S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

07/05/2018 - 16:26

ముజిఫర్‌నగర్: ఉత్తరప్రదేశ్‌లోని ముజిఫర్‌నగర్‌లో 12 ఏళ్ల దళిత బాలికపై అదే ప్రాంతానికి చెందిన ఆరుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మూడు రోజులుగా ఆమెపై అత్యాచారం చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. వీరిలో ఐదుగురు వయసు 14 నుంచి 16 ఏళ్లు మాత్రమే అని వెల్లడించారు.

07/05/2018 - 16:26

ముంబయి. భారీవర్షాల కారణంగా ముంబయిలో జనజీవనం స్తంభించిపోయింది. రాయ్‌గడ్‌లోని మహద్ ప్రాంతంలో ముంబయి-గోవా హైవేపై కొండచరియలు విరిగిపడటంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దాదాపు 7 నుంచి 8 కిలోమీటర్ల మేరకు వాహనాలు నిలిచిపోయాయి.

07/05/2018 - 16:25

బెంగళూరు: కర్నాటక ముఖ్యమంత్రి కుమారస్వామి తన వాగ్ధానాన్ని నిలబెట్టుకున్నారు. ఈరోజు విధానసభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆయన రైతుల రుణాలను మాఫీ చేస్తున్నట్లు ప్రకటించారు. రెండు లక్షల రూపాయల లోపు రుణాలు మాఫీ చేస్తున్నట్లు కుమారస్వామి వెల్లడించారు. రాష్టవ్య్రాప్తంగా 34వేల కోట్ల రుణాలను మాఫీ చేస్తున్నట్లు తెలిపారు. రుణాలను సక్రమంగా చెల్లించిన రైతుల బ్యాంకుల్లో 25వేల రూపాయలు జమచేస్తామని తెలిపారు.

07/05/2018 - 16:23

మేసాయి: థాయ్‌లాండ్‌లోని ప్రఖ్యాత థాయ్ లుయాంగ్ గుహలో చిక్కుకుపోయిన పిల్లల్ని విడతలవారీగా తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ గుహలో 12మంది పిల్లలు, గజ ఈతగాళ్లు, కోచ్ ఉన్న సంగతి తెలిసిందే. గుహలో బురద, నీరు పేరుకుపోయి ఉన్నందున వారిని ఒకేసారి తీసుకురావటం కుదరదు అని అధికారులు వెల్లడించారు.

07/05/2018 - 12:59

న్యూఢిల్లీ: ఆప్ ప్రభుత్వానికి మళ్లీ కష్టాలు ఆరంభమయ్యాయి. ఢిల్లీలో ప్రజలెన్నుకున్న ప్రభుత్వానికి అత్యధిక అధికారాలు ఉంటాయని నిన్న అత్యున్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. తీర్పు వెలువడిన కొన్ని గంటల్లోనే ఆప్ ప్రభుత్వం ఉద్యోగుల బదిలీలపై అధికారాన్ని తన చేతుల్లోకి తీసుకుంది. అయితే దీనిని సర్వీసు విభాగం తిరస్కరించటంతో ఆప్ సర్కార్‌కు మళ్లీ ఆటంకాలు ఆరంభమయ్యాయి.

07/05/2018 - 12:55

శ్రీనగర్: ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు అమరనాథ్ యాత్ర ముందుకు సాగటం లేదు. కొన్ని ప్రాంతాల్లో కొండ చరియలు విరిగిపడుతుండటంతో యాత్రీకులు బేస్‌క్యాంపుల్లోనే ఉండిపోయారు. సోనామార్గంలో కొండ చరియలు విరిగిపడటంతో ముగ్గురు చనిపోయారు. మరో అయిదుగురు గాయపడ్డారు. పెహల్‌గాం, బలాతల్ ప్రాంతాల్లో యాత్ర పూర్తిగా నిలిచిపోయింది.

07/05/2018 - 12:54

న్యూఢిల్లీ: నునంద పుష్కర హత్యకేసులో ఆమె భర్త శశిథరూర్‌కు కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ దొరికితే ఆయన దేశం విడిచి పెట్టి పోతారని పోలీసులు చేసిన వాదనతో కోర్టు ఏకభవించలేదు. లక్షరూపాయల పూచీకత్తు, దేశం విడిచిపోరాదనే షరతులతో పాటియాల కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

07/05/2018 - 05:13

న్యూ ఢిల్లీ, జూలై 4: ఢిల్లీ ప్రభుత్వానికి, లెఫ్టినెంట్ గవర్నర్‌కు మధ్య అధికారాల అమలుకు సంబంధించిన సంఘర్షణపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ప్రజా విజయానికి నాంది పలుకుతుందని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఢిల్లీ ప్రజలకు, ప్రజాస్వామ్యం గెలిచారని ఆయన అన్నారు.

07/05/2018 - 04:48

న్యూఢిల్లీ, జూలై 4: అధికారానికి సంబంధించి ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వం, లెఫ్టినెంట్ గవర్నర్ మధ్య తలెత్తిన వివాదంపై సుప్రీం కోర్టు బుధవారం సంచలన తీర్పును వెలువరించింది. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలోని ప్రభుత్వానికి ధర్మాసనం తీర్పు బలాన్ని ఇచ్చింది. అధికారం కోసం మూడేళ్లుగా ఆప్ ప్రభుత్వం, లెఫ్టినెంట్ గవర్నర్ మధ్య వివాదం నడుస్తోన్న సంగతి తెలిసిందే.

07/05/2018 - 04:46

ముంబయి, జూలై 4: ముంబయిలోని అంధేరి ప్రాంతంలో రైల్వేస్టేషన్‌లో ఫుట్‌ఓవర్ బ్రిడ్జి కూలిపోయిన సంఘటన మరువకముందే సౌత్‌ముంబయిలోని గ్రాంట్ రోడ్ రైల్వేస్టేషన్‌లోని బ్రిడ్జికి ఏర్పడిన పగుళ్లను అధికారులు గుర్తించారు. దీంతో ఈ బ్రిడ్జిపై రాకపోకలను నిలిపివేసి ట్రాఫిక్‌ను మళ్లించినట్టు అధికారులు తెలిపారు.

Pages