S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సమాజ్‌వాదీ పార్టీలో మళ్లీ లుకలుకలు

లక్నో, డిసెంబర్ 11: ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికలకోసం ఆ రాష్ట్ర సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు శివ్‌పాల్ యాదవ్ విడుదల చేసిన అభ్యర్థుల జాబితా అధికార పార్టీలోని లుకలుకలను మరోసారి తెర మీదికి తీసుకొచ్చింది. రాజకీయ నాయకుడిగా మారిన గ్యాంగ్‌స్టర్ ముక్తార్ అన్సారీ సోదరుడితోపాటు మరో మాఫియా డాన్ అతీక్ అహ్మద్ లాంటి వారికి ఈ జాబితాలో చోటు కల్పించడాన్ని ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఏమాత్రం జీర్ణించుకోలేకపోతుండటమే ఇందుకు కారణం.

ఫెడ్ రిజర్వ్ ద్రవ్యసమీక్ష కీలకం

న్యూఢిల్లీ, డిసెంబర్ 11: అమెరికా రిజర్వ్ బ్యాంక్ అయన ఫెడ్ రిజర్వ్ ద్రవ్యసమీక్ష, స్థూల ఆర్థిక గణాంకాలు, అంతర్జాతీయ పరిణామాలు ఈ వారం దేశీయ స్టాక్ మార్కెట్లను ప్రభావితం చేస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. రెండు రోజుల ద్రవ్యసమీక్షను ఈ నెల 13న ఫెడ్ రిజర్వ్ ప్రారంభిస్తుంది. దీంతో వడ్డీరేట్ల విషయంలో ఫెడ్ రిజర్వ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోననే ఉత్కంఠ సర్వత్రా కనిపిస్తోంది. కాగా, పాత పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో చోటుచేసుకుంటున్న పరిణామాలు, ప్రస్తుత పార్లమెంట్ శీతాకాల సమావేశాలూ మదుపరుల పెట్టుబడులను శాసించ నున్నాయని మార్కెట్ విశే్లషకులు అంటున్నారు.

పెరగనున్న రెనాల్ట్ కార్ల ధరలు

న్యూఢిల్లీ, డిసెంబర్ 11: ఫ్రాన్స్‌కు చెందిన ఆటోరంగ దిగ్గజం రెనాల్ట్.. భారతీయ మార్కెట్‌లో తమ కార్ల ధరలను పెంచాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే వచ్చే నెల జనవరి నుంచి 3 శాతం వరకు ధరల పెంపును ప్రకటించింది. గతకొద్ది నెలలుగా పెరిగిన ఉత్పాదక వ్యయం, ఫారెక్స్ మార్కెట్ ఒడిదుడుకుల మధ్య వివిధ రకాల మోడళ్ల ధరలను 1.5 శాతం నుంచి 3 శాతం వరకు పెంచుతున్నట్లు రెనాల్ట్ ఇండియా ఆపరేషన్స్ సిఇఒ, మేనేజింగ్ డైరెక్టర్ సుమిత్ సాహ్నీ పిటిఐకి తెలిపారు. క్విడ్, డస్టర్ మోడళ్లను ప్రస్తుతం రెనాల్ట్ ఇండియా మార్కెట్‌లో విక్రయిస్తోంది. కాగా, ఇప్పటికే వాహన ధరలను పెంచుతున్నట్లు టొయోటా ప్రకటించింది.

సోర్స్‌ఆర్‌ఎఫ్‌ఎక్స్ అన్‌లైన్ నెట్ వర్కింగ్‌

చిన్న, మధ్యతరహా పరిశ్రమలను అనుసంధానం చేసేందుకు వీలు కల్పించే
సోర్స్‌ఆర్‌ఎఫ్‌ఎక్స్ అన్‌లైన్ నెట్ వర్కింగ్‌ను ఆదివారం హైదరాబాద్‌లో ఎపి గిడ్డంగుల సంస్థ చైర్మన్
ఎల్‌విఎస్‌ఆర్‌కె ప్రసాద్ లాంఛనంగా ప్రారంభించారు. చిత్రంలో కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ ఎపి చాఫ్టర్ మాజీ చైర్మన్ సురేష్ రాయుడు చిట్టూరి కూడా ఉన్నారు.

నోట్7 ఫోన్లు పనిచేయవట!

న్యూఢిల్లీ, డిసెంబర్ 11: సామ్‌సంగ్ గెలాక్సీ నోట్7 స్మార్ట్ఫోన్లు ఇకపై పని చేయవు. బ్యాటరీలో తలెత్తిన లోపం కారణంగా ఈ ఫోన్ల మూలాన సామ్‌సంగ్ భారీగానే నష్టపోయింది. బ్యాటరీ వేడెక్కి ఫోన్లు పేలిపోతుండటంతో నోట్7 ఫోన్లను సామ్‌సంగ్ రీకాల్ చేసింది కూడా. ఈ క్రమంలో కస్టమర్లకు మరొక మోడల్ ఫోనో లేక నగదును రీఫండ్ చేయడమో జరిపింది. అయితే అమ్మిన మొత్తం నోట్7 ఫోన్లు తిరిగి సామ్‌సంగ్ వద్దకు రాకపోవడంతో కస్టమర్ల క్షేమం, సంస్థ పేరు దృష్ట్యా ఆ మిగతా ఫోన్లనూ రాబట్టుకోవాలని సామ్‌సంగ్ ఓ నిర్ణయానికి వచ్చిందిప్పుడు. అదే.. నోట్7 ఫోన్లు పూర్తిగా పనిచేయకుండా చేయడం. ఓ సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేసి నోట్7ను డెడ్ చేయనుంది.

