S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

09/27/2017 - 16:09

ప్రతిష్ఠాత్మక అవార్డు ఆస్కార్ బరిలో నిలవడానికి భారతదేశం నుండి అనేక చిత్రాలు పోటీపడ్డాయి. ఏ సినిమా ఆస్కార్ పోటీలో పాల్గొనడానికి వెళుతుందా? అన్న ఉత్కంఠ తీరింది. మరాఠీ చిత్రం ‘న్యూటన్’ ఎంపికైన సంగతి తెలిసిందే. అయితే ఈ పోటీలో తెలుగు చిత్రాలు బాహుబలి, గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రాలు ఉన్నాయి. కానీ ఈ రెండూ ఎంపిక కాకపోవడం తెలుగువారికి ఇబ్బందికరమే. అయితే ఈ విషయమై బాహుబలి దర్శకుడు రాజవౌళి స్పందించారు.

09/27/2017 - 16:07

ప్రస్తుతం ‘రంగస్థలం 1985’ చిత్రంలో నటిస్తున్న రామ్‌చరణ్ తదుపరి చిత్రానికి ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఇప్పటికే రంగస్థలం 60 శాతం పైగా షూటింగ్ పూర్తయింది. వచ్చే సంక్రాంతికి విడుదలకానున్న ఈ సినిమా తరువాత చరణ్ రాజవౌళి దర్శకత్వంలో నటిస్తాడని వార్తలొస్తున్నాయి. ఇప్పటికే రాజవౌళితో చర్చలు జరిపాడని టాక్. ‘బాహుబలి’ తరువాత రాజవౌళి తదుపరి సినిమా ఎవరితో అన్న ఆసక్తికి బ్రేక్‌పడింది.

09/27/2017 - 16:05

ఎప్పటికప్పుడు వైవిధ్యమైన చిత్రాలను రూపొందించే విజయ్ ఆంటోనీ తాజాగా నటిస్తున్న చిత్రం ఇంద్రసేన. రాధిక శరత్‌కుమార్, ఫాతిమా విజయ్ ఆంటోనీ సంయుక్తంగా రూపొందిస్తున్న ఈ చిత్రానికి జి.శ్రీనివాసన్ దర్శకుడు. కమర్షియల్ హీరోగా బిచ్చగాడు, భేతాళుడు, యెమన్ చిత్రాలతో హిట్ బాటపట్టిన విజయ్ ఆంటోనీ తాజాగా నటిస్తున్న ఇంద్రసేన చిత్రంపై భారీ అంచనాలు వున్నాయి.

09/27/2017 - 16:03

ఇటీవలే విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన అర్జున్‌రెడ్డి చిత్రం సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ముఖ్యంగా యూత్‌ని బాగా ఆకట్టుకున్న ఈ సినిమా అటు బాక్సాఫీస్ వద్ద కూడా భారీ విజయాన్ని అందుకుంది. మరోవైపు సినిమా రీమేక్ హక్కుల విషయంలో సంచలనం రేపింది. తమిళ రీమేక్ హక్కులకోసం గట్టి పోటీ ఏర్పడగా, హీరో ధనుష్ భారీ మొత్తానికి స్వంతం చేసుకున్నారు. అయితే ఈ రీమేక్‌లో ఆయనే నటిస్తాడని అనుకున్నారు.

09/27/2017 - 16:02

ఫైట్ మాస్టర్ విజయ్ తనయుడు రాహుల్ విజయ్ సరసన ముంబై భామ కావ్య థాపర్ కథానాయికగా నటిస్తోంది. తొలిసారిగా కథానాయకుడిగా రాహుల్ విజయ్‌ని వి.ఎస్.క్రియేటివ్ వర్క్స్ పతాకంపై రాము కొప్పుల దర్శకత్వంలో దివ్య విజయ్ పరిచయం చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది.

09/27/2017 - 15:58

సినిమా పరిశ్రమ అంటేనే లైంగిక వేధింపులు లాంటి విపరీత అర్థాలు తాను విన్నానని, అలాంటివి ఎదురైతే సర్దుకుపోవాలని చాలామంది సలహా ఇచ్చినా, దేవుడిదయవల్ల అలాంటివేవీ తనకెదురుకాలేదు అంటోంది బాలీవుడ్ పొడుగుకాళ్ల సుందరి కృతిసనన్. తాజాగా ఆమె నటించిన బాలీవుడ్ చిత్రం ‘బరేలీకి బర్ఫీ’ హిట్ అయింది. ఈ చిత్రంలో కృతిసనన్ మాధురీదీక్షిత్ అభిమానిగా నటించింది.

09/27/2017 - 15:56

క్రిష్ సిరీస్‌లో భాగంగా బాలీవుడ్ కథానాయకుడు హృతిక్‌రోషన్ క్రిష్-4 చిత్రానికి సన్నాహాలు చేస్తున్నాడు. ఈ చిత్రంలో హృతిక్‌రోషన్ హీరోగా నటిస్తాడన్న సంగ తి అందరికీ అర్థమయ్యింది. కానీ విలన్‌గా కూడా నటిస్తున్నాడన్న సంగతే ఇప్పుడు కొత్తగా వినిపిస్తోంది. హీరోనే విలన్‌గా కూడా నటిస్తే ఆయా చిత్రాలకు వస్తున్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని హృతిక్ ఈ నిర్ణ యం తీసుకున్నాడట.

09/27/2017 - 15:54

శివ్ తాండల్, నేహా దేశ్‌పాండే, అజయ్‌ఘోష్ ప్రధాన పాత్రల్లో సాయి సునీల్ నిమ్మల దర్శకత్వంలో నిర్మాని ఫిలిమ్స్ పతాకంపై మణిలాల్ మచ్చి అండ్ సన్స్ నిర్మిస్తున్న చిత్రం ‘వాడేనా’. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్, పోస్ట్‌ర్‌ను విడుదల చేశారు. ఈ విడుదల కార్యక్రమం తెలంగాణ ఫిల్మ్ చాంబర్ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణగౌడ్, రాజ్ కందుకూరి, మల్కాపురం శివకుమార్, సురేష్ కొండేటి, శివ చేతుల మీదుగా జరిగింది.

09/27/2017 - 15:52

నేనే పెద్ద పుడింగి బాబానంటూ అటు పంజాబ్.. ఇటు హర్యానా ప్రజలను నమ్మించి మోసం చేసిన దొంగ బాబా గుర్మీత్‌సింగ్‌ని పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత ఆయనకు సంబంధించిన దారుణాలు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. తాజాగా ఆయన జీవితంపై సినిమాకు సిద్ధం అవుతుంది బాలీవుడ్ సంచలన తార రాఖీ సావంత్. అయితే ఈమె నటిస్తున్నది ఎవరి పాత్రలో తెలుసా..

09/27/2017 - 15:50

బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా కథానాయికగా ఓ చిత్రం రూపొందనుంది. ప్రముఖ దర్శకుడు ఎ.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కే ఈ చిత్రాన్ని ఓ అగ్ర నిర్మాత రూపొందించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ‘పిల్లా నువ్వులేని జీవితం’ వంటి హిట్ సినిమా తర్వాత రవికుమార్ చౌదరి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రమిది. హాలీవుడ్‌లో విజయవంతమైన ఒ చిత్రానికి ఇది రీమేక్.

Pages