S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు నేలపై..

హిందూ దేశంలో వివిధ ప్రాంతాలలో, వివిధ రకాలుగా మంటలు వేయడం ఆచరింప బడుతున్నా, తెలుగునేలపై భోగి పండువకు, అలాగే హోలీ పండుగకు మంటలు వేయడం సాంప్రదాయంగా ఉంది. పరమ శివుని కోపాగ్నికి కాముడు భస్మం కావడానికి సూచన మేత్రమే కాక, ‘‘హోలిక’’ అనే రాక్షసి మంటల్లో కాలిపోయిన సంఘటనకు భూమికగా కూడా చెపుతుతారు. కొన్ని చోట్ల హోలిక ప్రతిమను కూడా తగల బెడతారు. హోలిక, హిరణ్యకశిపుని సోదరి. హిరణ్య కశిపుని కుమారుడు ప్రహ్లాదుడు. తండ్రి నాస్తికుడు, తనయుడు ఆస్తికుడైన విష్ణ్భుక్తుడు. బాలకుని విష్ణ్భుక్తిని మార్చడానికి రాక్షసరాజు శతవిధాలా ప్రయత్నించాడు. అయినా ప్రహ్లాదుడు చలించలేదు.

- సంగనభట్ల రామకిష్టయ్య

సహజ రంగులే ముద్దు!

రంగుల పండుగ వచ్చేసింది. పిల్లలే కాదు.. పెద్దల కేరింతలు కూడా మొదలయ్యాయి. హోలీ అంటే ఆడుకునే రంగులు గుర్తొస్తాయి. గులాబీ, నీలం, ఆకుపచ్చ, ఎరుపు.. ఈ నాలుగు రంగులు లేకుండా హోలీ పండుగ పూర్తవదు. కానీ హోలీ ఆడిన పదిరోజుల వరకు ఈ రంగులు శరీరాన్ని అంటిపెట్టుకుని పోవు. ఎంత రుద్దినా చర్మంపై రాష్ వస్తుందే తప్ప రంగు మాత్రం పోదు. కారణం రంగుల్లో ఉండే రసాయనాలు.. వీటివల్ల చర్మానికి చాలా అనర్థాలు వస్తాయి. ఈ రంగులు కంట్లో పడటం వల్ల కళ్లకు కూడా చాలా ప్రమాదం. అలాగే ఇంటి ప్రాంగణంలో కూడా ఈ రంగుల సందడి పదిరోజుల దాకా ఉంటుంది. ఇలా కాకుండా ఈసారి సహజ రంగులను తయారుచేసుకుని వాడుకుంటే ఆ మజాయే వేరు.

కవిత్వం సాక్షిగా..

భావాలన్ని కదం తొక్కుతూ
కాగితంపై కవాతు చేస్తుంటే

ఇంకిపోని నా కలం సాక్షిగా
కొత్త చరిత్రని లిఖిస్తాను

చేదు నిజంలాంటి గతాన్ని చెరిపి
భవిష్యత్తుపై తీపి ఆశ రుచి చూపిస్తా

ఏళ్ల బానిసత్వాన్ని వదిలేసినా
మనసుని వీడని అలసత్వాన్ని వదిలిస్తా

నా కవిత్వం వెన్నల్లో ఆడుకునే
అక్షరాలే కాదు
అవసరం అయితే కత్తిపట్టే
యుద్దవీరులుని నిరూపిస్తా

అన్యాయం తలెత్తినచోట
న్యాయ తిరుగు బావుటాని ఎగరేసి
ధర్మాన్ని భుజానేసుకుంటా

సర్వకాల సర్వావస్తలలో
కవితావికాసపు శిఖరపు
అంచులపై అక్షర జెండా ఎగరేస్తా

- పుష్యమీ సాగర్ 90103 50317

కష్టమే ఆమె ఆయుధం..

బరువైన లారీలు..
ట్రాక్టర్ల చక్రాలు..
చుట్టూ మెకానిక్ పనిముట్లు..
మధ్యలో ముగ్గురు పిల్లల తల్లి..
చకచకా పనులు చేసుకుంటోంది..
తగిలే దెబ్బలకు వెరవడం లేదు..
అబ్బా.. అని ఒక్క క్షణం కూడా ఆగడం లేదు..
పనిలో అకుంఠిత దీక్ష..
మొక్కవోని ధైర్యం..
పట్టుదల, ఏకాగ్రతలనే లక్ష్యాలుగా చేసుకుని పనిచేస్తోంది ఆ తల్లి..
వివరాల్లోకి వెళితే..

-ఎస్.ఎన్. ఉమామహేశ్వరి

నిశ్చలస్థితే నిర్మలానందానికి దారి (పరీక్షిత్తు - 7)

అవధూతలల్లో అగ్రగణ్యుడవు. అవ్యక్తమైన గమనం కలవాడవు. నీ సందర్శనం వ్యర్థకాదు. నేను వారంరోజుల్లో ఈ దేహాన్ని వదిలివేయాలి. అట్టి నాకు మీ దర్శనం లభించింది అంటే తప్పకుండా నాకు శుభం కలుగుతుంది. నాకోరిక నెరవేరుతుంది అన్న భావం నాకు కలుగుతోంది. మహానుభావా! ఈ ఏడు రోజుల్లో నారాయణుని పాదపద్మాలను చేరుకొనే ఉపాయాన్ని చెప్పండి. మదోన్మత్తతతో చేయకూడని కార్యాన్ని చేశాడు. బాలుడైన శృంగి చేత శపించబడ్డాను. ఇందులో శృంగి చేసిన తప్పేమీ లేదు. నేను ఇంత పెద్దవాణ్ణి అయ్యి ఉండి కూడా తప్పుచేశాను.

