S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

02/09/2018 - 01:51

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 8: ప్రపంచ వింతల్లో ఒకటైన చారిత్రక కట్టడం తాజ్‌మహల్ పరిరక్షణకు ఏం చర్యలు తీసుకున్నదీ సమగ్ర నివేది ఇవ్వాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది. తాజ్ ట్రెపిజియం జోన్(టీజెడ్)పేరుతో ప్రభుత్వం తీసుకున్న హడావుడి నిర్ణయాలను జస్టిస్ మదన్ బీ లోకూర్, జస్టిస్ దీపక్ గుప్తాతో కూడిన ధర్మాసనం ప్రశ్నించింది.

02/09/2018 - 01:50

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 8: తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో డిఫెన్స్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ కారిడార్‌ను ఏర్పాటు చేయాలని కేంద్ర రక్షణ మంత్రి నిర్మాలా సీతారామన్‌కు ఐటీ మంత్రి కేటీ రామారావువిజ్ఞప్తి చేశారు. గురువారం నాడు తెలంగాణ పంచాయతిరాజ్, ఐటి శాఖ మంత్రి కేటీఆర్ కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, నరేంద్రసింగ్ తోమర్, హర్షవర్ధన్, ధర్మేంద్ర ప్రధాన్‌లతో సమావేశమయ్యారు.

02/09/2018 - 01:49

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 8: డొల్ల ప్రకటనలతో ప్రజలను మోసం చేయలేరంటూ తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నాయకుడు, కేంద్ర సైన్స్, టెక్నాలజీ మంత్రి సుజనా చౌదరి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో వాదనకు దిగారు. పార్లమెంటు ఆవరణలోని తెలుగదేశం పార్లమెంటరీ పార్టీ కార్యాలయం వద్ద ఇరువురు మంత్రుల మధ్య ఈ వాగ్వివాదం చోటు చేసుకుంది.

02/09/2018 - 01:43

సోనామురా (త్రిపుర), ఫిబ్రవరి 8: రానున్న ఎన్నికల్లో అభివృద్ధికి దోహదం చేసే బీజేపీకే పట్టం కట్టాలని త్రిపుర ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. మాణిక్ సర్కార్ సారథ్యంలోని వామపక్ష ప్రభుత్వాన్ని సాగనంపాలని, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించే దిశగా ఓటర్లు తమ నిర్ణయం తీసుకోవాలని గురువారం నాడిక్కడి రంగామాటియా మదర్సా మైదానంలో జరిగిన భారీ ర్యాలీలో మోదీ అన్నారు.

02/09/2018 - 01:40

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 8: ఆంధ్రప్రదేశ్ విభజన హామీలను అమలు చేయాలంటూ రాష్ట్రానికి చెందిన ఎంపీలు పార్లమెంట్ లోపలా, బయటా వరుసగా మూడోరోజూ ఆందోళన చేపట్టారు. గురువారం టీడీపీ, వైఎస్‌ఆర్‌సీపీ, కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఉభయ సభల్లో తమ పోరాటాన్ని ఉధృతం చేశారు.

02/09/2018 - 01:39

ఫరీదాబాద్‌లోని సూరజ్‌కుండ్‌లో నిర్వహిస్తున్న 32వ అంతర్జాతీయ ఆర్ట్ అండ్ క్రాప్ట్స్ మేళాలో సరదాగా సెల్ఫీలు దిగుతున్న రాధాకృష్ణుల, రావణ వేషధారణ కళాకారులు

02/09/2018 - 01:37

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 8: ఏపీ విభజన సమస్యల పరిష్కారంపై ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గురువారం లోక్‌సభలో చేసిన ప్రకటన తెలుగుదేశం, వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీలను సంతృప్తి పరచలేదు. జైట్లీ మరోసారి తమను మోసం చేశారంటూ రెండు పార్టీల ఎంపీలు లోక్‌సభలో నిరసన వ్రతాన్ని కొనసాగించారు. స్పీకర్ సభను వాయిదా వేయటంతో వారు శుక్రవారం కూడా పార్లమెంటు ఉభయసభల్లో నిరసన వ్రతం కొనసాగించవచ్చు.

02/09/2018 - 01:35

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 8: ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్‌డీయే ప్రభుత్వంతో విభేదిస్తున్న తెలుగుదేశం పార్టీకి చెందిన కేంద్ర మంత్రి సుజనా చౌదరి మంత్రివర్గం నుండి రాజీనామా చేయాలని వైఎస్‌ఆర్‌సీపీ నాయకుడు విజయసాయి రెడ్డి డిమాండ్ చేశారు. ఎన్‌డీయేలో భాగస్వామిగా కొనసాగుతూనే ప్రభుత్వంతో ఎలా విభేదిస్తారని ఆయన నిలదీశారు.

02/09/2018 - 01:14

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 8: అద్దెగర్భం (సరోగసీ) ద్వారా పిల్లలు కలిగిన కేంద్రప్రభుత్వ ఉద్యోగినులకు కూడా సాధారణ గర్భిణుల మాదిరిగా ప్రసూతి సెలవు వర్తిస్తుందని సంబంధిత మంత్రిత్వశాఖ అధికారిక ఉత్తర్వులో పేర్కొంది. వేతనంతో కూడిన 26 వారాల (180 రోజుల) సెలవును వారు పొందవచ్చునని ఆ ఉత్తర్వులో స్పష్టం చేశారు. 2015లో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు కేంద్రప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

02/09/2018 - 01:00

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 8: కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మొత్తం పార్టీ శ్రేణులకే కాకుండా తనకు కూడా బాసేనని సోనియా గాంధీ స్పష్టం చేశారు. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవాన్ని తీసుకువచ్చే ప్రయత్నాలు మొదలయ్యాయని, ఇందుకోసం భావ సారూప్యత కలిగిన అన్ని పార్టీలతోనూ పనిచేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని సోనియా తెలిపారు.

Pages