S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

09/22/2017 - 19:56

మురళి, శ్రీముఖి జంటగా హర్షవర్థన్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘గుడ్ అండ్ అగ్లీ’. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను సినిమా యూనిట్ విడుదల చేశారు. హర్షవర్థన్ మాట్లాడుతూ- దర్శకుడిగా తాను తొలి చిత్రంగా ఈ సినిమా అందిస్తున్నామని, మంచి కానె్సప్టుతో రూపొందే ఈ సినిమాకు సంబంధించిన నిర్మాణానంతర కార్యక్రమాలు ముగింపు దశలో ఉన్నాయని తెలిపారు.

09/22/2017 - 19:54

తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్‌లో అన్ని భాషల చిథ్రాలకు వీలుగా జాతీయ స్థాయి హబ్ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ రామ్మోనరావు తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి మండలానికి థియేటర్ వుండేలా చర్యలు తీసుకుంటామన్నారు.

09/21/2017 - 19:52

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించే 151వ చిత్రంగా ‘సైరా నరసింహారెడ్డి’ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితకథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఇటీవలే పూజా కార్యక్రమాలు జరుపుకున్నాయి. సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో రామ్‌చరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ అక్టోబర్ 20 నుండి మొదలుకానున్నదట.

09/21/2017 - 19:50

‘బాహుబలి’ తరువాత ప్రభాస్ రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. ప్రస్తుతం ఆయనతో సినిమాలు చేయడానికి దర్శక నిర్మాతలు క్యూ కడుతున్నారు. ముఖ్యంగా హిందీలో కూడా ప్రభాస్‌కు చాలా ఆఫర్లు వస్తున్నాయట. ప్రస్తుతం రూ.150 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ‘సాహో’లో నటిస్తున్నాడు ప్రభాస్. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఇటీవలే హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంది.

09/21/2017 - 19:49

ప్రయోగాల హీరోగా కోలీవుడ్‌లో ఇమేజ్ తెచ్చుకున్న చియాన్ విక్రమ్‌కు ఐ సినిమా తరువాత సరైన విజయం దక్కలేదు. భారీ అంచనాలమధ్య విడుదలైన ‘ఐ’ చిత్రం భారీ పరాజయాన్ని అందుకుంది. ఆ తరువాత ఎన్ని సినిమాలు చేసినా పరిస్థితి మారలేదు. తాజాగా ఓ భిన్నమైన కథతో స్కెచ్ వేశాడు విక్రమ్. ఈ చిత్రానికి టైటిల్ కూడా ‘స్కెచ్’. తమిళ, తెలుగు భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్నాడు.

09/21/2017 - 19:47

విజయ్ ఆంటోని కథానాయకుడిగా ఆర్ స్టూడియోస్, విజయ్ ఆంటోని ఫిలిం కార్పొరేషన్ పతాకంపై రాధికా శరత్‌కుమార్, ఫాతిమా విజయ్ ఆంటోని సంయుక్తంగా రూపొందిస్తున్న చిత్రం ‘ఇంద్రసేన’. జి.శ్రీనివాసన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.

09/21/2017 - 19:45

శర్వానంద్, మెహరీన్ జంటగా మారుతి దర్శకత్వంలో యు.వి. క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్‌లు నిర్మిస్తున్న చిత్రం ‘మహానుభావుడు’. ఈ నెల 29న విడుదలవుతున్న సందర్భంగా హైదరాబాద్‌లో ట్రైలర్స్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు మారుతి మాట్లాడుతూ- ఈ చిత్రాన్ని ముందే విడుదల చేయాలనుకున్నాం. కానీ దసరా పండుగ అయితే ఇలాంటి సినిమాలకు బావుంటుందని ఈనెల 29న విడుదల చేస్తున్నాం.

09/21/2017 - 19:43

ఆలీ రజా, మధుమిత కృష్ణ జంటగా గిరిధర్ దర్శకత్వంలో భరద్వాజ్ సినీ క్రియేషన్స్ పతాకంపై ఎం.సుబ్బలక్ష్మి నిర్మిస్తున్న చిత్రం ‘నా రూటే సపరేటు’. చిత్రీకరణ పూర్తయి త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న సందర్భంగా గురువారం హైదరాబాద్‌లో ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో దర్శకుడు గిరిధర్ మాట్లాడుతూ- ఈజీ మనీ నేపథ్యంలో సాగే చిత్రమిది. నేటితరం యువతీ యువకులు ఈజీ మనీ కోసం ఎలాంటి ఇబ్బందుల్ని కొనితెచ్చుకుంటున్నారు?

09/21/2017 - 19:41

టాలీవుడ్‌లో హాట్ గర్ల్‌గా ఇమేజ్ తెచ్చుకున్న షెర్లీన్ చోప్రా ఇక్కడ అవకాశాలు తగ్గడంతో బాలీవుడ్‌కు చెక్కేసింది. మొదటి సినిమాతోనే సంచలనం రేపాలని ‘కామసూత్ర’ చిత్రానికి ఓకె చెప్పింది. ఆ సినిమా కోసం ఒళ్లు దాచుకోకుండా అందాలు ఆరబోసిన ఆమె ఆశలు అడియాశలయ్యాయి. ఆ సినిమా పూర్తయినా బోల్డ్ కంటెంట్ ఉందని సెన్సారు వారు అభ్యంతరం తెలపడంతో విడుదలకు నోచుకోలేదు.

09/21/2017 - 19:40

తాజాగా సౌత్ భామ అమలాపాల్‌కు సంబంధించిన ఓ వీడియో ఒకటి సంచలనం రేపుతోంది. ఇందులో అమలాపాల్ గుప్పుగుప్పుమంటూ పొగ తాగే సన్నివేశమది. దర్శకుడు విజయ్‌తో విడిపోయిన తరువాత అమలాపాల్ సినిమాలపై ఎక్కువ దృష్టిపెట్టింది. ముఖ్యంగా భిన్నమైన సినిమాల్లో నటించేందుకు ఆసక్తి చూపిస్తున్న ఈమె, తాజాగా ఓ తమిళ సినిమాలోని సన్నివేశం కోసం నిజంగానే సిగరెట్ తాగిందట. సన్నివేశం బాగా రావడానికి అలా చేశానని చెబుతోంది.

Pages