S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/10/2018 - 20:59

తెలుగులో ‘దివ్యమణి’ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన గిరిధర్ గోపాల్, తన తదుపరి చిత్రంగా ప్రముఖ నాట్యమణి పద్మశ్రీ యామిని కృష్ణమూర్తి జీవిత కథను ఆధారంగాచేసుకొని బయోపిక్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు డైరెక్టర్ గిరిధర్ గోపాల్. ఈ సందర్భంగా విలేకరులతో ముచ్చటిస్తూ.. ‘నా మొదటి చిత్రం ‘దివ్యమణి’ని ప్రేక్షకులు ఆదరించినందుకు మొదటగా వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నా.

07/09/2018 - 21:11

నాగశౌర్య, కాశ్మీరా జంటగా శ్రీనివాసరావుని దర్శకుడిగా పరిచయం చేస్తూ తాజాగా చలో వంటి హిట్ చిత్రాన్ని నిర్మించిన ఐరా క్రియేషన్స్ పతాకంపై ఉషా ముల్పూరి, శంకర ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం నర్తనశాల. ఈ సినిమాకు సంబంధించిన ఓ సంగీత్ నేపథ్య గీతాన్ని హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో వేసిన సెట్‌లో చిత్రీకరిస్తున్నారు. ఈ సందర్భంగా నాగశౌర్య మాట్లాడుతూ- కథానుగుణంగా చిత్రానికి నర్తనశాల అనే పేరు పెట్టాం.

07/09/2018 - 21:10

బలిజ క్రియేషన్స్ పతాకంపై వేణుకుమార్ నిర్మాతగా విక్కీ దర్శకత్వం వహించి నటించిన చిత్రం ‘చిన్నారి’. ఈ చిత్రంలో సంజనా పటేల్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా ముఖ్యపాత్ర పోషించింది. శర్మ హీరోయిన్. ఈ చిత్రం టీజర్‌ను విడుదల చేశారు. ఈ వేడుకలో సీనియర్ నటీనటులు గీతాంజలి, రోజారమణి, కవిత, నటుడు తోటపల్లి మధు, తెలంగాణ మూవీ అండ్ టీవీ ఆర్టిస్ట్ యూనియన్ ప్రెసిడెంట్ శివన్న, డైమండ్ రత్నం తదితరులు పాల్గొన్నారు.

07/09/2018 - 21:08

సుజయ్, చంద్రకాంత్, తనిష్క, రష్మీ, సోని ముఖ్యపాత్రల్లో రాజశేఖర్ దర్శకత్వంలో సాయి హాసిని ప్రొడక్షన్స్ పతాకంపై నానే్చరి దేవాశంకర్‌గౌడ్ నిర్మిస్తున్న చిత్రం ‘నాకూ.. మనసున్నది’. హర్రర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈనెల 20న విడుదలకానున్న సందర్భంగా సోమవారం ఫిలిం ఛాంబర్‌లో ట్రైలర్ విడుదలైంది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రతాని రామకృష్ణగౌడ్ ట్రైలర్‌ని విడుదల చేశారు.

07/09/2018 - 21:07

జె.ఎస్.ఆర్. మూవీస్ పతాకంపై శ్రీమతి భాగ్యలక్ష్మి సమర్పణలో హరికృష్ణ జొన్నలగడ్డ, అక్షిత హీరో హీరోయిన్లుగా జొన్నలగడ్డ శ్రీనివాసరావు దర్శకత్వంలో సావిత్రి జొన్నలగడ్డ నిర్మిస్తున్న చిత్రం ‘ప్రేమెంత పనిచేసే నారాయణ’. ఈ చిత్ర ఆడియో ఇటీవల వైయస్ జగన్మోహన్‌రెడ్డి చేతుల మీదుగా విడుదలైంది. ఇక ఈ చిత్రంలోని సాంగ్ విజువల్స్‌ను సినీ, రాజకీయ ప్రముఖులు ఆవిష్కరించారు.

07/09/2018 - 21:05

హార్ట్‌బీట్, లెటర్ టూ కావ్య, మాణిక్యం ఎంఎంటిఎస్ లాంటి విభిన్నమైన కథనాల లఘు చిత్రాలకు రచన, దర్శకత్వం వహించిన కిరణ్ పాలకుర్తి తాజాగా రన్‌వే అనే షార్ట్ఫిలింకు రచన, దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి విడుదల చేశారు. షార్జాలో జరిగిన ఒక సంఘటన ఆధారంగా తెరకెక్కిన ఈ లఘు చిత్రంలో హర్షిత, భాగ్యరాజ్, సనత్ ముఖ్యపాత్రలు పోషించారు.

07/09/2018 - 21:04

హీరో బెల్లంకొండ సాయిశ్రీనివాస్, దర్శకుడు తేజ కాంబినేషన్‌లో సినిమా సోమవారం పూజా కార్యక్రమాలతో నానక్‌రామ్‌గూడ రామానాయుడు స్టూడియోలో ప్రారంభం అయ్యింది. ఈ కార్యక్రమంలో దర్శకులు వి.వి.వినాయక్, శ్రీవాస్ ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు. తొలి షాట్‌కు వి.వి.వినాయక్ క్లాప్ కొట్టగా, శ్రీవాస్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. దర్శకుడు తేజ ఫస్ట్ షాట్ డైరెక్షన్ చేశారు.

07/09/2018 - 20:59

మంచి పాత్రలు వస్తే నేను నటించడానికి ఎప్పుడూ సిద్ధమే అని అంటున్నాడు మాజీ క్రేజీ హీరో రాంకీ. అప్పట్లో రాంకీ - నిరోషా జంటగా నటించిన సింధూరపువ్వు సినిమా ఓ పెద్ద సంచలనం క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. ఆ సినిమాలోని ఓ పాట ఇప్పటికీ వినిపిస్తూనే వుంది. ఎలాంటి సినిమా నేపథ్యం లేకుండా పరిశ్రమలోకి వచ్చి హీరోగా క్రేజ్ తెచ్చుకున్నాడు రాంకీ. ప్రస్తుతం ఆయన క్రేజ్ తగ్గడంతో క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారిపోయాడు.

07/09/2018 - 20:56

మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్, సమంత జంటగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం రంగస్థలం. మైత్రి మూవీస్ పతాకంపై రూపొందిన ఈ చిత్రం ఇటీవలే విడుదలై సంచలన విజయం సాధించి వంద రోజులు పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా వంద రోజుల వేడుకను హైదరాబాద్‌లో జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో హీరో రామ్‌చరణ్ మాట్లాడుతూ ‘మా డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్, నిర్మాతలు, సుకుమార్, రత్నవేలు, దేవిశ్రీప్రసాద్‌గారికి థాంక్స్.

07/08/2018 - 21:16

తొలిప్రేమ, డార్లింగ్, ఉల్లాసంగా ఉత్సాహంగా వంటి సూపర్ డూపర్ హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించి లవ్ స్టోరీస్ స్పెషలిస్టుగా తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్‌ని సంపాదించుకున్న దర్శకుడు ఎ.కరుణాకరన్.

Pages