S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆధుర్దా... అనర్థాలకు కారణం

ఇవాళా రేపు ఆధునిక జీవితంలో చేసే పనులకన్నా ఆలోచనలు ఎక్కువయిపోతున్నాయి. అనవసరపు ఆలోచనలతో మానసిక వత్తిడి పెరుగుతుంది. ఈ మానసిక వత్తిడే చాలా అనారోగ్య సమస్యలకు కారణవౌతుంది. వత్తిడితో మనిషి వ్యక్తిత్వమే మారిపోతుంది. మనిషిలోని ఉద్రేకాల్ని వత్తిడి అణుస్తుంటుంది. దాంతో ఆ వ్యక్తి మానసికంగానే కాదు, శారీరకంగా కూడా వత్తిడికి లోనై కడుపులో పుండ్లు, మైగ్రేన్ తలనొప్పులు, ఆహారనాళ సమస్యలు, అధిక రక్తపోటు, పక్షవాతం, గుండెపోటులాంటి వాటికి లోనవుతున్నాడు. కొందరిలో వత్తిడి క్రమంగా ఉండటంతో ఈ ఇబ్బందులొస్తుంటాయి. అంతేకాదు, రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. దాంతో ఇన్‌ఫెక్షన్స్ ఎదుర్కొనే శక్తి తగ్గుతుంది.

-డా.పి.సి.పి.గుప్త. సైక్రియాటిస్ట్, మానసిక చికిత్సాలయం, హైదరాబాద్..9848063547

స్థూలకాయం తగ్గటానికి పాలు, పెరుగు (మీకు మీరే డాక్టర్)

ప్ర: పాలు స్థూలకాయాన్ని పెంచుతాయా? స్థూలకాయం తగ్గటానికి ఇంట్లో దొరికే ఉపాయాలు సూచించగలరు?
జె.శారద రమణ, విశాఖపట్టణం
జ: శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు. మన శరీరంలో శివుడు మెదడే! మెదడు ఆజ్ఞ లేకుండా శరీరం ఏ మాత్రం స్పందించదు. మనం ఏదైనా తినాలనుకున్నా, మానాలనుకున్నా మెదడు చెప్తేనే జరుగుతుంది. శరీరం మీద మెదడు కట్టడి గొప్పది. చాక్లెట్లు, కేకులు, పిజ్జాల్లాంటి ఎక్కువ కేలరీలున్న ఆహారాన్ని తినాలనే ‘యావ’ మెదడువలనే కలుగుతుంది. మెదడు వద్దని చెప్తే బుట్టెడు బూరెలు ఎదురుగా ఉన్నా చెయ్యి వాటిమీదకు వెళ్లదు.

డా జి.వి.పూర్ణచందు, సుశ్రుత ఆయుర్వేదిక్ హాస్పిటల్, సత్యం టవర్స్, 1వ అంతస్థు, బకింగ్‌హాంపేట, పోస్ట్ఫాసు ఎదురు, గవర్నర్‌పేట, విజయవాడ-500 002. సెల్: 9440172642, purnachandgv@gmail.com

6-7-2016

సినిమా అంటే గ్లామరే కాదు

‘సినిమాలో నటించడం అంటే కేవలం గ్లామర్‌ను చూపించడమే కాదు. మనకు ఏ పాత్రలు సూట్ అవుతాయో వాటిని ఎంచుకుని నటించాలి. ఆ విషయంలో నేను పూర్తి విశ్వాసంతో వుంటాను’ అని నటి సురభి తెలిపారు. నాని కథానాయకుడిగా మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో రూపొందిన ‘జెంటిల్‌మన్’ చిత్రం విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో కథానాయికలుగా సురభి, నివేదా థామస్ నటించారు. సురభిని చిత్ర విశేషాలు గూర్చి చెప్పమంటే ఇలా చెప్పారు..
నాని రికమెండ్ చేస్తేనే...

-శ్రీ

రథయాత్ర

అనంతుడు, అనంతనామధారుడు, వ్యాప్తుడు, సర్వరక్షాకరుడు, దుర్లభుడు, సులభుడు, సంగతుడు, నిస్సంగతుడు, నిరాకారుడు, ఆకారుడు, ఇట్లా ఎనె్నన్ని విశేషణాలకు ఆధారభూతుడైన సర్వసాక్షి పరదైవం తన్ను తాను తన భక్తులకోసం అనేకవిధాలుగా, అనేక రూపాలుగా సృజియించుకుంటూ ఉంటాడు. అట్లా తన్ను తానుసృజియించుకునే భగవంతుడు వస్తువులోను, అవస్తువులోను తానే ఉన్నాడన్న సత్యాన్ని మరోసారి నిరూపించడానికి కోసం తన్ను దారువులో చెక్కమని చెప్పిన వాడు అన్నింటికీ కారణమైన వాడు తన మాటను వినలేదన్న కినుకతో సగం సగం పూర్తిఅయిన రూపాలతోనే పూరీ క్షేత్రంలో జగాలనేలే జగన్నాథుడిగా స్థిరపడ్డాడు.

