద్ధం చేస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. నవంబర్, డిసెంబర్ మాసాల్లో తుపాన్ల ప్రభావం ఎక్కువగా ఉంటున్నందున అంతకంటే ముందుగానే పంట చేతికందేలా వ్యవసాయ ప్రణాళిక రూపొందిస్తామన్నారు.

11/21/2015 - 05:40

గుంటూరు, నవంబర్ 20: రాజధాని పరిధిలోని కృష్ణానది కరకట్టపై సిఎం ఉంటున్న నివాసం సక్రమమో.. అక్రమమో తేల్చిన తర్వాతే మత్య్సకారుల ఇళ్ల జోలికి రావాలని వైకాపా మంగళగిరి ఎమ్లెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. తాడేపల్లి మండలంలోని సీతానగరంలో శుక్రవారం రెవెన్యూ అధికారులు మత్య్సకారులకు చెందిన 32 ఇళ్లను తొలిగించేందుకు యత్నించారు.

11/21/2015 - 05:39

విశాఖపట్నం, నవంబర్ 20: బీమాను అన్ని రంగాలకు విస్తరింపజేయాలని రాష్ట్ర హోం మంత్రి చినరాజప్ప బీమా కంపెనీలను కోరారు. ప్రస్తుతం కొన్ని రంగాలకు మాత్రమే బీమాను వర్తింపజేయడంతో ప్రజలు ఎక్కువగా నష్టపోతున్నారన్నారు. బీమాపై ప్రజలకు మరింత అవగాహన కల్పించాలన్నారు.

11/21/2015 - 05:38

విజయవాడ, నవంబర్ 20: 2018 నాటికి పోలవరంతో పాటు రాష్ట్రంలోని పెండింగ్ ప్రాజెక్టులన్నింటిని త్వరితగతిన పూర్తిచేసేలా చర్యలు చేపట్టామని జలవనరులశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు.

Pages