S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘2 బిలియన్ డాలర్ల రక్షణ ఎగుమతులు లక్ష్యం’

న్యూఢిల్లీ, మే 14: రాబోయే రెండేళ్లలో భారత రక్షణ రంగ ఎగుమతులను 2 బిలియన్ డాలర్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ తెలిపారు. ప్రస్తుతం ఇవి 330 మిలియన్ డాలర్లకుపైగా ఉన్నట్లు శనివారం ఇక్కడ జరిగిన ఓ సెమినార్‌లో మాట్లాడుతూ చెప్పారు. కాగా, కీలకమైన రక్షణ రంగంలో వ్యూహాత్మక భాగస్వామ్యాలపై చాలామంది విఐపిలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని అన్నారు. దీనిపై పెద్ద ఎత్తున తనకు లేఖలు కూడా వచ్చినట్లు చెప్పారు. దీనిపై అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటామన్నారు.

మరిన్ని కొత్త ఎయిర్‌పోర్టులు కావాలి

ద్వారకాతిరుమల, మే 14: దేశ విస్తీర్ణానికి తగ్గట్లుగా ఎయిర్ పోర్టులు లేవని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు అన్నారు. హైదరాబాద్, బెంగ ళూరు, ఢిల్లీల్లో మాత్రమే మోడరన్ ఎయిర్‌పోర్టులు ఉన్నాయని, తూర్పులో రెండు, పశ్చిమలో మరో రెండు కొత్త ఎయిర్‌పోర్టులు కావాల్సిన అవసరముందన్నారు. కొత్తవాటికోసం మహారాష్ట్ర ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నారని, అదే బాటలో ఏపి వెళ్ళాలని సూచించారు. కాగా, విశాఖపట్నం వద్ద ఉన్న భోగాపురం ఎయిర్‌పోర్టును మరింత అభివృద్ధి చేసి, అంతర్జాతీయ ఎయిర్‌పోర్టుగా తీర్చిదిద్దేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నట్టు చెప్పారు.

విదేశీ సంస్థల పెత్తనం తగ్గాలి

విజయవాడ, మే 14: దేశం ఆర్థికంగా అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ నిరక్షరాస్యుల నుంచి సైతం పొదుపును సేకరించడంలో ప్రభుత్వరంగ జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసి) దూసుకెళ్తోందని, దేశ ఆర్థిక వ్యవస్థకు వెనె్నముకగా నిలుస్తోందని బీమా ఉద్యోగుల సంఘం జాతీయ అధ్యక్షుడు అమానుల్లా ఖాన్ అన్నారు. అలాంటి ఈ సంస్థను కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తోందన్నారు. విదేశాల్లో దివాలా తీసిన బీమా సంస్థలకు నేడు భారీ పెట్టుబడుల ద్వారా దేశంలో స్థావరం ఏర్పాటు చేసుకోవటానికి కేంద్రం ఊతమిస్తుండటం బాధాకరమన్నారు.

7.7 శాతం

న్యూఢిల్లీ, మే 14: భారత జిడిపి వృద్ధిరేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2016-17)లో గత ఆర్థిక సంవత్సరం (2015-16)తో పోల్చితే స్వల్పంగా పెరిగి 7.7 శాతంగా ఉండొచ్చని ఎన్‌సిఎఇఆర్ అంచనా వేసింది. భారత వాతావరణ శాఖ ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగానే కురుస్తాయని చెప్పడమే దీనికి కారణంగా ఆర్థిక విశే్లషణల దిగ్గజం ఎన్‌సిఎఇఆర్ పేర్కొంది. దేశ వ్యవసాయ రంగం వర్షాధారమన్నది తెలిసిందే. ఈ నేపథ్యంలో గత రెండేళ్ళుగా సాధారణం కంటే తక్కువగా కురిసిన వర్షాలతో తీవ్ర కరవు పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో ఈ ఏడాది వర్షాలు సాధారణం కంటే ఎక్కువగా పడతాయన్న అంచనాలు నిజమైతే దేశ జిడిపి వృద్ధి పురోగమించగలదని ఎన్‌సిఎఇఆర్ అభిప్రాయపడింది.

విశాఖలో సముద్ర ఉత్పత్తుల అంతర్జాతీయ సదస్సు

విశాఖపట్నం, మే 14: విశాఖ నగరం మరో అంతర్జాతీయ సదస్సు నిర్వహణకు వేదిక కానుంది. కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ పరిధిలోగల సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల అభివృద్ధి సంస్థ (మెరైన్ ప్రొడక్ట్స్ ఎక్స్‌పోర్టు డెవలప్‌మెంట్ అథారిటీ లేదా ఎంపెడా) ఆధ్వర్యంలో ఈ ఏడాది సెప్టెంబర్ 23 నుంచి 25 వరకు మూడు రోజులపాటు అంతర్జాతీయ సదస్సు నిర్వహించాలని నిర్ణయించారు. సుదీర్ఘ తీరప్రాంతం కలిగిన ఆంధ్రప్రదేశ్‌లో విశాఖపట్నం నగరానికి ప్రత్యేకత ఉంది. ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో భాగస్వామ్య సదస్సు (బిజినెస్ సమ్మిట్), ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ (ఐఎఫ్‌ఆర్) విజయవంతంగా నిర్వహించిన ఘనత దక్కించుకుంది విశాఖపట్నం.

