S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీర్కూర్‌ను నిజామాబాద్‌లోనే ఉంచాలి

బీర్కూర్, జూలై 5: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనా సౌలభ్యం కోసం చేపట్టిన నూతన జిల్లాల ఏర్పాటులో భాగంగా బీర్కూర్ మండలాన్ని కామారెడ్డి జిల్లాలో కలుపకుండా, నిజామాబాద్‌లోనే కొనసాగించాలని జిల్లా గ్రంథాలయ సంస్థ దివిటి శ్రీనివాస్‌యాదవ్ కోరారు. బీర్కూర్‌ను నిజామాబాద్‌లోనే కొనసాగించాలని బీర్కూర్-2 ఎంపిటిసి సభ్యుడు సుధాకర్‌యాదవ్ స్థానిక తహశీల్ కార్యాలయం ఎదుట చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షా శిబిరాన్ని మంగళవారం శ్రీనివాస్‌యాదవ్ సందర్శించి సంఘీభావం ప్రకటించారు.

ఎముకలు.. అనారోగ్యాలు

ఎముకలు ఎంత గట్టిగా కనిపిస్తున్నా వాటికీ ఇన్‌ఫెక్షన్స్ వస్తాయి. అలాంటి వాటిలో ఆస్టియోమైలైటిస్ ఒకటి. ఇది చాలా అరుదుగా వచ్చే ఎముకల ఇన్‌ఫెక్షన్. బయటికి తెరుచుకున్న గాయంలోంచి వచ్చే బాక్టీరియాతో ఈ ఇన్‌ఫెక్షన్ వస్తుంది. రక్తం ద్వారా ఈ ఇన్‌ఫెక్షన్ ఎక్కడికైనా వ్యాపింపవచ్చు. ఆస్టియోమైలైటిస్ వచ్చిన ప్రాంతాలు ఎర్రబడవచ్చు. ఆ అవయవాన్ని ఉపయోగించం కష్టమవుతుంది. ఆ ప్రాంతంలో నొప్పి, జ్వరం లాంటి లక్షణాలు కనిపిస్తాయి.
యాంటీబయాటిక్స్ వాడి ఈ ఇన్‌ఫెక్షన్ కంట్రోల్ చేయవచ్చు. సాధ్యమైనంత త్వరగా చికిత్స అవసరం. ఆలశ్యమైనకొద్దీ ఇన్‌ఫెక్షన్ వ్యాపించి చికిత్స కష్టమవుతుంది. శస్త్ర చికిత్స అవసరం కావచ్చు.

-డా సాయి లక్ష్మణ్ ఆర్థోపెడిక్ సర్జన్, కిమ్స్.. 9704500909

ఒకే రోజు లక్ష మొక్కలు నాటాలి

నవీపేట, జూలై 5: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న హరితహారం కార్యక్రమంపై డిఎల్‌పిఓ శ్రీకాంత్ మంగళవారం నవీపేట మండల పరిషత్ కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ నెల 8వ తేదీ నుండి ప్రారంభమయ్యే హరితహారం కార్యక్రమానికి మండలంలోని ప్రతి గ్రామంలో 6, 7వ తేదీల్లోగా గుంతలు తవ్వించి సిద్ధంగా ఉంచాలని ఇజిఎస్ అధికారులకు సూచించారు. పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రార్థనా మందిరాలు, మైదానాలు, రోడ్లకు ఇరువైపులా ఉపాధి హామీ కూలీలతో గుంతలు తీయించి సిద్ధంగా ఉంచేలా ఫీల్డ్‌అసిస్టెంట్లకు ఆదేశాలు జారీ చేయాలని ఎపిఓకు సూచించారు.

క్రమేపీ పెరుగుతున్న నీటిమట్టం

బాల్కొండ, జూలై 5: రాష్ట్రంలోని భారీ ప్రాజెక్టుల్లో ఒకటైన బాల్కొండ మండలం శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నీటిమట్టం క్రమేపీ పెరుగుతోంది. రిజర్వాయర్ ఎగువ జిల్లాలైన నిజామాబాద్, ఆదిలాబాద్, నాందేడ్ జిల్లాల్లో కురిసిన వర్షం కారణంగా ప్రాజెక్టులోకి 1500 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతోందని, దీంతో మంగళవారం సాయంత్రానికి రిజర్వాయర్ నీటిమట్టం 1048.20 అడుగులు 5.25 టిఎంసిల వద్దకు చేరుకుందని ఎఇ మహేందర్ తెలిపారు. రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091.00 అడుగులు 90 టిఎంసిలు కాగా, గత సంవత్సరం ఇదే రోజున రిజర్వాయర్ నీటిమట్టం 1057.80 అడుగులు 11.34 టిఎంసిల వద్ద నీరు నిల్వ ఉన్నట్లు ఎఇ తెలిపారు.

విపత్తుల నివారణకు సన్నద్ధతే కీలకపాత్ర

డిచ్‌పల్లి రూరల్, జూలై 5: విపత్తులు సంభవించిన సమయంలో అవలంభించాల్సిన పద్ధతుల గురించి తెలియజేసేందుకు మంగళవారం డిచ్‌పల్లిలోని తెలంగాణ విశ్వవిద్యాలయంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందం సభ్యులు హాజరై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ వర్శిటీ ఇంచార్జ్ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వై.జయప్రకాశ్‌రావు మాట్లాడుతూ, విపత్తుల నివారణలో ప్రజలందరూ భాగస్వాములు కావాల్సిన అవసరం ఉంటుందన్నారు. విపత్తులపై ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలన్నారు. విపత్తుల నివారణలో సన్నద్ధతే కీలకపాత్ర పోషిస్తుందని ఆయన పేర్కొన్నారు.

