S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

08/15/2017 - 03:07

పాట్నా, ఆగస్టు 14: బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ అసమ్మతి వర్గంపై వేటు వేశారు. సీనియర్ నేత శరద్‌యాదవ్ అనుచరులుగా భావిస్తున్న 21 మంది నాయకులను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నితీశ్ నిర్ణయం తీసుకున్నారు.

08/15/2017 - 03:06

న్యూఢిల్లీ, ఆగస్టు 14: కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి పి చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరానికి సోమవారం సుప్రీం కోర్టు గట్టిషాక్ ఇచ్చింది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కార్తీ సిబిఐ విచారణకు గైర్హాజరవుతూ వచ్చారు. దీంతో ఆయనపై లుక్‌అవుట్ నోటీసు జారీ చేయగా మద్రాస్ హైకోర్టు స్టే ఇచ్చింది. తాజాగా సుప్రీం కోర్టు ఆదేశాలతో హైకోర్టు స్టే రద్దయింది.

08/15/2017 - 03:04

సిమ్లా, ఆగస్టు 14: కొండచరియలు విరిగిపడి రెండు బస్సుల్లో దాదాపు 50మంది ప్రయాణికులు మృతిచెందిన హిమాచల్ ప్రదేశ్‌లోని మండి-పఠాన్‌కోట్ రహదారిని ప్రమాదకరమైన దారిగా ప్రభుత్వం ప్రకటించింది. ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలంతా సురక్షిత ప్రాంతాలను వెతుక్కోవాలని సూచించింది. బండరాళ్ల మధ్య బస్సులు చిక్కుకుపోయిన ప్రాంతంలో సహాయ చర్యలు ముమ్మరంగా జరుగుతున్నాయి.

08/15/2017 - 03:03

శ్రీనగర్, ఆగస్టు 14: జమ్మూ, కాశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలో ఆదివారం భద్రతా దళాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన హిజ్బుల్ ముజాహిదీన్ ఫీల్డ్ ఆపరేషనల్ కమాండర్ యాసీన్ యట్టూ అలియాస్ ఘజ్నవి స్థానంలో మహమ్మద్ బిన్ కాసిమ్‌ను నియమించినట్లు ఆ ఉగ్రవాద సంస్థ తెలియజేసింది.

08/15/2017 - 03:01

న్యూఢిల్లీ, ఆగస్టు 14: గోరఖ్‌పూర్‌లోని బాబా రాఘవ్‌దాస్ మెడికల్ కాలేజి ఆస్పత్రిలో నాలుగైదు రోజుల వ్యవధిలో 60 మందికిపైగా చిన్నారులు మృతి చెందడంపై జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్‌హెచ్‌ఆర్‌సి) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ సంఘటనపై పూర్తి వివరాలతో నాలుగు వారాల్లోగా నివేదికను సమర్పించాలని ఆదేశిస్తూ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి నోటీసు ఇచ్చింది.

08/15/2017 - 02:59

జమ్ము ఆగస్టు 14: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మంగళవారం ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసేందుకు ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. సరిహద్దు పోలీస్ పోస్టుల దగ్గర నిఘా పెంచారు. చొరబాట్లు జరుగుతాయని అనుమానం ఉన్న అనేక ప్రాంతాల్లో పోలీసు అధికారులు 24గంటలూ అందుబాటులోనే ఉండాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.

08/15/2017 - 02:59

చిత్రం.. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా సోమవారం ముంబయలో జరిగిన వేడుకల్లో ముద్దులొలుకుతున్న చిన్నారి కృష్ణయ్యతో ఓ యశోదమ్మ

08/15/2017 - 02:56

పాట్నా, ఆగస్టు 14: గత మూడు రోజులుగా బిహార్, పశ్చిమ బెంగాల్, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్‌లలో కురుస్తున్న భారీ వర్షాలకు ఆయా రాష్ట్రాలు అతలాకుతల మయ్యాయ. అనేక ప్రాంతాల్లో రవాణా, సమాచార వ్యవస్థకు తీవ్ర అంతరాయం కలిగింది. బిహార్‌లో వరద పరిస్థితిని ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఏరియల్ సర్వే చేశారు.

08/15/2017 - 02:42

లక్నో, ఆగస్టు 14: ఉత్తరప్రదేశ్‌లోని అన్ని మదర్సాల్లోనూ స్వాంతత్య్ర దినోత్సవ వేడుకలు పెద్ద ఎత్తున నిర్వహించడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. త్రివర్ణపతం ఆవిష్కరణ, జాతీయ గీతం ఆలాపన, అమరవీరులకు నివాళుల దగ్గర నుంచి కార్యక్రమాల ఆసాంతం వీడియో చిత్రీకరించనున్నారు. అన్ని మదర్సాల్లోనూ వేడుకలు నిర్వహించనట్టు రాష్ట్ర మైనారిటీ సచిక్షేమ శాఖ మంత్రి లక్ష్మీనారాయణ్ చౌదరి వెల్లడించారు.

08/15/2017 - 01:21

న్యూఢిల్లీ, ఆగస్టు 14: జమ్ము- కాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి, పౌర హక్కులు కల్పించే రాజ్యాంగంలోని 35ఎ ఆర్టికల్‌పై విచారణకు ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటుకు సుప్రీంకోర్టు సుముఖత చూపించటం సంచలనమైం ది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 35ఎ, జము-కాశ్మీర్ రాజ్యాంగంలోని ఆరో సెక్షన్‌ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను సుప్రీం విచారిస్తుండటం తెలిసిందే.

Pages