S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నగదు రహిత ప్రజా పంపిణీ

విజయవాడ, మే 14: భారతదేశంలోనే తొలిసారిగా కృష్ణా జిల్లాలో నగదురహిత ప్రజా పంపిణీ వ్యవస్థను ప్రధాన మంత్రి ముఖ్య ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రహ్మణ్యన్ శనివారం లాంఛనంగా ప్రారంభించారు. బాపులపాడు మండలం ఆరుగొలను గ్రామంలో ప్రియాంక మహిళ గ్రూప్ సభ్యులు నడుపుతున్న చౌకధరల దుకాణంలో తెల్లకార్డుదారు ఇంట రవికుమార్‌కు 25కిలోల బియ్యాన్ని ఆధార్ డైరెక్టర్ జనరల్ అజయ్ భూషణ్ పాండేతో కలసి నగదు రహిత విధానంలో అందజేశారు.

రేపు ఏపి ఐసెట్

విశాఖపట్నం, మే 14: ఎంసిఎ, ఎంబిఎ కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించి ఎపిఐసెట్-2016ను ఈనెల 16న నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రాష్ట్రంలో 138 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించనున్న ఈ పరీక్షకు 72,065 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. పరీక్ష కీ ఈ నెల 23న , ఫలితాలు 27న విడుదల చేస్తామని ఎపిఐసెట్ కన్వీనర్ ఆచార్య రామమోహనరావు తెలిపారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో శనివారం ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ పరీక్ష ఉదయం 10 గంటల నుంచి 12.30 గంటల వరకు జరుగుతుందన్నారు.

27న కృష్ణా బోర్డు భేటీ

హైదరాబాద్, మే 14: ఆంధ్ర, తెలంగాణ మధ్య కృష్ణా జలాల పంపకం, కృష్ణా నదిపై నిర్మిస్తున్న ప్రాజెక్టులపై నెలకొన్న వివాదాలను పరిష్కరించేందుకు కృష్ణా బోర్డు ఈ నెల 27వ తేదీన హైదరాబాద్‌లో సమావేశం కానుంది. ఈ సమావేశానికి రెండు రాష్ట్రాల్లో కృష్ణా నదిపై నిర్మించిన ప్రాజెక్టుల్లో నీటి లభ్యత, ఇంతవరకు వినియోగించుకున్న జలాలు, భవిష్యత్తు అవసరాలపై నివేదికలతో రావాలని కృష్ణా బోర్డు కోరింది. ఈ నేపథ్యంలో ఆంధ్ర, తెలంగాణ రాష్ట్ర భారీ సాగునీటిపారుదల శాఖలు తమ వాదనలు వినిపించేందుకు సమాయత్తమవుతున్నాయి.

ఢిల్లీ పర్యటనపైనే బాబు దృష్టి

విజయవాడ, మే 14: ఏపి సిఎం చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటన ముగించుకుని శనివారం రాత్రి హైదరాబాద్ చేరుకున్నారు. ఆయన ఆదివారం విజయవాడకు వస్తున్నారు. వచ్చిన వెంటనే ఆర్థిక శాఖ సహా పలు ముఖ్య శాఖల అధికారులు, మంత్రులతో సమావేశమవనున్నారు. బిజెపి జాతీయ కార్యదర్శి, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ సిద్దార్థనాథ్ సింగ్ శుక్రవారం విజయవాడలో మాట్లాడుతూ హోదా గురించి చంద్రబాబు కేంద్రాన్ని అడగలేదని స్పష్టం చేశారు. అంతేకాకుండా, కేంద్రం ఇచ్చిన నిధులపై శే్వతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సిద్దార్థనాథ్ సింగ్ ప్రకటనను టిడిపి జీర్ణించుకోలేకపోతోంది.

మరో రెండు కేసుల్లో ‘అగ్రిగోల్డ్’

హైదరాబాద్, మే 14: అగ్రిగోల్డ్ కేసులో అరెస్టయి జైలులో ఉన్న నిందితులకు ఏలూరు కోర్టు బెయిల్ ఇవ్వడంతో డిపాజిట్‌దారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సిఐడి చీఫ్ ద్వారకా తిరుమలరావు చెప్పారు. ఈ కేసు దర్యాప్తును ముమ్మరం చేశామని, మదనపల్లి, రాజమండ్రిలో కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, ఈ కేసుల్లో నిందితులను అరెస్టు చేసి విచారించాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. ప్రస్తుతం నెల్లూరు, ఏలూరు పోలీసు స్టేషన్లలో నమోదైన కేసులను దర్యాప్తు చేసి వారిని అరెస్టు చేశామన్నారు.