అభివృద్ధిలో యువత భాగస్వామి కావాలి

మోర్తాడ్, జూలై 5: దేశ సమగ్ర అభివృద్ధిలో యువత అంకితభావంతో భాగస్వాములు కావాలని ఆర్‌ఎస్‌ఎస్ తెలంగాణ రాష్ట్ర భౌద్ధిక్ బూర్ల దక్షిణామూర్తి పిలుపునిచ్చారు. మోర్తాడ్ మండలం గుమ్మిర్యాల్‌లో మంగళవారం గుమ్మిర్యాల శాఖ ఆధ్వర్యంలో గురుపూజోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన దక్షిణామూర్తి మాట్లాడుతూ, ఆర్‌ఎస్‌ఎస్‌లో గురువుగా వ్యక్తిని కాకుండా హిందుత్వానికి విజయ చిహ్నం అయిన కాషాయ పతాకానే్న స్వీకరించడం జరిగిందన్నారు.

యాంటాసిడ్స్ వల్ల లాభమా? నష్టమా?

సరిగ్గా వాడినపుడు మంచి ఫలితాన్నిస్తుంది. అలాగని ఇష్టం వచ్చినట్లు వాడితే ఫలితాలు విపరీతంగానే వుంటాయి. కాల్షియం కార్బొనేట్ యాంటాసిడ్స్ త్వరగా విముక్తినిస్తాయి. కడుపులో కుళ్ళు ఉన్నవారికి ఈ యాంటాసిడ్స్‌ను వైద్యులు సాధారణంగా ఇవ్వరు. సోడియం వున్నటువంటి యాంటాసిడ్స్‌ను ఉప్పును ఆహారంగా తీసుకోవటంపట్ల నిషేధం ఉన్నవాళ్ళు తీసుకోకూడదు. ఎక్కువ కాలంనుంచి యాసిడ్ సమస్యతో బాధపడేవాళ్ళు టాబ్లెట్స్‌రూపంలో కన్నా ద్రవ రూపంలో ఉన్న యాంటాసిడ్స్ తీసుకోవడం మంచిది. కొన్ని యాంటాసిడ్స్‌తో అజీర్ణం కలుగుతుంది. మరికొన్ని యాంటాసిడ్స్‌తో విరోచనాలు కలుగుతాయి. కాబట్టి సమస్యలకు తగిన యాంటాసిడ్స్‌ని ఎంపిక చేసుకోవడం అవసరం.

-డా.గోవింద్ ఆర్.వర్మ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, పేస్ హాస్పిటల్స్, 8885095601

అలంకారప్రాయంగా ‘ఎత్తిపోతలు’

మోర్తాడ్, జూలై 5: మోర్తాడ్ మండలంలోని పాలెం, తొర్తి గ్రామాల సాగునీటి సమస్యను పరిష్కరించేందుకు చేపట్టిన ఎత్తిపోతల పథకాలు అలంకారప్రాయంగా మిలిగిపోతున్నాయి. దాదాపు మూడున్నర కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన ఈ పథకాలను నిర్వహించేందుకు పూర్తిస్థాయి కమిటీలు కూడా లేకపోవడంతో ప్రస్తుతం ఆ రెండు పథకాలు రైతులకు ఎండమావులే అయ్యాయి. పాలెం, తొర్తి శివార్ల గుండా ప్రవహించే పెద్దవాగులో 9సంవత్సరాల క్రితం అప్పటి ప్రభుత్వం ఎత్తిపోతల పథకాన్ని చేపట్టింది. కోటీ 90లక్షలతో పాలెం, కోటీ 70లక్షలతో తొర్తి ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టిన ప్రభుత్వం, పనులను కూడా సకాలంలోనే పూర్తి చేసింది.

హరితహారంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి

నిజామాబాద్, జూలై 5: జిల్లాలో ఈ నెల 8వ తేదీ నుండి ప్రారంభమయ్యే తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులతో పాటు ప్రతి ఒక్కరు ఉత్సాహంగా పాల్గొని జయప్రదం చేయాలని కలెక్టర్ డాక్టర్ యోగితారాణా పిలుపునిచ్చారు. మంగళవారం ప్రగతి భవన్ సమావేశ మందిరంలో హరితహారం కార్యక్రమంపై జిల్లాస్థాయి చేంజ్ ఏజెంట్లతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ హరితహారం కార్యక్రమానికి వర్షాలు అనుకూలంగా ఉండటం సంతోషించదగ్గ విషయమన్నారు. జూలై 22నాటికి పూర్తిస్థాయిలో మొక్కలు నాటేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలని ఆమె కోరారు.

హరితహారానికి సర్వం సన్నద్ధం

నిజామాబాద్, జూలై 5: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న తెలంగాణ హరితహారం కార్యక్రమాన్ని ఉద్యమ స్ఫూర్తితో చేపట్టి విజయవంతం చేసేందుకు జిల్లా యంత్రాంగం సన్నద్ధమైంది. ఈ నెల 8వ తేదీ నుండి మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుండగా, మొత్తం 3.35కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఈ మేరకు పకడ్బందీగా ప్రణాళికలు రూపొందిస్తూ, వివిధ వర్గాల వారిని భాగస్వాములు చేయనున్నారు.

Pages