S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

01/05/2017 - 07:32

చెన్నై, జనవరి 4: డిఎంకె కార్యనిర్వాహక అధ్యక్షుడిగా పార్టీ అధినేత ఎం కరుణానిధి కుమారుడు ఎంకె స్టాలిన్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకొన్నారు. దీంతో ఇప్పటివరకు కరుణానిధికున్న అన్ని అధికారాలు స్టాలిన్‌కు లభించినట్లయింది. బుధవారం పార్టీ ప్రధాన కార్యాలయం ‘అణ్ణా అరివాలయం’లో జరిగిన జనరల్ కౌన్సిల్ సమావేశంలో 63 ఏళ్ల స్టాలిన్‌ను వర్కింగ్ ప్రెసిండెంట్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

01/05/2017 - 07:30

చెన్నై, జనవరి 4: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జె జయలలిత మరణానికి సంబంధించి అనేక సందేహాలు వ్యక్తం చేస్తూ మద్రాసు హైకోర్టులో మరో రెండు ప్రజాహిత పిటిషన్లు దాఖలయ్యాయి. అసలు జయలలితకు వచ్చిన జబ్బేమిటీ, ఆమెకు ఏ రకమైన చికిత్స చేశారు? అన్నదానిపై విచారణ జరపాలని పిటిషనర్ల్లు డిమాండ్ చేశారు. వీటిని స్వీకరించిన మద్రాసు హైకోర్టు మిగతావాటితోనే రెండు పిటిషన్లను జతచేసింది.

01/05/2017 - 07:29

న్యూఢిల్లీ, జనవరి 4: కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఎన్నికల సంఘానికి సమర్పించిన నివేదికపై చర్చించడానికి మణిపూర్ ముఖ్యమంత్రి ఓక్రం ఇబోబి సింగ్ బుధవారం రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీతో భేటీ అయ్యారు.

01/05/2017 - 07:27

న్యూఢిల్లీ, జనవరి 4: ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికల చిహ్నం సైకిల్ తమకే దక్కాలంటూ సమాజ్‌వాదీ పార్టీలోని ఇరువర్గాలు వాదిస్తుండటంతో గతంలో ఇలాంటి సందర్భాల్లో తీసుకున్న నిర్ణయాలపై ఇప్పుడు ఎన్నికల కమిషన్ (ఇసి) దృష్టి సారించనుంది.

01/05/2017 - 07:26

న్యూఢిల్లీ, జనవరి 4: పాకిస్తాన్ ఉగ్రవాద పోకడలపై వరుసగా మూడోరోజు కూడా కొత్త ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తీవ్రవాదంపై పాకిస్తాన్ పునరాలోచించుకునే విధంగా తదుపరి చర్యలు కఠినంగానే ఉంటాయని ఆయన హెచ్చరించారు. ఆర్మీ వైస్‌చీఫ్‌గా రావత్ ఉన్నప్పుడే ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారత్ లక్షిత దాడులు చేసిన విషయం తెలిసిందే.

01/05/2017 - 07:26

కోల్‌కతా, జనవరి 4: పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు తమ నాయకుడు సుదీప్ బందోపాధ్యాయ అరెస్టుకు నిరసనగా బుధవారం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో వీధుల్లోకి వచ్చారు. హుగ్లీ జిల్లాలో బిజెపి కార్యాలయాన్ని తగులబెట్టారు. బిజెపి నాయకుడు, కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియోను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ఆయన ఇంటి ముందు నిరసన ప్రదర్శన చేశారు.

01/05/2017 - 07:24

న్యూఢిల్లీ, జనవరి 4: ఓ పక్క యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ అధినాయకత్వం అన్ని రకాల వ్యూహాలతో ముందుకు సాగుతున్న నేపథ్యంలో ఈ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి షీలా దీక్షిత్ బుధవారం సంచలన ప్రకటన చేశారు. తనకంటే కూడా ముఖ్యమంత్రిగా అఖిలేశ్ సమర్థుడైన అభ్యర్థి అని, అతనికోసం పోటీనుంచి తప్పుకోడానికి తాను సిద్ధంగా ఉన్నానని ఓ జాతీయ చానల్‌కు ఇచ్చిన ఇంటర్‌వ్యూలో స్పష్టం చేశారు.

01/05/2017 - 05:54

న్యూఢిల్లీ,జనవరి 4: కేంద్ర ఆర్థిక బడ్జెట్‌లో తెలంగాణ రాష్ట్రానికి తగిన ప్రాధాన్యత ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. బుధవారం ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ అధ్యక్షతన జరిగిన జిఎస్టీ కౌన్సిల్ 8వ సమావేశంలో రాష్ట్ర ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ పాల్గొన్నారు. అనంతరం జరిగిన కేంద్ర బడ్జెట్ సన్నాహక సమావేశంలో మంత్రి ఈటల పాల్గొన్నారు.

01/05/2017 - 05:51

న్యూఢిల్లీ, జనవరి 4: రాష్ట్రానికి రావలసిన రెవెన్యూ లోటు 12,099 కోట్ల రూపాయలను వెంటనే విడుదల చేయాలని ఏ.పి ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీకి విజ్ఞప్తి చేశారు.

01/05/2017 - 05:50

న్యూఢిల్లీ, జనవరి 4:నాయయమూర్తుల నియామకానికి సంబంధించిన వివాదాస్పద ఎన్‌జెఎసి చట్టాన్ని రద్దు చేసిన ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి సారధ్యం వహించిన జస్టీస్ కెహర్ బుధవారం సుప్రీం కోర్టు 44వ ప్రధాన న్యాయమూర్తిగా బుధవారం పదవీ స్వీకార ప్రమాణం చేశారు. రాష్టప్రతి భవన్‌లోని దర్బార్ హాలులో ఆయన చేత రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ ప్రమాణం చేయించారు.

Pages