S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రుణాల కల్పనకు బ్యాంకులు చొరవచూపాలి:కలెక్టర్

కాకినాడ సిటీ, సెప్టెంబర్ 22: వివిధ కార్పొరేషన్‌ల ద్వారా లబ్దిదారులకు ఉపాధి యూనిట్లు, స్వయం సహాయ సంఘాల ఆర్ధిక కార్యక్రమాలు, చిన్నతరహా వ్యాపారాలు, వృత్తిదారులకు రుణాల కల్పనకు బ్యాంకులు మరింత చొరవతో ముందుకురావాలని జిల్లా కలెక్టర్ హెచ్ అరుణ్‌కుమార్ బ్యాంకర్లకు పిలుపునిచ్చారు. కలెక్టరేట్ కోర్టుహాలులో గురువారం సాయంత్రం ప్రజాప్రతినిధులు, జిల్లా ఉన్నతాధికారులు, బ్యాంకు అధికారులతో కలెక్టర్ జిల్లాస్థాయి సమీక్షా కమిటీ, జిల్లా కన్సల్టేటీవ్ కమిటీ సమావేశాలను నిర్వహించారు.

పాముకాటుతో గురుకుల పాఠశాల విద్యార్థికి అస్వస్థత

డి గన్నవరం, సెప్టెంబర్ 22: మండల పరిధిలో నరేంద్రపురం సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థి గురువారం ఉదయం తరగతిలో పాముకాటుకు గురయ్యాడు. అంబాజీపేట గ్రామానికి చెందిన బీర సురేష్ గురుకుల పాఠశాలలో 5వ తరగతి చదువుతున్నాడు. ఉదయం చదువుకునేందుకు బ్యాగ్‌లో పుస్తకాలు తీస్తుండగా పుస్తకాల మధ్యలో ఉన్న కట్లపాము కరవడంతో అస్వస్థతకు గురయ్యాడు. పాఠశాల హెల్త్‌సూపర్‌వైజయర్ బి దొరబాబు అస్వస్థతకు గురైన సుకుమార్‌కు ప్రాథమిక వైద్యం నిర్వహించి మెరుగైన చికిత్సకోసం అమలాపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు.

ఏనుగుల మహల్‌లో క్షుద్ర పూజలు

కొత్తపేట, సెప్టెంబర్ 22: కొత్తపేట శివారు ఏనుగుల మహల్ వద్ద ఒక ఇంటి వద్ద క్షుద్రపూజలు చేస్తుండగా గ్రామస్థులు వారిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. గ్రామానికి చెందిన ఒక కుటుంబానికి చెందిన వారు కపిలేశ్వరపురానికి చెందిన ఒక వ్యక్తితో కొన్ని రోజులుగా ఇంటి వద్ద పూజ చేస్తుండగా విషయం తెలుకున్న గ్రామస్థులు భయంతో వారిని పట్టుకుని నిలదీశారు. అయితే మేము కావాలనే పూజలను నేర్చుకోవడానికి ఒక వ్యక్తిని సంప్రదించామని, ఇక మీదట ఎటువంటి హానికరమైన పూజలు చేయబోమని, ఒకవేళ చేస్తే తమపై గ్రామస్థులు తీసుకోనే ఎటువంటి చర్యకైనా అభ్యంతరం లేదని గుడిలో హామీ ఇవ్వడంతో వారిని వదిలివేశారు.

రెండో రోజూ హోరాహోరీగా షటిల్ పోటీలు

కొత్తపేట, సెప్టెంబర్ 22: కొత్తపేట రెడ్డి అనసూయమ్మ ఇండోర్ షటిల్ కోర్టులో జరుగుతున్న రాష్టస్థ్రాయి అండర్ 19 బాలబాలిక షటిల్ పోటీలు రెండవ రోజు హోరాహోరీగా సాగాయి. రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి క్రీడాకారులు ఈ పోటీలల్లో పాల్గొన్నారు. ఎమ్మెల్సీ రెడ్డి సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో తొలిసారిగా కొత్తపేటలో ఈ పోటీలు జరుగుతున్నాయి. జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ సహకారంతో పోటీలను నిర్వహిస్తున్నారు.
రెండోరోజు విజేతలు వీరే

దోమలపై దండయాత్ర విజయవంతం చేయాలి

కాకినాడ రూరల్, సెప్టెంబర్ 22: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దోమలపై దండయాత్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని డిఎంఅండ్ హచ్‌ఓ చంద్రయ్య కోరారు. ఈ మేరకు ఆయన కాకినాడ రూరల్‌లోని మండల పరిషత్ కార్యాలయంలో ఉపాధ్యాయులు, పంచాయతీ కార్యదర్శులులతో జరిగిన సమీక్షలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాలు అధికంగా పడుతుండటంతో దోమల వల్ల వ్యాధులు వచ్చే అవకాశం ఉందని దీనిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం వల్ల రోగాలను తగ్గించుకోవచ్చని ఈ కార్యక్రమాలపై విద్యార్ధులచే ర్యాలీని నిర్వహించి తద్వారా ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు.