జెఏసి కార్యకలాపాలపై సిబిఐ విచారణ

హైదరాబాద్/ చార్మినార్, మే 14: హెచ్‌సియులో సామాజిక న్యాయం పేరుతో ఏర్పాటైన సంయుక్త కార్యాచరణ కమిటి (జెఏసి) కార్యకలాపాలపై సిబిఐ విచారణ జరిపించాలని ఎబివిపి డిమాండ్ చేసింది. పరిశోధన విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య అంశంలో తప్పుడు ప్రచారం చేస్తున్న జెఏసి వ్యవహార శైలిపై లోతుగా సిబిఐ దర్యాప్తు చేపట్టాలని కోరింది. హెచ్‌సియు ఎబివిపి అధ్యక్షుడు పల్సానియ, ప్రధాన కార్యదర్శి కుమార్‌నాయక్, హరిత, సుశీల్‌కుమార్, కిరణ్ గుండాల, భానుప్రతాప్‌సింగ్ తదితరులు శనివారం విలేఖరుల సమావేశంలో మాట్లాడారు.

అహంకారమే అనర్థాలకు మూలం

ఉజ్జయిని, మే 14: భూతాపం, ఉగ్రవాదం ప్రపంచం ఎదుర్కొంటున్న అతిపెద్ద ప్రమాదాలని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ‘నీకన్నా నేనే ఎక్కువ గొప్పవాడిని’ అనే అహంకార వైఖరే వీటివెనుక ప్రధాన కారణంగా కనిపిస్తోందని అన్నారు. ఇక్కడ జరుగుతున్న సింహస్థ కుంభమేళా సందర్భంగా శనివారం ‘లివింగ్ ది రైట్ వే’ అనే అంశంపై ఏర్పాటు చేసిన మూడు రోజుల అంతర్జాతీయ సదస్సు ముగింపు కార్యక్రమంలో ప్రధాని ప్రసంగించారు. ‘ప్రపంచం ఇప్పుడు రెండు రకాల సంక్షోభాలను ఎదుర్కొంటోంది. వాటిలో ఒకటి భూతాపం కాగా, రెండోది ఉగ్రవాదం. వీటికి పరిష్కారం ఏమిటి? వీటి పుట్టుక వెనుక కారణాలేమిటి?

మూడు రాష్ట్రాల్లో ప్రచారానికి తెర

చెన్నై/తిరువనంతపురం, మే 14: ఈ నెల 16న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం శనివారంతో ముగిసింది. దీంతో అయిదు రాష్ట్రాల్లో దాదాపు రెండు నెలలపాటు సాగిన సుదీర్ఘ ఎన్నికల ప్రక్రియకు తెరపడినట్లయింది. కేరళలో అధికార కాంగ్రెస్ నేతృత్వంలోని యుడిఎఫ్, సిపిఎం నేతృత్వంలోని ఎల్‌డిఎఫ్ మధ్య ప్రధానంగా పోటీ జరుగుతోంది.

ట్రంప్ అభ్యర్థిత్వానికి రిపబ్లికన్ నేతల ఆమోదం

వాషింగ్టన్, మే 14: అమెరికాలో రిపబ్లికన్ పార్టీ క్రమేణా డొనాల్డ్ ట్రంప్ వైపు మొగ్గు చూపుతోంది. అధ్యక్ష ఎన్నికల్లో బరిలోకి దిగిన రిపబ్లికన్ పార్టీ అభ్యర్థుల్లో అందరికంటే ముందున్న డొనాల్డ్ ట్రంప్ అభ్యర్థిత్వాన్ని ప్రతినిధుల సభలోని తొమ్మిది పార్లమెంటరీ కమిటీల చైర్మన్లు ఆమోదించడం ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. ‘జీవిత కాలంలోనే అత్యంత ముఖ్యమైన ఈ ఎన్నికల్లో మేము ఏటవాలు శిఖరంపై నిలబడి ఉన్నాం. అమెరికా అధ్యక్ష భవనం ‘వైట్ హౌస్’తో పాటు పార్లమెంట్ మరో ఎనిమిదేళ్లు డెమోక్రటిక్ పార్టీ ఆధీనంలో ఉండటాన్ని ఈ దేశం భరించలేదు.

జర్నలిస్టులకు రక్షణ కల్పించండి

న్యూఢిల్లీ, మే 14: బిహార్, ఉత్తరప్రదేశ్‌లలో ఇద్దరు జర్నలిస్టుల హత్యలను ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (పిసిఐ) తీవ్రంగా ఖండించింది. జర్నలిస్టుల రక్షణకు ప్రత్యేక చట్టాన్ని రూపొందించాలని, వారిపై జరిగే దాడుల కేసులను ఫాస్ట్‌ట్రాక్ కోర్టుల్లో విచారించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. జర్నలిస్టులపై జరుగుతున్న దాడుల కేసుల్లో 96 శాతం కేసులు కొలిక్కిరావడం లేదని పిసిఐ చైర్మన్ జస్టిస్ (రిటైర్డ్) చంద్రవౌళి కుమార్ ప్రసాద్ ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు.

Pages