S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

28న ఇద్దరు ముఖ్యమంత్రుల భేటీ

హైదరాబాద్, జూన్ 24: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఈ నెల 28న హైదరాబాద్‌లో సమావేశం కానున్నారని సమాచారం. ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలపై చర్చించడానికి వీరు ప్రగతి భవన్‌లో సమావేశం కానున్నారని తెలిసింది. ఈ నెల 27న కొత్త సచివాలయం, శాసనసభ సముదాయ భవనాలకు భూమి పూజ జరుగనుంది. ఆ రోజు హైదరాబాద్‌లోనే ఉండే ఏపీ సీఎం వైఎస్ జగన్ భూమి పూజ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉందని సమాచారం.

కూల్చివేతలు కొనసాగుతాయా?

విజయవాడ (సిటీ), జూన్ 24: అక్రమంగా, అవినీతితో, లోకాయుక్త సూచనలను పట్టించుకోకుండా, పర్యావరణ పరిరక్షణను కాదని ప్రజావేదికను నిర్మించారని దానిని మరో రెండు రోజుల్లో కూల్చివేస్తామని కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన ప్రకటన ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ అవసరాల కోసం నిర్మించిన ఈ ప్రజావేదిక కేంద్రంగా గత కొన్ని రోజులుగా పెద్ద ఎత్తున వార్తలు, చర్చలు జరుగుతున్న నేపథ్యంలో సోమవారం సీఎం జగన్ చేసిన ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది.

‘గ్రామ వాస్తవ్య’ పేరిట డ్రామాలు: యెడ్యూరప్ప

బెంగళూరు, జూన్ 24: ముఖ్యమంత్రి హెచ్.డీ.కుమారస్వామి ‘గ్రామ వాస్తవ్య’ (గ్రామాల్లో రాత్రి నిద్ర) పథకం పేరిట ‘డ్రామా’ ఆడుతున్నారని, అధికార కాంగ్రెస్, జేడీ(ఎస్) నేతలు రోజూ వీధి పోరాటాలకు దిగుతున్నారని, కానీ ఇపుడు ప్రజలకు కావాల్సింది కాస్త ప్రశాంతత అని బీజేపీ కర్నాటక అధ్యక్షుడు బి. యెడ్యూరప్ప వ్యాఖ్యానించారు. ‘గ్రామ వాస్తవ్య’ పేరిట ముఖ్యమంత్రి కోట్లాది రూపాయల ప్రజా ధనాన్ని వృథా చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ‘గ్రామ వాస్తవ్య’ పథకంలో భాగంగా గత వారంలో యాదగిర్ జిల్లాలోని చంద్రకి గ్రామంలో బస చేసేందుకు ముఖ్యమంత్రి కోటి రూపాయలు ఖర్చు చేశారని ఆయన విమర్శించారు.

ఆ వివరాలు వెల్లడించలేం..

న్యూఢిల్లీ, జూన్ 24: లోక్‌సభ ఎన్నికల సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రసంగాలు ఎన్నికల నియమావళిని ఉల్లంఘించేవిగా ఉన్నాయంటూ వచ్చిన ఆరోపణలపై ఎన్నికల కమిషనర్ అశోక్ లవాస వ్యక్తం చేసిన అసమ్మతి వాదనను వెల్లడించలేమని ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. ప్రధాని మోదీ కోడ్ ఉల్లంఘనపై ఇసి తీసుకున్న నిర్ణయాలపై అశోక్ లవాస అసమ్మతిని వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ అసమ్మతి వివరాలు వెల్లడించాలంటూ దాఖలైన సమాచార హక్కు పిటీషన్‌ను తిరస్కరించిన ఎన్నికల కమిషన్ ‘ఈ వివరాలు వెల్లడిస్తే ఓ వ్యక్తి జీవితానికి, భౌతిక భద్రతకు’ ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంటుందని వ్యక్తం చేసింది.

అత్యాధునిక భద్రతా ఫీచర్లతో సరికొత్త ‘ఈ-పాస్‌పోర్టు’

న్యూఢిల్లీ: ప్రాధాన్యతా ప్రాతిపదికన జారీచేసే సరికొత్త ‘ఈ-పాస్‌పోర్టు’ల రూపకల్పనకు ప్రతిపాదించామని కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్ వెల్లడించారు. ఆధునిక భద్రతా ప్రయోజనాలతో కూడిన పర్యాటక డాక్యుమెంట్‌ను అందుబాటులోకి తేవాలన్నదే లక్ష్యమని వెల్లడించారు. త్వరలో దీన్ని అమల్లోకి తేవడం జరుగుతుందని సోమవారం నాడిక్కడ జరిగిన ‘ఏడవ పాస్‌పోర్టు సేవా దివస్’ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన తెలిపారు. ఇందుకు సంబంధించిన ప్రాజెక్టుపై ‘ఇండియా సెక్యూరిటీ ప్రెస్’తో చర్చిస్తున్నామని, ప్రత్యేకించి చిప్‌తో కూడిన ప్రత్యేక తరహా ఈ-పాస్‌పోర్టులను పౌరులకు అందజేయనున్నామని వివరించారు.