సిక్సర్ల హోరు

బెంగళూరు: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ, ఎబి డివిలియర్స్ కలిపి మొత్తం 20 సిక్సర్లు బాదారు. ఇందులో కోహ్లీ 8 సిక్సర్లు కొట్టగా, డివిలియర్స్ 12 సిక్సర్లు సాధించాడు. ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాట్స్‌మన్ జాబితాలో అతనికి మూడో స్థానం దక్కింది. బెంగళూరులో 2013 ఏప్రిల్ 23న పుణె వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు సూపర్ స్టార్ క్రిస్ గేల్ 66 బంతులు ఎదుర్కొని అజేయంగా 175 పరుగులు సాధించాడు. ఆ క్రమంలో అతను 13 ఫోర్లతోపాటు 17 సిక్సర్లు బాదాడు.

విరాట్ కోహ్లీ సెంచరీ

బెంగళూరు: సెంచరీ చేసిన విరాట్ కోహ్లీ. అతనికి ఈ సీజన్‌లో ఇది మూడో శతకం. ఐపిఎల్ చరిత్రలోనే ఒకే సీజన్‌లో మూడు సెంచరీలు సాధించిన తొలి బ్యాట్స్‌మన్‌గా కోహ్లీ రికార్డు సృష్టించాడు.

ఐదో ఫాస్టెస్ట్ సెంచరీ

బెంగళూరు: ఐపిఎల్‌లో ఐదో వేగవంతమైన శతకాన్ని ఎబి డివిలియర్స్ నమోదు చేశాడు. అతను ఈ మ్యాచ్‌లో గుజరాత్ లయన్స్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొని, 43 బంతుల్లోనే శతకాన్ని సాధించాడు. క్రిస్ గేల్ 30 బంతుల్లోనే చేసిన సెంచరీ ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉంది. యూసుఫ్ పఠాన్ 37, డేవిడ్ మిల్లర్ 38, ఆడం గిల్‌క్రిస్ట్ 42 బంతుల్లో సెంచరీలు చేశారు.

కోహ్లీసేన ‘రికార్డు’ విజయం

బెంగళూరు, మే 14: విరాట్ కోహ్లీ నాయకత్వంలోని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు శనివారం గుజరాత్ లయన్స్‌తో జరిగిన ఐపిఎల్ మ్యాచ్‌లో చెలరేగిపోయింది. కోహ్లీ, ఎబి డివిలియర్స్ సిక్సర్లతో హోరెత్తించారు. ఐపిఎల్ చరిత్రలోనే మొదటిసారి ఒక ఇన్నింగ్స్‌లో రెండు శతకాలు నమోదుకాగా, బెంగళూరు 20 ఓవర్లలో 3 వికెట్లకు 248 పరుగుల భారీ స్కోరును సాధించింది. ఈ లక్ష్యాన్ని ఛేదించలేకపోయిన గుజరాత్ 104 పరుగులకు ఆలౌటైంది. బెంగళూరు 144 పరుగుల ఆధిక్యంతో విజయభేరి మోగించి సరికొత్త చరిత్ర సృష్టించింది.

టైటిల్‌పై సైనా బృందం కన్ను

కున్షాన్ (చైనా), మే 14: సైనా నెహ్వాల్ బృందం ఆదివారం నుంచి ఇక్కడ ప్రారంభం కానున్న ఉబేర్ కప్ చాంపియన్‌షిప్‌లో టైటిల్‌పై కనే్నసింది. అయితే, పురుషుల విభాగంలో థామస్ కప్ కోసం జరిగే పోరులో భారత్‌కు కష్టాలు తప్పేటట్టు కనిపించడం లేదు. ఉబేర్ కప్‌లో భారత మహిళల జట్టు మొట్టమొదటిసారి 2010లో క్వార్టర్ ఫైనల్ చేరింది. నాలుగేళ్ల తర్వాత, 2014లో న్యూఢిల్లీలో జరిగిన పోటీల్లో చక్కటి ప్రతిభ కనబరచి, తొలిసారి సెమీ ఫైనల్ చేరింది. అయితే, ఐదు పర్యాయాలు చాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకున్న జపాన్ చేతిలో 2-3 తేడాతో ఓడింది. నిబంధనలను అనుసరించి సెమీస్‌లో ఓటమిపాలైన భారత్‌కు కాంస్య పతకం దక్కింది.

Pages