S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

25న ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ రాక

తిరుపతి, సెప్టెంబర్ 22: ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఇ ఎస్ ఎల్ నరసింహన్ ఈనెల 25,26 తేదీలలో జిల్లాలో పర్యటించనున్నారని జిల్లా కలెక్టర్ సిద్ధార్థజైన్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 25వ తేదీన హైదరాబాద్ నుంచి స్పైస్ జెట్ విమానంలో బయలుదేరి మధ్యాహ్నం 1.30 గంటలకు తిరుపతి విమానాశ్రయంకు చేరుకుంటారు. మధ్యాహ్నం 1.55 గంటలకు తిరుచానూరులోని తోళ్లప్పగార్డెన్‌లో విశ్రాంతి తీసుకొని అనంతరం పద్మావతి అమ్మవారిని దర్శించుకుంటారు. సాయత్రం 4 గంటలకు వేదిక్ విశ్వవిద్యాలయంలో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. సాయంత్రం 5 గంటలకు తిరుపతి నుంచి రోడ్డు మార్గం ద్వారా తిరుమలకు బయలుదేరివెళతారు.

24న రేషన్ మేళా నిర్వహించాలి

చిత్తూరు, సెప్టెంబర్ 22: జిల్లా వ్యాప్తంగా శనివారం తహశీల్దార్ కార్యాలయాల్లో రేషన్‌మేళా కార్యక్రమం నిర్వహించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ గిరీషా ఆదేశించారు. గురువారం చిత్తూరు కలెక్టర్ కార్యాలయంలో సివిల్‌సప్లై అధికారులతో ఆయన సమీక్షించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ డీలర్ షాపుల్లో నెలకొన్న సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించే విధంగా ఈమేళాలో తహశీల్దార్లు చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే మార్పులు, చేర్పులు రేషన్ కార్డులో పొరబాటును సరిదిద్దే విధంగా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీపం పథకం కింద లబ్దిదారులకు గ్యాస్ కనెక్షన్లు ఇచ్చే విధంగా చొరవ చూపాలన్నారు.

పరిశ్రమలకు విద్యుత్ సర్వీసు కోసం సాధ్యతా ధ్రువీకరణపత్రం అవసరం లేదు

తిరుపతి, సెప్టెంబర్ 22: ఎపిఎస్‌పిడిసిఎల్ పరిధిలో పరిశ్రమలు విద్యుత్ సర్వీసుల కోసం ఇకపై సాధ్యతా ధ్రువీకరణ పత్రాన్ని పొందాల్సిన అవసరంలేదని ఎపిఎస్‌పిడిసిఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ హెచ్ వై దొర గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్రంలో వివిధ ఆర్థిక సంస్థలు , బ్యాంకులు, రుణదాతలు సింగిల్స్ డెస్క్ ద్వారా విద్యుత్ సర్వీసును పొందేందుకు దరఖాస్తు చేసుకున్న తర్వాత విద్యుత్ శాఖ నుంచి సాధ్యతా ధ్రువీకరణ పత్రాన్ని పొందడాన్ని రద్దు చేస్తూ రాష్ట్ర ఇంధన, వౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖ ఉత్తర్వులు జారీ చేసిందన్నారు.

స్విమ్స్‌లో అగ్నిమాపక నిరోధక పనులు ప్రారంభం

తిరుపతి, సెప్టెంబర్ 22: రోగుల భద్రతను దృష్టిలో ఉంచుకొని స్విమ్స్ ఆసుపత్రిలో అగ్నిప్రమాద నిరోధక ఏర్పాట్లకు స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ టి ఎస్ రవికుమార్ శ్రీకారం చుట్టారు. ఈనేపథ్యంలో గురువారం ఫైర్‌ఫైటింగ్ సిస్టమ్ ఇన్సులేషన్ పనులకు పూజలు నిర్వహించి ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ బెంగళూరుకు చెందిన మెడ్‌లీ ఫైర్ సిస్టమ్ కంపెనీ స్విమ్స్‌లో ఫైర్ ఫైటింగ్‌సిస్టమ్ ఇన్సులేషన్ పనులను ఆ సంస్థ అధికార ప్రతినిధి సివి సుబ్బారావు నేతృత్వంలో నిర్వహిస్తున్నామన్నారు. ఏ సంస్థకైనా ముఖ్యంగా వైద్య సంస్థలకు అగ్నిప్రమాద నిరోధక ఏర్పాట్లు అవసరమన్నారు.

‘పారిశుద్ధ్యంపై అలసత్వం వద్దు’

కల్లూరు, సెప్టెంబర్ 22: పారిశుద్ధ్యంపై అలసత్వం వద్దని ఎంపిడిఓ సౌభాగ్యం తెలిపారు. పులిచెర్ల మండలం రెడ్డివారిపల్లి పంచాయతీ నవాబుపేటలో గురువారం పారిశుద్ధ్యంపై ప్రజలకు అవగాహన సదస్సును ఏర్పాటుచేశారు. ఈసందర్భంగా ఎంపిడిఓ మాట్లాడుతూ పారిశుద్ధ్యం లోపించకుండా ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవడం జరుగుతోందని, అంటువ్యాధులపట్ల ప్రజలు చైతన్యంగా ఉండాలన్నారు. డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, చికెన్‌గున్యా తదితర వ్యాధులు ప్రబలకుండా వైద్యులు చూడాలని, జ్వరం వచ్చిన వెంటనే వైద్యలను సంప్రదించాలన్నారు.

టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్‌లో ఎస్వీయూకు ప్రపంచ ర్యాకు

తిరుపతి, సెప్టెంబరు 22: ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 27 విశ్వవిద్యాలల్లో పనితీరు ఆధారంగా అంతర్జాతీయ సంస్థ అయిన టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ సంస్థ నిర్వహించిన సర్వేలో ఎస్వీయూకు ఉత్తమ ర్యాంకు లభించింది. 2016-17 సంవత్సరానికి గాను ప్రకటించిన ప్రపంచ ర్యాంకింగ్‌లో ఎస్వీయూ 601-800 ర్యాంకును సాధించి అగ్రస్థానంలో నిలిచింది. దీంతో భారత దేశంలోని అత్యుత్తమ విశ్వవిద్యాలయాల సరసన ఎస్వీయూ స్థానం దక్కడంతో ఎస్వీయూ వీసీ ఆచార్య ఆవుల దామోదరం, రెక్టార్ ఆచార్య భాస్కర్, రిజిస్ట్రార్ ఆచార్య దేవరాజుల నాయుడు హర్షం వ్యక్తం చేశారు.

‘పార్టీలో ప్రథమ స్థానం కార్యకర్తలకే’

రామకుప్పం, సెప్టెంబర్ 22: తెలుగుదేశం పార్టీలో ప్రథమ స్థానం కార్యకర్తలకే అని మండలాధ్యక్షుడు ఆంజనేయరెడ్డి పేర్కొన్నారు. గురువారం స్థానిక స్ర్తిశక్తి భవనంలో పార్టీ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, నేలతో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ కార్యక్రమాలకు క్రీయాశీల సభ్యత్వ గుర్తింపు కార్డుతో హాజరు కావాలన్నారు. సభ్యత్వ నమోదు కానివారు వంద రూపాయలు చెల్లించి సభ్యత్వం పొందాలన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పార్టీ బలోపేతానికి కృషి చేసి అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని తెలిపారు. కుప్పం నియోజకవర్గంలోని రామకుప్పం మండల ప్రథమ స్థానంలో సభ్యత్వ నమోదు నిర్వహించాలని కోరారు.

పల్లకిసేవలో కలిగిరి వెంకన్న

పెనుమూరు, సెప్టెంబర్ 22: మండలంలోని కలిగిరి కొండపై వెలసిన శ్రీదేవి, భూదేవి సమేత కలిగిరి వెంకటేశ్వర స్వామికి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా పెరటాసి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. గురువారం స్వామివారికి వైభవంగా పల్లకిసేవపై ఊరేగింపుకార్యక్రమం నిర్వహించారు. ఆలయప్రధాన అర్చకులు వాసుదేవాచార్యశర్మ వేదమంత్రోశ్ఛరణల మధ్యఉత్సవ మూర్తులైన శ్రీదేవి, భూదేవి కలిగిరి వెంకటేశ్వరస్వామి వైభవంగా అభిషేకాలు, అర్చనలు కార్యక్రమం నిర్వహించారు. ఈకార్యక్రమానికి ఉభయ దారులుగా పూతలపట్టు మండలం లింగాపురం గ్రామానికి చెందిన శ్రీనివాసులు కుటుంబీకులు స్వామివారికి ప్రత్యేక నైవేద్యం చెల్లించారు.

‘చట్టాలు అమలు బాధ్యత అధికారులదే’

రొంపిచెర్ల, సెప్టెంబర్ 22: చట్టాలు అమలు చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందని జిల్లా అడిషనల్ జడ్జి ఆదినారాయణ స్పష్టం చేశారు. స్థానిక పంచాయతీ కార్యాలయం ఆవరణలో గురువారం జరిగిన మండల న్యాయసేవా సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్భందవిద్య, బాలకార్మికుల నిర్మూలన, బాల్యవివాహాలు అరికట్టే చట్టాలున్నా వీటిని అరికట్టాల్సిన అధికారులు ఏమి చేస్తున్నారోఅని ప్రశ్నించారు. చట్టాలు అమలు బాధ్యత అధికారుల మీదే కాదని ప్రజలపైన కూడా ఉందని సమాజ శ్రేయస్సుకు ప్రజలు పునరంకితం కావాలని పేర్కొన్నారు.

జిల్లాలో కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేయండి

చిత్తూరు, సెప్టెంబర్ 22 : జిల్లాలో విపత్తు నివారణ చర్యల నిమిత్తం కమాండ్ అండ్ కంట్రోలు రూమ్‌లను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించారు. గురువారం సిఎం విజయవాడ నుంచి ఆయా జిల్లా కలెక్టర్లతో విడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ ఆయా జిల్లాలో ప్రస్తుతం అధిక వర్షాలు, తుఫానులు ఇతర విపత్తుల సమయంలో ప్రజలను ముందుగా అప్రమత్తులనుచేస్తే 4ప్రాణ నష్టం జరగకుండా, తక్కువ ఆస్తినష్టంతో బయట పడవేయటానికి అవకాశం ఉంటుందన్నారు.

Pages