డా. రాయసం లక్ష్మి

స్వాధ్యాయ సందోహం

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం:
డా పాలకోడేటి జగన్నాథరావు 9490620512
*
బ్రహ్మవేత్తను చంపరాదు
తద్వై రాష్టమ్రా స్తవ్రతి నావం భిన్నామివోదకమ్‌ బ్రహ్మాణం
యత్ర హింసంతి తద్రాష్ట్రం హంతి దుచ్ఛునా॥ అథ.వే.5-19-8॥
భావం:- నీరు చిల్లుపడిన ఓడనే విధంగా ముంచివేస్తుందో ఆ విధంగా బ్రహ్మవేత్తను హింసించి చంపిన దేశం సర్వనాశనమవుతుంది.

తొలిగురువు మాతృమూర్తే!

మన వేదాలు పురాణాలు ఇతిహాసాలు ముక్తకంకఠంతో తల్లియొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పాయి. ‘నాస్తి మాతృ సమో గురుః’- మాతృమూర్తితో సమానమైన గురువు ఎవ్వరూ లేరని వక్కాణించారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ అనే సూక్తిలో మొదటగా తల్లినే పేర్కొన్నారు. ఎందుకంటే తల్లి నుంచి బిడ్డలకు లభించే ప్రేమ, మమకారం, ఉపదేశం, ఉపకారం మరెవరినుంచీ లభించదు.

- జన్నాభట్ల నరసింహప్రసాద్

పరమహంస బోధామృతము

వివిధ మతములు భగవత్ప్రాప్తి కనువగు వివిధ మార్గములు
462. పెద్ద చెరువునకు అనేకమైన రేవులుండును. స్నానము చేయుటకుగాను, పాత్రతో నీరు తీసికొనిపోవుటకుగాని రుూ రేవులలో దేనిలో దిగినను నీటిని జేరవచ్చును. ఒక రేపు మరియొక రేవుకంటె శ్రేష్ఠమైనదని వాదులాడుట వ్యర్థము. అటులనే బ్రహ్మానంద సరోవరమునకు అనేకమైన రేవులున్నవి. ప్రపంచమందలి ప్రతి మతమును అట్టియొకానొక రేవు. వినిర్మల హృదయుడవై నీవీ రేవులలో దేనియందు బ్రవేశించినను తన్మూలమున బ్రహ్మానందమను జలమును జేరగలవు. కావున ‘‘నా మతము మరియొకని మతముకంటె శ్రేష్ఠ’’మని వాదులాడబోకుము.

ప్రచారం అక్కర్లేదు! (ఓషో బోధ )

ఒక గొప్ప ధనవంతుడు చివరి రోజుల్లో చాలా నిరాశతో ఉండేవాడు.అనేక విజయాలు సాధించినతరువాత సహజంగా నిరాశే మిగులుతుంది. ఎందుకంటే, విజయం ఓడినంతగా ఏదీ ఓడిపోదు. మీరు ఓడినపుడే విజయానికి ప్రాముఖ్యత లభిస్తుంది. అయితే విజయం సాధించిన తరువాత ఈ ప్రపంచం, సమాజం, మనుషువల్ల మీరుఎలా మోసపోయారో మీకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఆ ధనవంతుడికి అన్నీ ఉన్నాయి కానీ మనశ్శాంతి లేదు. అందుకే దానికోసం ఆరాటపడడం ప్రారంభించాడు. అమెరికాలో జరుగుతున్నది అదే.

శ్రీకృష్ణ రమ్య రామాయణం

కృష్ణపత్నులు:
ఐననొక్క సందియమ్ము మనమున మిగిలేను
ఎవ్వరు విశ్వామిత్రుడు? ఎవరు వశిష్ఠుండు?

వారి మాట దశరథుండు మీరకుండుటేమి?
అతని మాట నాతయుడు ఆచరించుటేమి?

శ్రీకృష్ణుడు:
విశ్వానికె మిత్రుడోయి విశ్వామిత్రుండు
రాశిపోసి రిక్కలనే చేయును జన్నమ్ము

శిష్టులలో శిష్టుండు వశిష్ఠుండు సుమీ
ఆతని మించిన ఘనుండీతడు ఎరుగండి

కృష్ణపత్నులు:
ఐన తోడ లంక ఏమి? ఆ అయోధ్య ఏమి?
రామరావణుల యుద్ధం జరుగుటనది ఏమి?

శ్రీకృష్ణుడు:
ఆకాశమ్మంత ఎత్తు- మనసుకుండు లోతు
అనగానదియే అయోధ్య- దుర్బేధ్యమ్మదియే

- గన్ను కృష్ణమూర్తి, 9247227087

Pages