S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం

02/12/2017 - 04:26

గతంతో పోల్చుకుంటే వర్తమానంలో నవల, కథల పఠనం కొంతమేర తగ్గింది. ఈ పరిణాం వల్ల ఔత్సాహిక రచయితలు, చేయి తిరిగిన రచయితలపై మరింత భారం లేదా బాధ్యత పడిందనే చెప్పాలి. కొంతమంది తమ రచన పేరొందిన పత్రికల్లో అచ్చయ్యాక పుస్తక రూపంలో తీసుకొస్తున్నారు. ఇంకొందరు ఉత్సాహంతో పుస్తకంగా మార్కెట్‌లోకి వదులుతున్నారు. తీరికలేని పాఠకుడు ఈ రెండో రకం నవల్లోకి వెళ్ళేముందు ఏదైనా పత్రికల్లో పడిందా లేదా అని పరిశీలిస్తాడు.

01/29/2017 - 00:26

‘‘ముహూర్తానికి టైం అవుతోంది సుజీ’’ తయారవడం పూర్తి అవగానే భార్యికి వినిపించేలా అన్నాను గట్టిగా.
నిజానికి అప్పటికే అనుకున్న సమయం కంటే కాస్త ఆలస్యం అయిందనే చెప్పాలి.
నేను అలా అన్న వెంటనే నా భార్య సుజీ నుండి వెంటనే సమాధానం రాలేదు. దానికి కారణం నాకు తెలుసు.
ఆడవాళ్ల ముస్తాబు అంత త్వరగా తెమలదు కదా.
అందుకే మళ్లీ రెట్టించలేదు నేను ఆమెకి కోపం వస్తుందని.

01/29/2017 - 00:22

ప్రపంచం నా అరచేతిలో
నేను స్మార్ట్ఫోన్ గుప్పిట్లో

ఫేస్ టు ఫేస్ అయితే నో లుక్స్
ఫేస్‌బుక్‌లో పోస్టింగ్ అబ్బో చాలా లైక్స్

నా టైం బాలేదు అన్నాడు మొహంలో దైన్యం
ఇంకా చాలా టైం ఉంది అన్నాను కన్పించింది ధైర్యం

ప్రజాస్వామ్యానికి బలం ఓటు
కానీ నోటు దానికి పొడిచింది వెన్నుపోటు

01/29/2017 - 00:19

కుటుంబ సభ్యుల మధ్య అనుబంధాలను, ఆప్యాయతలను గుర్తు చేస్తాయి ఆమె కవితలు. సమాజ పోకడలు, అందులోని అసమానతల గురించి ఆ కవితలు సందేశమిస్తాయి. హెచ్చరిస్తాయి కూడా. ప్రస్తుతం మనుషుల తిరోగమన స్థితిపై ఆ కవితలు కొన్నిచోట్ల ఆక్రోశిస్తాయి. సిరి లాభాల కలం నుండి జాలువారిన ‘సిరివెనె్నల స్వరం’ కవితా సంపుటిలోని కవితలు నేటి సమాజానికి అద్దం పడతాయి.

01/22/2017 - 03:48

వెంకటరాఘవరావు నిరుపేద కుటుంబం నుండి వచ్చాడు. తండ్రి ఫుట్‌పాత్ మీద రెడీమేడ్ బట్టల వ్యాపారం చేస్తుండేవాడు. రాఘవరావుకి ఆరుగురు అన్నయ్యలు, ముగ్గురు అక్కలు. అంత పెద్ద కుటుంబాన్ని పోషించలేక భార్యని కూడా కూలికి పంపేవాడు రాఘవరావు తండ్రి. చదువుకునే స్థోమత లేక రాఘవరావు అన్నయ్యలు, అక్కలు బాలకార్మికులుగా పనులు చేస్తుండేవారు. రాఘవరావుని డిగ్రీ చదివించారు. అల్లారుముద్దుగా పెంచి పెద్ద చేశారు.

01/22/2017 - 03:45

జనవరి ఒకటి
గోడతల్లి ప్రసవించింది
కొత్త కేలెండర్ పిల్లని
సంక్రాంతి నెల
పొలానికి వీడ్కోలు చెప్పేయి
చెరుకు తోటలు
కొత్త సంవత్సరారంభం
ఇళ్ల ముంగిళ్ల ముఖాలు
వెలుగుతున్నాయి తెల్లగా
స్నానం చేసిన వాకిలి
మెడలో ధరించింది
ముత్యాల హారం
సూర్యుడు
ఇరేజ్ చేశాడు మంచుని
బయట పడింది కొండ

01/22/2017 - 03:42

కవిత్వం రాయడానికి వయసుతో సంబంధం లేదు. ఈ సృజనాత్మకత సహజంగా రావాలి. రాటుదేలిన ఊహాశక్తి అక్షరాలలో ప్రతిబింబించాలి. ఇలా రూపుదిద్దుకున్నదే వర్తమాన కవిత్వం. వచనంలో వ్యక్తీకరించడానికి తగినంత అనుభవసారాన్ని ఆకళింపు చేసుకోవాలి. ఈ ప్రయత్నం ఎవరైనా చెయ్యొచ్చును. కానీ బాల్యపు ఛాయలు వదలక ముందే కలాన్ని పట్టుకుని దృశ్యాల్ని చిత్రీకరిస్తుంటే ఆ నేర్పరితనమే వేరు.

12/31/2016 - 23:28

కాంతారావు స్టేట్‌బ్యాంక్‌లో ఉద్యోగం చేసి పదవీ విరమణ చేసాక కొడుకు దగ్గర అమెరికాలో ఆరు నెలలు, కూతురు దగ్గర ఢిల్లీలో రెండు నెలలు వుండి విశాఖపట్నంలో గూటికి చేరాడు. అదేమి దురదృష్టమో పిల్లల పెళ్లిళ్ల వరకు ఆరోగ్యంగా వున్న భార్య సుగుణ ఆరేళ్ళ క్రితం కేన్సరు వచ్చి మరణించింది. సుగుణ కోరికపై అన్ని హంగులతో పదేళ్లక్రితం చక్కని బంగళా విశాఖపట్నంలో నిర్మించుకున్నారు.

12/25/2016 - 08:40

అమ్మ ఓ రోజు అడిగింది ‘‘ఉద్యోగం ఉందికదమ్మా మీ నాన్నగారు ఓ సంబంధం చూసారు. నువ్వు ఉ అంటే ఆ పెళ్లి చేసేస్తే కొంత బాధ్యత తగ్గుతుందని ఆయన ఉద్దేశ్యం’’

12/20/2016 - 22:49

‘‘ఆదిత్య సార్ మీ కోసం ఎవరో సినియా యాక్టర్‌లాంటి లేడీస్ వచ్చారు’’ అన్నాడు ఫ్యూన్ రాజన్న.
ఉదయం నుండి ఫైల్స్‌లో తలమునకలై ఉన్న ఆదిత్యకు సినిమా యాక్టర్‌లాంటి లేడీస్ అని వినిపించేసరికి చూస్తున్న ఫైల్ మూసి ‘‘నాకోసమా’’ అన్నాడు ఆశ్చర్యంగా.
‘‘అవును సార్ మీ కోసమే. మీ పేరు చెప్పి అడిగారు’’
‘‘ ఎక్కడ ఉన్నారు?’’
‘‘వెయిటింగ్ హాల్లో కూర్చోబెట్టాను’’

Pages