‘నల్ల’ న్యాయవాది

న్యూఢిల్లీ, డిసెంబర్ 11: ఓవైపు సామాన్యుడు 100 రూపాయల కోసం గంటల తరబడి బ్యాంకులు, ఎటిఎమ్‌ల వద్ద పడిగాపులు గాస్తుంటే, మరోవైపు బడా బాబుల దగ్గర కోటానుకోట్ల అక్రమ సంపద వెలుగు చూస్తోంది. పాత పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో దేశవ్యాప్తంగా వందల కోట్ల రూపాయల అవినీతి సంపద బయటపడుతోంది. అధికారుల సోదాల్లో వెలుగుచూస్తున్న ఈ అక్రమార్జనలో పెద్ద ఎత్తున కొత్త నోట్లూ ఉండటం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. నల్లధనం, నకిలీ కరెన్సీల నిర్మూలన కోసం పాత 500, 1,000 రూపాయల నోట్లను గత నెల 8వ తేదీన రద్దు చేస్తున్నట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించినది తెలిసిందే.

ఏప్రిల్ 1 నుంచి జిఎస్‌టి అమలయ్యేనా?

న్యూఢిల్లీ, డిసెంబర్ 11: వచ్చే సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) అమలయ్యేనా? అన్న అనుమానాలు కలుగుతున్నాయ. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ నేతృత్వంలో ఆదివారం ఇక్కడ జరిగిన 6వ జిఎస్‌టి మండలి సమావేశంలోనూ సంతృప్తికర నిర్ణయాలు వెలువడలేదుమరి. జిఎస్‌టి చట్టాల లెజిస్లేటివ్ ముసాయిదాపై చర్చ మొదలవగా, జిఎస్‌టి నిబంధనలకు సంబంధించి చాలావరకు స్పష్టత లభించింది. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కీలక అంశాలపై బేధాభిప్రాయాలు కొనసాగడంతో తాజా సమావేశమూ అర్ధాంతరంగానే ముగిసింది. వచ్చే మండలి సమావేశంలో జిఎస్‌టి డ్రాఫ్ట్ లెజిస్లేషన్ ఆమోదం పొందగలదన్న ఆశాభావాన్ని జైట్లీ వ్యక్తం చేశారు.

ఎఫ్‌పిఐలను ఆకట్టుకోని రుణ మార్కెట్లు

న్యూఢిల్లీ, డిసెంబర్ 11: భారతీయ మార్కెట్ల నుంచి విదేశీ మదుపరుల పెట్టుబడుల ఉపసంహర ణ కొనసాగుతోంది. పాత పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో గత నెల నవంబర్‌లో దాదాపు 6 బిలియన్ డాలర్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్న విదేశీ పోర్ట్ఫోలియో లేదా సంస్థాగత మదుపరులు (ఎఫ్‌పిఐ).. ఈ నెలలోనూ అదే దారిలో పయనిస్తు న్నారు. అయతే స్టాక్ మార్కెట్లలోకి స్వల్పంగా పెట్టుబడులను పట్టుకొచ్చిన ఎఫ్‌పిఐలు.. రుణ మార్కెట్ల నుంచి మాత్రం 17 వేల కోట్ల రూపాయలకుపైగా పెట్టుబడులను లాగేసుకు న్నారు. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నిక, తదనంతర పరిణామాల ప్రభావం కూడా భారత్‌సహా ప్రపంచ స్టాక్ మార్కెట్లపై కనిపిస్తోంది.

ఆంధ్రా, తెలంగాణల్లో ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ సేవలు

న్యూఢిల్లీ, డిసెంబర్ 11: దక్షిణాది రాష్ట్రాలకు ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ సేవలు విస్తరించనున్నాయి. తొలుత రాజస్థాన్‌లో ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ సేవలు మొదలైనది తెలిసిందే. ఈ క్రమంలోనే కేవలం 15 రోజుల్లో ఒక లక్షకుపైగా సేవింగ్స్ ఖాతాలను బ్యాంక్ తెరిచింది. దీంతో దేశవ్యాప్త సేవలపై ఎయిర్‌టెల్ పేమెంట్ బ్యాంక్ దృష్టి పెట్టగా, అందులో భాగంగానే ఈ వారం దక్షిణాది రాష్ట్రాలకు సేవలను ప్రారంభించనుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్నాటక తదితర రాష్ట్రాల్లో తమ బ్యాంక్ సేవలు మొదలు కానున్నాయని బ్యాంక్ సిఇఒ శశి అరోరా పిటిఐకి తెలిపారు.

ముదురుతున్న టాటా-మిస్ర్తిల వివాదం

న్యూఢిల్లీ, డిసెంబర్ 11: టాటాలు-మిస్ర్తిల మధ్య వాగ్వాదం కొనసాగుతోంది. టాటా గ్రూప్‌ను నిర్వీర్యం చేసే చర్యలు తీసుకున్నారంటూ సైరస్ మిస్ర్తిపై టాటాలు విరుచుకుపడుతుండగా, అంతేస్థాయిలో తనను ఓ కీలుబొమ్మను చేసి ఆడుకున్నారంటూ టాటాలపై మిస్ర్తి మండిపడుతున్నారు. తాజాగా టాటా సన్స్ చైర్మన్ ఎంపిక కోసం 2011లో ఏర్పాటైన కమిటీని మిస్ర్తి తప్పుదోవ పట్టించారని టాటాలు ఆరోపించారు. 2012లో అప్పటి టాటా గ్రూప్ చైర్మన్ రతన్ టాటా వారసుడిగా సైరస్ మిస్ర్తి ఎన్నికైనది తెలిసిందే. వాగ్ధానాలను తుంగలోతొక్కి ప్రవర్తించారని మిస్ర్తిని ఆదివారం టాటాలు దుయ్యబట్టారు.

Pages