- నాగలక్ష్మి

హరివంశం 177

నీపై ఎవరూ దండెత్తి రాలేరు. వస్తే మళ్లీ తిరిగిపోలేరు. నినె్నవరూ జయించలేరు అని వరమిచ్చాడు. ఇక శోణపురి రాజధానిగా బాణుడు సకల రాక్షస చక్రవర్తిగా మహావిభవంతో ఉంటూ వచ్చాడు. కుమారస్వామికి కూడా బాణుడిపై ప్రేమ కలిగి దివ్య మయూరాన్ని అతడికి వాహనంగానూ, అతడి ధ్వజ చిహ్నంగానూ ఉండేట్లు అనుగ్రహించాడు.
పరమ శివుడే తనను పుత్రుడిగా స్వీకరించాడు కాబట్టి బాణుడికి త్రిలోకాలలో ఎవరూ వైరులు లేకపోయినారు. సురగరుడోరగ యక్ష రాక్షస గంధర్వ సిద్ధ సాధ్యులంతా అతడికి తలవంచారు. బాణుడిపై దండెత్తిరాగలవారు కాని, బాణుడు దండెత్తిపోవలసినవారు కాని ఈరేడు లోకాలలో ఎవరూ లేకపోయినారు.

-అక్కిరాజు రమాపతిరావు

మహేశ్‌తో 100 కోట్ల సినిమా?

బాహుబలి సినిమాతో స్ఫూర్తిపొందిన చాలామంది దర్శకులు ఇప్పుడు అదే స్థాయిలో భారీ సినిమాల్ని అందించడానికి అడుగులు వేస్తున్నారు. ఈ రేసులో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సినిమాలు చేస్తూ విజయాల్ని సాధిస్తున్న తమిళ దర్శకుడు సుందర్.సి ముందున్నారు. కొంతకాలంగా ఓ చారిత్రాత్మక చిత్రాన్ని తెరకెక్కించాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ భారీ ప్రాజెక్టు బడ్జెట్ అక్షరాలా 100 కోట్లు. ఇంత భారీ మొత్తం బడ్జెట్‌ని పెట్టి సినిమా చేయడానికి తమిళ నిర్మాణ సంస్థ తేనాండాళ్ ఫిల్మ్స్ సుందర్.సికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేసింది. దీన్ని తమిళ, తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కించాలని సుందర్.సి ప్లాన్ చేస్తున్నాడు.

యువర్స్ లవింగ్లీ 12

రోడ్డుమీద వేగంగా దూసుకుపోతున్న కార్లనీ స్కూటర్లనీ తప్పించుకుంటూ రోడ్ క్రాస్ చేసి బస్టాప్ దగ్గరకొచ్చి నిలబడింది హరిత.
యవ్వనం తాలూకు నిగారింపుతో మెరుస్తున్న పచ్చని శరీర వర్ణం.. పల్చని చెంపలు, అమాయకత్వాన్ని దాచుకోలేని ఆల్చిప్పల్లాంటి కళ్ళూ, చూసిన వాళ్ళెవరినీ ఆమె ముఖం మీద నుంచి చూపు తప్పించుకోనీయకుండా చేస్తే, ఆ ఆకర్షణ నుంచి తప్పించుకుని చూపులు క్రిందికి దింపగల ధీరోదాత్తుడెవరైనా వుంటే అంతటి అదృష్టవంతుడింకెవరూ వుండరనిపించేలా వుంటుంది ఆమె శరీరాకృతి!

వరలక్ష్మి మురళీకృష్ణ

నాయకి వస్తోంది..

త్రిష ప్రధాన పాత్రలో గిరిధర్ ప్రొడక్షన్స్ హౌస్ పతాకంపై గోవి దర్శకత్వంలో గిరిధర్ మామిడిపల్లి, పద్మజ మామిడిపల్లి రూపొందించిన ‘నాయకి’ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకొని ఈనెల 15న విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ- తెలుగు తమిళ భాషల్లో రూపొందిన ఈ చిత్రాన్ని మొదట 8న విడుదల చేయాలనుకున్నా, తమిళంలో ఎదురైన సాంకేతిక కారణాలవల్ల రెండు భాషల్లోనూ 15న విడుదల చేయడానికి నిర్ణయించామని, ఈ సినిమాకు సంబందించిన టీజర్‌కు, ఆడియోకు మంచి స్పందన లభిస్తోందని, ముఖ్యంగా త్రిష పాడిన పాటకు ఆదరణ బాగా వుందని అన్నారు.

Pages