S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్యాంకర్లు లక్ష్యాలను అధిగమించాలి-కలెక్టర్

కడప, సెప్టెంబర్ 22:జిల్లాలో రుతుపవనాలు వల్ల వర్షాలు బాగా కురుస్తుండటంతో ఈ ఏడాది ఇప్పటి వరకు రైతులు 1.75లక్షల హెక్టార్లలో పంటసాగు చేస్తున్నారని, బ్యాంకర్లు రైతులకు రుణాలందించడంలో లక్ష్యాలను 120 శాతం అధిగమించి సాధించాల్సిందిగా కలెక్టర్ కెవి సత్యనారాయణ బ్యాంకర్లకు సూచించారు. గురువారం స్థానిక కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో లీడ్ బ్యాంక్ సిండికేట్‌బ్యాంక్ ఆధ్వర్యంలో జరిగిన జిల్లా సంప్రదింపుల కమిటీ సమావేశం, జిల్లాస్థాయి సమీక్షా కమిటీ సమావేశానికి అధ్యక్షత వహించిన కలెక్టర్ మాట్లాడుతూ ఈ ఏడాది వ్యవసాయ రంగంలో 43 శాతం వృద్ధిరేటు సాధించగలమన్నారు.

చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

కమలాపురం, సెప్టెంబర్ 22: గతవారం మండలపరిధిలోని గంగవరం రోడ్డులో మోటర్‌సైకిల్‌పై వెళుతున్న తిరుపాలయ్య మరో వాహనాన్ని ఢీకొని తీవ్ర గాయాలకు గురై తిరుపతి స్విమ్స్‌లో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. తిరుపతి ఔట్‌పోస్ట్ పోలీసుల నుంచి సమాచారం అందడంతో పోస్టుమార్టం నిమిత్తం అక్కడికి వెళ్లి కేసు నమోదు చేసినట్లు పోలీసులు వివరించారు.
మహిళలకు తీవ్రగాయాలు

టీమిండియాను నెంబర్‌వన్ గా తీర్చిదిద్దడమే లక్ష్యం

మంగళగిరి, సెప్టెంబర్ 22: క్రికెట్‌లో టీం ఇండియాను నెంబర్ వన్‌గా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని జాతీయ సీనియర్ భారత క్రికెట్ జట్టు సెలక్షన్ కమిటీ చైర్మన్ మన్నవ శ్రీకాంత్ ప్రసాద్ (ఎంఎస్‌కె ప్రసాద్) అన్నారు. భారత క్రికెట్ సెలక్షన్ కమిటీ చైర్మన్‌గా ఎంపికైన సందర్భంగా ఎంఎస్‌కె ప్రసాద్‌ను గురువారం రాత్రి మంగళగిరిలో నిర్మాణంలో ఉన్న అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ప్రాంగణంలో గల క్రికెట్ అకాడమీలో ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యాన ఘనంగా సత్కరించారు. బిసిసిఐకి అనుబంధంగా ఉన్న ఆంధ్రాక్రికెట్ అసోసియేషన్ డైరెక్టర్‌గా కూడా ఎంఎస్‌కె ప్రసాద్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

పొంగిపొర్లుతున్న వాగులు

అమరావతి, సెప్టెంబర్ 22: అమరావతి-క్రోసూరు రహదారిలో జూపూడి, మునగోడు గ్రామాల మధ్య గల నక్కలవాగు, ఎద్దువాగులు ప్రమాదస్థాయిలో పొంగిపొరలి రాకపోకలకు అంతరాయం కల్గించాయి. సత్తెనపల్లి, పరిసర ప్రాంతాల్లో కురిసిన భారీవర్షాల మూలంగా ఒక్కసారిగా వాగుల ప్రవాహం పొంగిపొరలడంతో జూపూడి, మునగోడు గ్రామాలకు చెందిన ఐదుగురు రైతులు ప్రవాహంలో కొట్టుకుపోయి సమీపంలో ఉన్న చెట్లు పట్టుకుని ప్రాణాలు దక్కించుకున్నారు. సమాచారం తెలుసుకున్న వెంటనే అమరావతి సిఐ మురళీకృష్ణ, తహశీల్దార్ కర్లపాలెం శివన్నారాయణమూర్తి సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించి ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలను రప్పించారు.

వాగులు, వంకలు ఏకమై ముంచెత్తాయ

బెల్లంకొండ, సెప్టెంబర్ 22: అల్పపీడన ప్రభావంతో బుధవారం నుండి కురుస్తున్న భారీవర్షాలకు బెల్లంకొండ మండలం చిగురుటాకులా వణికింది. 8 గంటల పాటు ఏకధాటిగా కురిసిన భారీ వర్షానికి వాగులు, వంకలు, కుంటలు, చెరువులు కలిసిపోయాయి. ఈ క్రమంలో నాగిరెడ్డిపాలెం, ఊతవాగు, నాగమ్మచెరువు, మనె్నసుల్తాన్‌పాలెం, బంగారు నత్తవాగు, నందిరాజుపాలెం రెడ్డిచెరువు, మాచాయపాలెం పాపయకుంటకు గండ్లు పడ్డాయి. చింతపల్లి మేజర్ కాల్వకు గండి పడటంతో మాచాయపాలెం, ఎస్సీ, ఎస్టీ, బిసి కాలనీల్లోకి వరదనీరు భారీగా చేరింది. రెవెన్యూ, పోలీసు సిబ్బంది లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు చేర్చారు.