నల్లధనం 216-490 బిలియన్ డాలర్లు

న్యూఢిల్లీ, జూన్ 24: విదేశాల్లో ఉంటున్న భారతీయుల లెక్కలేని సంపద దాదాపు 216-490 బిలియన్ డాలర్ల మేర ఉందని తాజా అధ్యయనంలో వెల్లడయింది. 1980-2010 మధ్య కాలంలో విదేశాల్లోని భారతీయులకు లెక్కల్లోకి రాని సంపద మొత్తం ఈ మేరకు నమోదయిందని ఎన్‌ఐపీఎఫ్‌టీ, ఎన్‌సీఏఈఆర్, ఎన్‌ఐఎఫ్‌ఎం అనే మూడు సంస్థలు వెలుగులోకి తెచ్చాయి. రియల్ ఎస్టేట్ గనులు, ఫార్మా, పాన్ మసాలా, గుట్కా బులియన్, సినిమా వంటి రంగాల్లోనే ఈ అక్రమ సంపద ఉందని ఈ సంస్థలూ తమ అధ్యయనంలో భాగంగా వెల్లడించాయని సోమవారం లోక్‌సభలో స్థాయి కమిటీ నివేదిక ద్వారా బయటపెట్టారు. నల్లధనం ఏ విధంగా ఉత్పన్నమవుతుంది? అది ఎంత మేరకు ఉంది?

ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ విరాల్ ఆచార్య రాజీనామా

న్యూఢిల్లీ, జూన్ 24: రిజర్వు బ్యాంకు డిప్యూటీ గవర్నర్ విరాల్ ఆచార్య సోమవారం అనూహ్యంగా తన పదవికి రాజీనామా చేశారు. ఆయన మూడేళ్ల పదవీ కాలం ముగిసేందుకు ఇంకా ఆరు నెలల వ్యవధి ఉన్నప్పటికీ ఆయన వైదొలగడం చర్చనీయాంశమైంది. అయితే కేవలం వ్యక్తిగత కారణాల వల్లే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆచార్య తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. కాగా ఆర్బీఐ నుంచి అత్యున్నత స్థాయి వ్యక్తులు వైదొలగడం గత ఏడు నెలల కాలంలో ఇది రెండోసారి కావడం గమనార్హం. 2018 డిసెంబర్‌లో అప్పటి ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ సైతం పదవీ కాలం ఇంకా తొమ్మిది నెలలు మిగిలివుండగానే రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.

స్వల్పంగా నష్టపోయిన సూచీలు

ముంబయి, జూన్ 24: అంతర్జాతీయంగా అమెరికా-ఇరాన్ మధ్య తీవ్ర స్థాయిలో నెలకొన్న ఉద్రిక్తల క్రమంలో చమురు, సహజ వాయులు, లోహ స్టాక్స్ తీవ్ర నష్టాలకు గురయ్యాయి. దీంతో సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు స్వల్ప నష్టాలను నమోదు చేశాయి. తొలుత 300 పాయింట్లు ఎగబాకిన బీఎస్‌ఈ సూచీ సెనె్సక్స్ ఆ తర్వాత తీవ్ర ఒడిదుడుకులకు గురైంది. చివరిగా 71.53 పాయింట్లు కోల్పోయి 0.18 శాతం నష్టాలతో 39,122.96 వద్ద దిగువన స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ ఒక దశలో 39,021.96 పాయింట్ల కనిష్టాన్ని, మరో దశలో 39,300.02 పాయింట్ల గరిష్టాన్ని తాకింది. అలాగే బ్రాడర్ ఎన్‌ఎస్‌ఈ సూచీ నిఫ్టీ సైతం 24.45 పాయింట్లు కోల్పోయింది.

విద్యుత్ వాహనాలపై పన్ను తగ్గింపు

న్యూఢిల్లీ, జూన్ 24: పర్యావరణ పరిరక్షణకు దోహదం చేసే విద్యుత్ వాహనాలకు పన్నును తగ్గించే విషయాన్ని వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) మండలి పరిశీలిస్తోందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ సోమవారం లోక్‌సభకు తెలిపారు. ప్రశ్నోత్తరాల సమయంలో బీజేపీ సభ్యుడు వరుణ్ గాంధీ అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా మంత్రి పై విషయం వెల్లడించారు. ప్రస్తుతం ఈ అంశం జీఎస్‌టీ మండలి వద్ద పెండింగ్‌లో ఉందని, త్వరలో నిర్ణయం జరుగుతుందని మంత్రి ఠాకూర్ తెలిపారు.

నువ్వా.. నేనా?

లండన్: మెగా టోర్నీలో మరో రసవత్తర మ్యాచ్‌కు తెరలేవనుంది. లండన్ వేదికగా ఆతిథ్య జట్టు తన చిరకాల ప్రత్యర్థి ఆస్ట్రేలియాతో తలపడనుం ది. టోర్నీకి ముందునుంచే మాటల యుద్ధం మొదల వడంతో అందరి దృష్టి ఈ మ్యాచ్‌పైనే పడింది. ఇప్పటి కే ఐదు సార్లు ప్రపంచకప్, రెండు సార్లు రన్నరప్‌గా నిలిచి డిఫెండింగ్ చాంపియన్‌గా మెగా టోర్నీలో అడు గుపెట్టిన కంగారూలు వరుస విజయాలతో దూసుకు పోతున్నారు. మరోవైపు ఇప్పటి వరకు ప్రపంచకప్‌ని ముద్దాడని ఆతిథ్య జట్టు ఆస్ట్రేలియాతో మ్యాచ్‌కి ఎలాంటి ప్రణాళికలతో బరిలోకి దిగబోతుందనేది ఆసక్తిగా మారింది.
నాలుగు విజయాలతో..

Pages