S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

12/10/2015 - 03:15

ఎన్టీఆర్, రకుల్‌ప్రీత్‌సింగ్ జంటగా సుకుమార్ దర్శకత్వంలో రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సమర్పణలో శ్రీ వేంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై భోగవల్లి ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం ‘నాన్నకు ప్రేమతో’. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం స్పెయిన్‌లో జరుగుతోంది. అన్ని కార్యక్రమాలు త్వరగా పూర్తిచేసి సంక్రాంతి కానుకగా సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

12/10/2015 - 03:13

విభిన్న సినిమాలతో వరుస విజయాలు అందుకుంటున్న యువ హీరో నిఖిల్, తాజాగా ‘శంకరాభరణం’ సినిమాతో ముందుకొచ్చాడు. వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న నిఖిల్ తన తదుపరి చిత్రానికి సన్నాహాలు చేస్తున్నారు. వి.ఐ.ఆనంద్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్లు వుంటారని, ఇప్పటికే తాప్సీ ఓ హీరోయిన్‌గా ఎంపికైంది.

12/10/2015 - 03:12

బాలీవుడ్ నటి రాణిముఖర్జీ తల్లయింది. ముంబైలోని బ్రీచ్‌కాండి ఆస్పత్రిలో ఆమె ఇవాళ ఆడపిల్లను ప్రసవించింది. తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉన్నారు. నిర్మాత ఆదిత్యచోప్రాను గతేడాది ఏప్రిల్ 21న వివాహం చేసుకున్న రాణిముఖర్జీ దంపతులు తమ గారాలపట్టికి ‘అదీర’ అని పేరుపెట్టాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని మరో నిర్మాత కరణ్‌జోహార్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

12/10/2015 - 03:10

శివ, మేఘశ్రీ జంటగా జె.ప్రభాకర్‌రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘అనగనగా ఒక చిత్రమ్’. ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది మేఘశ్రీ. ఈ చిత్రం ఈనెల 11న విడుదలవుతున్న సందర్భంగా మేఘశ్రీ చెప్పిన విశేషాలు. ‘ఈ సినిమాలో పరిమళాదేవి అనే పాత్రలో నటిస్తున్నాను. చాలా మెచ్యూర్డ్ గాళ్‌గా వుంటూనే అల్లరి పిల్లగా నా పాత్ర సాగుతుంది. సిటీ బ్యాక్‌డ్రాప్‌లో కాలేజీలో చదువుకునే అమ్మాయి పాత్ర.

12/10/2015 - 03:08

రుద్ర, వెనె్నల, సంజయ్ ప్రధాన పాత్రల్లో ఎం.వి.సాగర్ దర్శకత్వంలో శివాకృతి క్రియేషన్స్ పతాకంపై కెల్లం కిరణ్‌కుమార్ నిర్మించిన ‘వీరి వీరి గుమ్మడిపండు’ చిత్ర ప్లాటినమ్ డిస్క్ వేడుకలు బుధవారం హైదరాబాద్‌లో జరిగాయి. ముఖ్య అతిథిగా పాల్గొన్న దర్శకుడు మధురా శ్రీ్ధర్ చిత్ర బృందానికి ప్లాటినమ్ డిస్క్‌లను అందజేశారు.

12/10/2015 - 03:06

ప్రముఖ నటుడు కృష్ణ, విజయనిర్మల, నరేష్ ప్రధాన పాత్రల్లో ముప్పలనేని శివ దర్శకత్వంలో ఎస్.బి.ఎస్. ప్రొడక్షన్స్ పతాకంపై సాయిదీప్, బాలూరెడ్డి, షేక్ సిరాజ్‌లు నిర్మిస్తున్న చిత్రం శ్రీశ్రీ. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుపుకుంటున్న సందర్భంగా బుధవారం లొకేషన్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో హీరో కృష్ణ మాట్లాడుతూ, శ్రీశ్రీ అనే టైటిల్ వింటుంటే మహాకవి శ్రీశ్రీగారు గుర్తొస్తున్నారు.

12/10/2015 - 03:19

ఎనర్జీకి మారుపేరుగా నిలిచాడు రవితేజ. ఆయన సినిమాలు చాలా ఎనర్జిటిక్‌గా వుండి ప్రేక్షకులను గిలిగింతలు పెడతాయి. అన్నిరకాల ఎమోషన్లను పండించగల సత్తా వున్న నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా ఆయన ‘బెంగాల్ టైగర్’గా వస్తున్నాడు. సంపత్‌నంది దర్శకత్వంలో రవితేజ, తమన్నా, రాశీఖన్నా హీరో హీరోయిన్లుగా నటిస్తున్న బెంగాల్ టైగర్ ఈరోజు విడుదలవుతున్న సందర్భంగా రవితేజతో ఇంటర్వ్యూ..

12/08/2015 - 21:19

తమిళంలో విజయవంతమైన ‘కేడి బిల్లా-కిలాడి రంగా’ చిత్రాన్ని తెలుగులో అదే పేరుతో అనువదిస్తున్నారు. పాండిరాజ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో విమల్, శివకార్తికేయన్, రెజీనా, బిందుమాధవి ప్రధాన తారాగణంగా నటించారు. అనువాద కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రం త్వరలో ఆడియోను విడుదల చేసుకోనుంది. చిత్ర సమర్పకులు రాజ్‌కందుకూరి మాట్లాడుతూ, తమిళంలో విజయవంతమైన ఈ చిత్రం తెలుగులో కూడా విజయం సాధిస్తుందన్నారు.

12/08/2015 - 21:18

నాగశౌర్య, పాలక్ లల్వాని జంటగా జి.జె.సినిమాస్, కిరణ్ స్టూడియోస్, బ్లూమింగ్ స్టార్ మోషన్ పిక్చర్స్ పతాకాలపై రమేష్ వర్మ దర్శకత్వంలో వందన అలేఖ్య జెక్కం, కిరీటి, శ్రీనివాస్ సంయుక్తంగా రూపొందిస్తున్న చిత్రం ‘అబ్బాయితో అమ్మాయి’. ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు సిద్ధమయ్యాయి.

12/08/2015 - 21:15

‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ సినిమా ఇచ్చిన విజయంతో టాలీవుడ్‌లో హీరోయిన్‌గా దూసుకుపోతోంది గ్లామర్ భామ రకుల్‌ప్రీత్‌సింగ్. ఆ సినిమా తరువాత దాదాపు అరడజను సినిమాల్లో నటిస్తున్న ఈ భామ, అందరూ స్టార్ హీరోల సరసన నటిస్తుండడం విశేషం. ఇప్పటికే గోపీచంద్, రామ్‌చరణ్‌ల సరసన నటించింది.

Pages