S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

02/26/2018 - 22:23

నరసరావుపేట, ఫిబ్రవరి 26: మండలంలోని ఉప్పలపాడు గ్రామానికి చెందిన ప్రసన్నాంజనేయరెడ్డి సుమారు మూడు సంవత్సరాల నుండి చుట్టుపక్కల గ్రామాల్లో పాలను కొని, కేంద్రానికి పోసి అమ్ముకుంటూ జీవిస్తుంటాడని డిఎస్పీ కె నాగేశ్వరరావు తెలిపారు. సోమవారం స్థానిక రూరల్ పోలీస్ స్టేషన్‌లో జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

02/26/2018 - 04:30

పాల్వంచ, ఫిబ్రవరి 25: మరో ఆరు రోజుల్లో వివాహం చేసుకొని ఒక ఇంటివాడై ఎంతో సంతోషంగా ఉండాల్సిన ఒక యువకుడు తన పెళ్లి శుభలేఖలను పంచుతూ కానరాని లోకాలకు వెళ్లాడు. ఈ దుర్ఘటన ఆదివారం పాల్వంచలో జరిగింది. మహబూబాబాద్ జిల్లా కె సముద్రంకు చెందిన కోరబోయిన ప్రవీణ్ (25) తన తండ్రి జనార్ధన్ ఇల్లందులోని ఒక బ్యాంకులో ఫీల్డ్ ఆఫీసర్‌గా పని చేస్తూ అక్కడే నివాసముంటున్నారు.

02/26/2018 - 04:16

బొమ్మరాసుపేట, ఫిబ్రవరి 25: మండల పరిధిలోని బురాన్‌పూర్ గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు ఆదివారం మోటార్ బైక్‌పై స్వగ్రామానికి తిరుగు ప్రయాణంలో వెళుతుండగా కొత్తవారి బావి వద్ద నిలిచి ఉన్న ట్రాక్టర్‌ను ఢీకొన్నారు. వీరిలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.

02/26/2018 - 04:03

రొంపిచర్ల, ఫిబ్రవరి 25: గుంటూరు జిల్లా రొంపిచర్ల మండలం అన్నవరప్పాడు గ్రామ సమీపంలో అద్దంకి - నార్కెట్‌పల్లి రాష్ట్ర రహదారిపై ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. గాయపడిన మరో తొమ్మిది మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

02/26/2018 - 00:05

మదనపల్లె, ఫిబ్రవరి 25: ఓ యువకుడిని అతి దారుణంగా హత్య చేసిన కేసులో ముగ్గురు నిందితులను ఆదివారం అరెస్టుచేసినట్లు మదనపల్లె డీఎస్పీ చిదానందరెడ్డి వెల్లడించారు. వివరాలు ఇలావున్నాయి... మదనపల్లె పట్టణంలోని సుభాష్‌రోడ్డుకు చెందిన ఉదయ్‌కుమార్, సయ్యద్ ఇర్ఫాన్, అన్న సయ్యద్ నోమన్‌లు బెంగళూరు నగరంలోని చిరంజీవి అనే వ్యక్తివద్ద పీఓపీ పనులు చేసుకుని జీవనం సాగించేవారు.

02/25/2018 - 23:05

పరిగి, ఫిబ్రవరి 25 : మండల పరిధిలోని కాలువపల్లి సమీపంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో హిందూపురం పట్టణంలోని ఎస్‌డీజీఎస్ కళాశాలలో డిగ్రీ చదువుతున్న రవితేజ (19) మృతి చెందాడు. రవితేజ కాలువపల్లి వద్ద ఓ బంక్‌లో పెట్రోలు వేయించుకుని పరిగి వైపు వెళ్తుండగా హిందూపురం నుండి మడకశిర వైపునకు వెళ్తున్న లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.

02/25/2018 - 04:04

కడప క్రైం, ఫిబ్రవరి 24: బ్యాంకుల నుంచి పెద్దమొత్తంలో రుణాలు తీసుకుని ఎగవేసిన బడాబాబులకు తానేమీ తీసిపోనని అంటున్నాడు కడప జిల్లాకు చెందిన అబ్దుల్ గఫార్. కూలీల పేర రూ. 2 కోట్ల మేరకు రుణం తీసుకుని ఓ ప్రైవేటు బ్యాంకుకు నామం పెట్టిన గఫార్ చివరకు కటకటాలపాలయ్యాడు. బ్యాంకుకు పోటీ పెట్టిన గఫార్ వివరాలు డీఎస్పీ మాసూంబాషా శనివారం విలేఖరులకు వెల్లడించారు.

02/25/2018 - 02:38

ముజఫర్‌పూర్ (బిహార్), ఫిబ్రవరి 24: బొలేరో వాహనం రూపంతో మృత్యువు తొమ్మిది మంది విద్యార్థులను కబళించింది. మీనాపూర్ పోలీసు స్టేషన్ పరిధిలో వేగంగా ప్రయాణిస్తున్న బొలేరో అదుపుతప్పి ప్రభుత్వ పాఠశాల వైపుదూసుకొచ్చింది. ఏకంగా విద్యార్థులపై నుంచి వాహనం వెళ్లిపోవడంతో తొమ్మిది మంది దుర్మరణం పాలయ్యారు. పాఠశాల ముగించుకున్న విద్యార్థులు ఇళ్లకు వెళ్లేందుకు వేచివుండగా ఈ దారుణం చోటుచేసుకుంది.

02/25/2018 - 02:33

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 24:పంజాబ్ నేషనల్ బ్యాంకులో జరిగిన కుంభకోణంతో దేశంలో బ్యాంకింగ్ వ్యవస్థ ఒడుదుడుకులకు గురవుతున్న నేపథ్యంలో మరో ప్రభుత్వరంగ బ్యాంక్, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్‌లో (ఓబీసీ) మరో కుంభకోణం వెలుగు చూసింది. ఢిల్లీ కేంద్రంగా వజ్రాల ఎగుమతి వ్యాపారం చేసే ద్వారకాదాస్ సేథ్‌పై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) కేసు నమోదు చేసింది.

02/25/2018 - 02:25

భువనేశ్వర్, ఫిబ్రవరి 24: ఒడిశాలో ఓ పెళ్లింట పెనువిషాదం సంభవించింది. పెళ్లిలో వచ్చిన గిఫ్ట్ బాక్స్ తెరవగా ఒక్కసారిగా పేలిపోయింది. ఈ దారుణ సంఘటలో వరుడు, అతడి నాయనమ్మ మరణించారు. ఒడిశాలోని బోలాన్‌గిరి జిల్లాలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఐదు రోజుల క్రితం యువతి, యువకుడికి పెళ్లయింది. ఈ నెల 21న వివాహ రిసెప్షన్ ఇంట్లో అందరూ ఉత్సాహంగా జరుపుకొన్నారు. అంతవరకూ బాగేనే ఉంది.

Pages