కుల ఘర్షణలతో భవిష్యత్తు నాశనం చేసుకోవద్దు: ఎస్పీ

మండపేట, సెప్టెంబర్ 22: కుల ఘర్షణలలో పాల్గొని యువత తమకు సంబంధించిన ఎంతో విలువైన భవిష్యత్తును అంధకార బంధురం చేసుకోవద్దని జిల్లా ఎస్పీ డాక్టర్ ఎం రవిప్రకాష్ హెచ్చరికతో కూడిన సూచన చేశారు. కుల ఘర్షణలలో పాలుపంచుకునేవారు ఎంతటి వారైన పోలీసు యంత్రాంగం విడిచిపెట్టదని, తీవ్ర సంఘటనలకు పాల్పడే వారిపై కేసులు బనాయించడమే కాకుండా, రౌడీషీట్లు ఓపెన్ చేస్తామని ఆయన స్పష్టం చేశారు. మండపేట పట్టణ పోలీసు ఠాణాను తనిఖీ చేసిన సందర్భంగా గురువారం స్థానిక విలేకరులతో కొద్దిసేపు మాట్లాడారు. కుల ఘర్షణల అంశంలో జిల్లాలో అమలాపురం సబ్ డివిజన్ తొలి స్థానంలో ఉండగా, రామచంద్రపురం పోలీసు సబ్ డివిజన్ మలి స్థానంలో ఉందన్నారు.

రాజమండ్రి - భద్రాచలం రోడ్డు జలమయం

కోరుకొండ, సెప్టెంబర్ 22: బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాను ప్రభావంతో కోరుకొండ మండలంలో భారీ వర్షాలు కురిసాయి. రాజమహేంద్రవరం - భద్రాచలం రోడ్డులోని గాడాల వద్ద రహదారిపైకి భారీగా నీరు చేరింది. దీంతో రహదారికి ఇరువైపులా భారీ ఎత్తున రాకపోకలు స్తంభించాయి. పలు వాహనాలు బారులుతీరి నిలిచిపోయాయి. రోడ్డుపై మొలలోతు నీరు ప్రవహించడంతో బైక్స్, ఆటోలు, బస్సులు తదితర వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. గురువారం ఉదయం నుండి వర్షం కురుస్తుండటంతో చెరువులు పొంగిపొర్లి పొలాలు నిండిపోయి రహదారులపై వరద నీరు పొంగి పొర్లుతోంది. అదే విధంగా మండలంలోని శ్రీరంగపట్నం గ్రామంలోని మోదకొండమ్మ ప్రాంతం వరద నీటిలోనే ఉంది.

రేపు తిరుపతిలో పలు ప్రాంతాల్లో నీటి సరఫరా బంద్

తిరుపతి, సెప్టెంబర్ 22: తిరుపతి నగరానికి నీటిని సరఫరాచేసే తెలుగుగంగ ప్రధాన పైప్‌లైన్‌కు అనుసంధానమైన రామాపురం పంప్ హౌస్‌లో కొత్తమోటార్లు అమర్చుతున్న కారణంగా తిరుపతి నగరంలో ఈనెల 24న నీటి సరఫరా ఉండదని ఎస్ సి సుధాకర్‌రావు గురువారం ఒక ప్రకటనలోతెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గుర్తించి తగునీటిని నిల్వ ఉంచుకోవాలన్నారు. నీరు అవసరమైన వారికి ట్యాంకర్ల ద్వారా సరఫరాచేస్తామని ఇతర వివరాలకోసం అధికారులను సంప్రదించాలన్నారు.

మన్నవరం బెల్ ప్రాజెక్టు పనులు నెలలోపు ప్రారంభించకుంటే ప్రజా ఉద్యమం

ఏర్పేడు, సెప్టెంబర్ 22: చిత్తూరు, నెల్లూరు, కడపజిల్లాల్లోని ప్రజలు, రైతులు, నిరుద్యోగులకు ఎంతగానో మేలుచేసే మన్నవరం భెల్ ప్రాజెక్టు కు సంబంధించిన రెండోదశ పనులను నెలలోపు ప్రారంభించకపోతే గ్రామస్థాయిలో ప్రజలను చైనత్యం చేసి ఉద్యమిస్తానని, తిరుపతిలో సభ కూడా ఏర్పాటుచేస్తానని తిరుపతి మాజీ ఎంపి చింతామోహన్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను తీవ్రస్వరంతో హెచ్చరించారు.

అక్టోబర్ 23న ఏడు కొండల పరుగుపందెం

తిరుపతి, సెప్టెంబర్ 22: తిరుపతిలో అక్టోబర్ 23న ఏడుకొండలు పరుగుపందెం (సెవన్‌హిల్స్ మారథాన్) రాత్రి సమయంలో నిర్వహించడానికి సంబంధిత అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు మారధాన్ అధికారి సుశాంత్ సుబుధి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈకార్యక్రమంలో వివిధ దేశాల ప్రతినిధులు పాల్గొంటారని ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హాజరవుతారన్నారు. రాత్రి సమయంలోఈ పరుగుపందెం నిర్వహించడం ప్రపంచంలోనే ఇది రెండవదన్నారు. మొదటిది ఈ సంవత్సరం జూలై 2న సీ ఎం ఆధ్వర్యంలో విశాఖపట్టణంలో నిర్వహించామన్నారు. కాగా అక్టోబర్ లో నిర్వహించనున్న పరుగుపందెంలో 10కె, 5కె, 3కె నిర్వహిస్తామన్నారు.

Pages