నీట మునిగిన యడ్లపాడు

యడ్లపాడు, సెప్టెంబర్ 22: అల్పపీడనం కారణంగా కురిసిన భారీవర్షానికి యడ్లపాడు మండలంలోని పలు గ్రామాలు నీట మునిగాయి. మండలంలోని వివిధ గ్రామాలకు వెళ్లే లింకురోడ్లు జలమయం కావడం వల్ల వాగులు పొంగుతుండటం వల్ల జాతీయ రహదారికి పడమటి వైపు గ్రామాలకు మండల కేంద్రంతో రాకపోకలు నిలిచిపోయాయి. పలు చోట్ల విద్యుత్ స్తంభాలు పడిపోయాయి. మండల పరిధిలో నక్కవాగు, ఉప్పువాగు రెండూ కలిసి పొంగడంతో జాలాది, సందెపూడి, యడ్లపాడు, కొండవీడు, సంతపేట తదితర గ్రామాలు పూర్తిగా జలమయమయ్యాయి. వివిధ గ్రామాల్లోని బిసి కాలనీల్లోకి నీరువచ్చింది. యడ్లపాడు వద్ద ఉప్పువాగు కట్ట తెగిపోవడంతో నీరు పొలాలపై పడ్డాయి.

నకరికల్లులో జనజీవనం అతలాకుతలం

నకరికల్లు, సెప్టెంబర్ 22: గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నకరికల్లు మండలం అతలాకుతలమైంది. ఇప్పటివరకు ఇంత వర్షాన్ని చూడలేదని పలువురు తెలిపారు. డివిజన్‌లోనే రికార్డు స్థాయిలో 241.4 మిమీ వర్షపాతం గురువారం ఉదయం 7.30 గంటలకు నమోదైనట్లు తహశీల్దార్ లీలా సంజీవ్‌కుమార్ తెలిపారు. గత 100 సంవత్సరాల నుండి ఇంత భారీ వర్షం కురిసినట్లు దాఖలాలు లేవని పలువురు వృద్ధులు పేర్కొన్నారు. చల్లగుండ్ల, చీమలమర్రి, కండ్లకుంట గ్రామాల్లో చెరువులకు గండ్లు పడ్డాయి. చల్లగుండ్ల చెరువుకి భారీగా గండిపడటంతో గ్రామస్థులు అప్రమత్తమై నీటిని దారి మళ్లించి గ్రామాన్ని రక్షించుకున్నారు.

వరదతో జనజీవనం అస్తవ్యస్తం

మేడికొండూరు, సెప్టెంబర్ 22: గత మూడు రోజులుగా కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షాలతో పలు గ్రామాలను వ రదనీరు చుట్టుముట్టగా... పంట పొ లాలు నీటిలో నానుతున్నాయి. గ్రామ శివారు కాలనీల్లోని గృహాల్లో నీరు ప్రవేశించింది. వరద కారణంగా గుంటూ రు- సత్తెనపల్లి రహదారిలోని మేడికొండూరు వద్ద నూతనంగా నిర్మిస్తున్న రెండు వంతెనల వద్ద తాత్కాలికంగా వేసిన అప్రోచ్ రోడ్లు తీవ్రంగా దెబ్బతిని, గండి పడింది. దీంతో ఈ రహదారిపై రాకపోకలు స్తంభించాయి. సమాచారం అందుకున్న తహశీల్దార్ డి వెంకటేశ్వర్లు, గుంటూరు అర్బన్ డిఎస్‌పి కె శ్రీనివాసరావు, సిఐ బాలాజీ సిబ్బంది, ఆర్‌అండ్‌బి అధికారులు అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.

ప్రత్యేక హోదాకు రాహుల్ సంపూర్ణ మద్ధతు

అమలాపురం, సప్టెంబర్ 22: నవ్యాంధ్ర ప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అంశంపై ఎఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో చర్చించినట్లు పిసిసి ప్రధాన కార్యదర్శి గిడుగు రుద్రరాజు తెలిపారు. గురువారం రాత్రి ఆయన కాన్పూర్ నుండి ఫోన్‌లో ఆంధ్రభూమితో మాట్లాడారు. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో జరుగుతున్న కాంగ్రెస్ పార్టీ సమావేశాల్లో రాష్ట్ర ప్రత్యేక హోదా అంశాన్ని చర్చించినట్లు గిడుగు తెలిపారు. విభజన ఫలితంగా రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఈసందర్భంగా రాహుల్‌కు వివరిస్తూ నివేధిక అందించామన్నారు.

కాళ్లవాపులపై ప్రొఫెసర్ల బృందం పరిశోధన

విఆర్ పురం, సెప్టెంబర్ 22: మండలంలో కాళ్ల వాపుల రోగుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో విశాఖపట్నం కింగ్‌జార్జి హాస్పటల్ ప్రొఫెసర్ల బృందం గురువారం రోగులపై పరిశోధన నిర్వహించారు. ఈ ప్రొఫెసర్ల బృందం స్థానిక రేఖపల్లిలోని ప్రభుత్వ వైద్యశాలను సందర్శించి, ఆసుపత్రిలో ఉన్న రోగులను పరిశీలించారు. వ్యాధి లక్షణాలు, వారి ఆహారపు అలవాట్లు తదితర వివరాలన్నింటినీ సేకరించారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ ఆఫ్ మెడిసిన్ డాక్టర్ కృష్ణమూర్తి, నెఫ్రాలజీ ప్రొఫెసర్ డాక్టర్ ప్రసాద్, మైక్రోబయాలజీ ప్రొఫెసర్ డాక్టర్ బాలమురళీకృష్ణ, ఎస్‌పిఎం డాక్టర్ దేవీ మాధవి పాల్గొన్నారు.

Pages