S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

08/13/2017 - 02:17

గోరఖ్‌పూర్, ఆగస్టు 12: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ 20ఏళ్ల పాటు పార్లమెంటులో ప్రాతినిధ్యం వహించిన గోరఖ్‌పూర్ నియోజకవర్గంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో గురువారం, శుక్రవారం మధ్య 30 మంది చిన్నారులు మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ చిన్నారుల మరణాలకు ఆస్పత్రిలో లిక్విడ్ ఆక్సిజన్ కొరతే ప్రధాన కారణమన్న ఆరోపణలు కూడా ఉన్నాయి.

08/13/2017 - 02:09

కోయంబత్తూరు, ఆగస్టు 12: అధికార అన్నాడిఎంకెలోని రెండు వర్గాలు- ముఖ్యమంత్రి పళనిస్వామి, మాజీ ముఖ్యమంత్రి పనె్నర్ సెల్వం వర్గాలు- త్వరలో విలీనమవుతాయన్న విశ్వాసాన్ని తమిళనాడుకు చెందిన ఇద్దరు మంత్రులు వ్యక్తం చేశారు. అంతేకాదు, అయిదేళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేస్తుందన్న నమ్మకాన్ని సైతం వ్యక్తం చేశారు.

08/13/2017 - 01:36

జమ్ము, ఆగస్టు 12: జమ్ము కాశ్మీర్‌లోని పూంఛ్ సెక్టార్‌లో వాస్తవాధీన రేఖ వెంట పాకిస్తాన్ రెండుసార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. ఉదయం గొహ్లాద్ కల్రాన్ గ్రామంలో పాకిస్తాన్ జరిపిన కాల్పుల్లో నలభై ఏళ్ల మహిళ చనిపోయింది. సాయంత్రం 5గంటలకు మరోసారి జరిపిన కాల్పుల్లో నరుూబ్ సుబేదార్ జగ్రమ్ సింగ్ తోమర్(42) మరణించారని ఆర్మీ తెలిపింది.

08/13/2017 - 01:07

న్యూఢిల్లీ, ఆగస్టు 12: ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీఏతో చేతులు కలిపిన బిహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ మరో అడుగు ముందుకు వేసి శరద్ యాదవ్‌ను రాజ్యసభలో జెడి (యు) పక్ష నేత పదవి నుండి తొలగించారు. జెడి (యు) పార్లమెంటు సభ్యులు శనివారం రాజ్యసభ అధ్యక్షుడు, ఉపరాష్టప్రతి ఎం.వెంకయ్యనాయుడును కలిసి ఈమేరకు ఒక లేఖను అందజేశారు.

08/13/2017 - 01:05

న్యూఢిల్లీ, ఆగస్టు 12: జమ్ముకాశ్మీర్‌లో హింసాకాండను ఎదుర్కొవటానికి భారత సైన్యంలోకి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన రోబోలను ప్రవేశపెట్టాలని రక్షణ శాఖ నిర్ణయించింది. ఉగ్రవాదులతో సమర్థంగా పోరాడటానికి 544 రోబోలను ప్రవేశపెట్టాలన్న ప్రతిపాదనకు ఇటీవలే ఆమోదం లభించింది. ‘మేక్’ కేటగిరీ కింది 2016లోనే దీనికి సంబంధించిన ప్రక్రియను ప్రారంభించారు. ‘జమ్ము కాశ్మీర్‌లో ఎదురవుతున్న పరిస్థితి సాధారణమైంది కాదు.

08/13/2017 - 01:03

లక్నో, ఆగస్టు 12: గోరఖ్‌పూర్‌లో ప్రభుత్వ అధ్వర్యంలోని బాబా రాఘవ్ దాస్ మెడికల్ కాలేజి ఆస్పత్రిలో పెద్ద సంఖ్యలో చిన్నారులు మృతి చెందిన సంఘటనపై స్పందించిన ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. ఈ ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక 48 గంటల వ్యవదిలో 30 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.

08/12/2017 - 02:15

ఆగస్టు 15 వస్తోందంటే దేశవ్యాప్తంగా దేశ భక్తి పురివిప్పుతుంది. వందనం జెండావందనం అంటూ తిరంగాల సౌరభం పులకింప జేస్తుంది. భారతదేశ చిత్రపటాన్ని పోలిన ఠీతిలో విద్యార్థులు వినమ్రంగా నిలబడితే మరోపక్క జెండాల రూపకల్పనలో దర్జీల తలమునకలు

08/12/2017 - 02:12

న్యూఢిల్లీ, ఆగస్టు 11: భారతదేశంలో నేరాల రేటు దిగ్భ్రాంతికరంగా ఉందని, బాలికలు, మహిళలపై అత్యాచారాలు, కిడ్నాప్‌లు బెంబేలెత్తిస్తున్నాయని ఆర్థిక సర్వే శుక్రవారం స్పష్టం చేసింది. దేశ జనాభాలో 50 శాతం వరకు ఉన్న మహిళల సాధికారికతకు అనేక అవరోధాలు ఉన్నాయని కూడా పార్లమెంటులో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ నివేదిక స్పష్టం చేసింది.

08/12/2017 - 02:10

న్యూఢిల్లీ, ఆగస్టు 11: బిజెపితో విలీనానికి సం బంధించిన వ్యవహారంలో తలెత్తిన పరిణామాలపై బిహార్ ముఖ్యమంత్రి, జెడియు అధినేత నితీష్‌కుమార్ మరింతగా తన పట్టు బిగించారు. తిరుగుబాటు నాయకుడు శరద్ యాదవ్‌తో రాజీపడే ప్రసక్తి లేదని, ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తమకు అభ్యంతరం లేదని స్పష్టం చేశారు.

08/12/2017 - 02:08

చెన్నై, ఆగస్టు 11: అన్నా డిఎంకె (అమ్మ) పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి టిటివి దినకరన్‌పై ముఖ్యమంత్రి పళనిస్వామి నేతృత్వంలోని వర్గం తిరుగుబాటు చేసిన నేపథ్యంలో అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడతామని ప్రధాన ప్రతిపక్షమైన డిఎంకె శుక్రవారం పేర్కొంది.

Pages