S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

03/01/2018 - 00:12

పెనుకొండ, ఫిబ్రవరి 28 : మండల పరిధిలోని వెంకటరెడ్డిపల్లి వద్ద కొత్తచెరువు రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంలో గుల్బర్గ జిల్లా జోరిగి హిదేరి గ్రామానికి చెందిన సృష్టి (6) అనే చిన్నారి మృతి చెందింది. సృష్టి రోడ్డు దాటుతున్న సమయంలో పెనుకొండ వైపు నుండి వెళుతున్న ఆటో ఢీకొనడంతో తీవ్ర గాయాలకు గురైంది. వెంటనే ఆ చిన్నారిని పెనుకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స చేస్తుండగా మృతి చెందింది.

03/01/2018 - 00:04

సాలూరు, ఫిబ్రవరి 28: మండలంలోని కూర్మరాజుపేట గ్రామంలో క్షణికావేశంలో తాగివచ్చిన కొడుకును హత్యచేసిన సంఘటనలో తల్లిదండ్రులను అరెస్టుచేసినట్లు సీఐ సంజీవిరావు తెలిపారు. బుధవారం రూరల్ పోలీస్‌స్టేషన్‌లో విలేఖర్లతో ఆయన మాట్లాడుతూ ఫిబ్రవరి 25న మద్యం మత్తులో ఉన్న బెల్లాన గోపాలకృష్ణపై ఆయన తల్లిదండ్రులు పోలమ్మ, సింహాచలంలు దాడి చేశారన్నారు. ఈ దాడిలో కొడుకు గోపాలకృష్ణ అక్కడికక్కడే మృతిచెందాడన్నారు.

02/28/2018 - 04:02

హైదరాబాద్, ఫిబ్రవరి 27: ఖమ్మం జిల్లా కేంద్రంలో కొత్త కలెక్టరేట్ నిర్మాణానికి ప్రతిపాదించిన స్థలంలో ఎటువంటి నిర్మాణాలు చేపట్టవద్దని హైకోర్టు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.

02/28/2018 - 03:37

విశాఖపట్నం, ఫిబ్రవరి 27: విశాఖ జిల్లాలో వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న గంజాయి నిల్వలను మంగళవారం పోలీస్, ఎక్సైజ్ శాఖలు సంయుక్తంగా ధ్వంసం చేశాయి. జిల్లావ్యాప్తంగా 85 కేసుల్లో 11,493 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. న్యాయస్థానం అనుమతితో డ్రగ్స్ డిస్పోజల్ కమిటీ ఈ భారీ గంజాయి నిల్వలను విశాఖలో ధ్వంసం చేశారు.

02/28/2018 - 02:45

శంకర్‌పల్లి ఫిబ్రవరి 27: అమాయకుడైన ఓ వ్యక్తికి మాయమాటలు చెప్పి బంగారు పుస్తెలతాడు, రూ.3వేల నగదును దొంగిలించిన వ్యక్తిని పట్టుకొని శంకర్‌పల్లి పోలీసులు మంగళవారం రిమాండుకు తరలించారు. శంకర్‌పల్లి సీఐ శశాంక్‌రెడ్డి తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

02/28/2018 - 02:45

జీడిమెట్ల, ఫిబ్రవరి 27: భూ కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడైన చంద్రయ్య యాదవ్‌ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. సీఐ బాలకృష్ణారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. సూరారం వెంకట్రామ్‌నగర్, మస్తాన బిల్డర్స్‌లో నివాసముండే పోతురాజు రామచంద్రుడు అలియాస్ చంద్రయ్య యాదవ్ (53) 1999 నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు.

02/28/2018 - 00:13

గంగాధరనెల్లూరు, ఫిబ్రవరి 27: మండల పరిధిలోని బాలగంగనపల్లి పంచాయతీకి చెందిన బట్టు జంగనపల్లిలో కొడుకు, కోడలి మృతిని జీర్ణించుకోలేక వృద్ధ దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలిలా ఉన్నాయి. ఇరగమరెడ్డి(90), ఆదెమ్మ(80) కుమారుడు జయరామిరెడ్డి(50), సరోజమ్మ(45) ఆరు నెలల క్రితం తీవ్ర అనారోగ్యంతో మృతి చెందారు.

02/27/2018 - 22:08

హిందూపురం రూరల్, ఫిబ్రవరి 27: హిందూపురం సమీపంలోని తూమకుంట పారిశ్రామిక వాడ వద్ద ట్యాంకర్ బోల్తా పడిన సంఘ్రటన డ్రైవర్ రంగప్ప (45) అక్కడికక్కడే మృతి చెందాడు. చౌళూరుకు చెందిన రంగప్ప నీటి ట్యాంకర్‌ను వేగంగా నడుపుకొంటూ వెళుతుండగా అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో డ్రైవర్ చక్రాల కింద పడి మృతి చెందాడు.

02/27/2018 - 22:08

తలుపుల, ఫిబ్రవరి 27 : మండల పరిధిలోని మామిళ్లవారిపల్లికి చెందిన రైతు నరసింహారెడ్డి (64) మంగళవారం ప్రమాదవశాత్తు ఎడ్లబండిపై నుండి పడి మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు నరసింహారెడ్డి పొలం పనుల నిమిత్తం ఎడ్లబండిపై వెళ్తుండగా ప్రమాదవశాత్తు కింద పడ్డాడు. ప్రమాదంలో తీవ్రగాయాలు కావడంతో చికిత్స నిమిత్తం వెంటనే కదిరి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు.

02/27/2018 - 04:41

హైదరాబాద్, ఫిబ్రవరి 26: లాంగ్వేజి పండిట్ ట్రైనింగ్ కోర్సు ప్రవేశపరీక్షను వచ్చే నెల 15వ తేదీలోగా నిర్వహించాలని హైకోర్టు సోమవారం నాడు తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాధన్, జస్టిస్ కె విజయలక్ష్మిలతో కూడిన డివిజన్ బెంచ్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.

Pages