S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అబద్ధపు హామీలతో రైతులను మోసగించిన సిఎం

మాచర్ల, మే 2: అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వకుండా మోసగించిన ఘనుడు చంద్రబాబునాయుడని వైయస్సార్‌సీపీ అధినేత వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. కరవు ధర్నాలో బాగంగా సోమవారం పట్టణంలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ఖాళీ బిందెలతో నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా స్థానిక తహశీల్దార్ కార్యాలయం వద్ద ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో తీవ్ర కరవు సంభవించిందన్నారు. కరవు సమయంలో రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ ఇచ్చి ఆదుకోవాల్సిన ప్రభుత్వం ఇప్పటి వరకు కనీసం ఒక్కరూపాయి కూడ ఇవ్వలేదన్నారు.

సీమలో మండిపోతున్న ఎండలు

కడప/కర్నూలు/అనంతపురం, మే 2: రాయలసీమ జిల్లాల్లో సోమవారం కూడా ఎండల తీవ్రత కొనసాగింది. అయితే ఆదివారం రాత్రి అనంతపురం జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో తేలికపాటి వర్షాలు కురిశాయి. కడప నగరంలో సోమవారం 43.9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయింది. జిల్లాలోని పలు ప్రాంతాల్లో 42 డిగ్రీలకు పైబడి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కర్నూలులో 42.2, నంద్యాలలో 41.8, ఆదోనిలో 41.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అనంతపురం జిల్లాలో సగటు ఉష్ణోగ్రత 41.9 డిగ్రీల సెల్సియస్‌గా నమోదు జిల్లా కేంద్రంలో 43.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. శింగనమలలో 47.0 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది.

మోతుగూడెంలో విద్యుత్ ఉత్పత్తికి బ్రేకు!

రాజమహేంద్రవరం, మే 2: సీలేరు జలాలపై ఆధారపడిన తూర్పు గోదావరి జిల్లాలోని మోతుగూడెం జలవిద్యుత్ కేంద్రంలో నేటి నుండి ఉత్పత్తి నిలిపివేస్తున్నారు. నీటి కొరత కారణంగా విద్యుదుత్పత్తికి బ్రేకు పడింది. మంగళవారం నుండి 12 రోజులపాటు విద్యుదుత్పత్తి నిలుపుదలచేస్తూ జెన్‌కో అధికారులు నిర్ణయం తీసుకున్నారు. నీటి లభ్యత లేకపోవడంతో ఇప్పటికే గత నాలుగు రోజులుగా ఇదే జిల్లాలోని డొంకరాయి జల విద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పత్తి నిలిచిపోయింది. నీటి లభ్యత లేని కారణంగా మోతుగూడెంలో 2నుండి 3 మిలియన్ యూనిట్లకు పడిపోయిన విద్యుదుత్పత్తి సోమవారం మరింత గడ్డు పరిస్థితి ఎదురుకావడంతో 0.25 మిలియన్ యూనిట్లకు పడిపోయింది.

రూ.415 కోట్లతో ఆలయాల ముస్తాబు

విజయవాడ (ఇంద్రకీలాద్రి), మే 2: ఆగస్టులో రానున్న కృష్ణా నది పుష్కరాలను విజయవంతంగా నిర్వహించేందుకు మొత్తం 415 కోట్ల రూపాయల ఖర్చుతో ఆలయాల్లో వివిధ అభివృద్ధి పనులు చేపట్టినట్టు దేవాదాయ ధర్మాదాయ శాఖ చీఫ్ ఇంజనీర్ ఎస్‌ఎస్ సుబ్బారావు తెలిపారు. సోమవారం ఉదయం ఆయన ఇక్కడ ‘ఆంధ్రభూమి’తో మాట్లాడుతూ కృష్ణా పుష్కరాలను వైభవంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. కృష్ణా నది తీరం వెంబడి వున్న దేవాలయాలతో పాటు అన్ని ఆలయాలను వైభవంగా తీర్చిదిద్దేందుకు పనులు ప్రారంభించినట్టు తెలిపారు. కృష్ణా జిల్లాకు సంబంధించి రూ. 16.09 కోట్లతో 221 పనులు చేపట్టినట్టు చెప్పారు.

పప్పుల మిల్లుల్లో తనిఖీలు

తెనాలి, మే 2: గుంటూరు జిల్లా తెనాలిలోని పప్పుల మిల్లుల్లో జోనల్ ఫుడ్ కంట్రోలర్ ఎన్ పూర్ణచంద్రరావు ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం సోమవారం తనిఖీలు నిర్వహించి 220 బస్తాల నిషిద్ధ కెమికల్స్ పౌడర్‌ను సీజ్ చేశారు. జిఎఫ్‌ఓ పూర్ణచంద్రరావు కథనం ప్రకారం.. తెనాలి పరిసర ప్రాంతాల్లోని పప్పుల మిల్లుల్లో ప్రభుత్వం నిషేధించిన సిల్కా, గ్లాసి, సోమ్ రకాల పౌడర్లను పప్పుల నిల్వలకు వాడుతున్నట్లు వారికి సమాచారం అందింది. దీంతో బుర్రిపాలెం రోడ్‌లోని విజయలక్ష్మి డాల్ మిల్లులో 20 బస్తాలు, కుచేలా డాల్ మిల్లులో 200 బస్తాలకు పైబడిన పౌడర్‌ను సీజ్ చేశారు.

టిడిపిపై ఇక ప్రత్యక్షపోరు

కడప,మే 2: తెలుగుదేశం పార్టీ తీరుపై ఇక ప్రత్యక్ష పోరాటానికి రాయలసీమ బిజెపి నేతలు సిద్ధపడుతున్నారు. సీమలో విలయతాండవం చేస్తున్న కరవును రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవటం లేదని, తాగునీరు, పశువులకు దాణా కరవై కబేళాలకు తరలిస్తున్నా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టుగా కూడా లేదంటూ ఆందోళనకు బిజెపి నేతలు వ్యూహరచన చేస్తున్నట్టు తెలుస్తోంది. కడప నగరంలో ఆదివారం రాత్రి సీమ జిల్లాలకు చెందిన బిజెపి నేతలు జరిపిన రహస్య సమావేశంలో ఆ మేరకు నిర్ణయించినట్టు సమాచారం.

భోగాపురం ఎయిర్‌పోర్టుకు రూ. 800 కోట్ల హడ్కో రుణం

విశాఖపట్నం, మే 2: విజయనగరం జిల్లా భోగాపురంలో ప్రభుత్వం తలపెట్టిన అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. ఇక్కడ సుమారు 5,000 ఎకరాల్లో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్మించే అంశాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎయిర్‌పోర్టుకు అవసరమైన భూముల్లో 3,500 ఎకరాలు రైతులకు చెందినవి కాగా, మరో 1,500 ఎకరాలు ప్రభుత్వ భూములున్నాయి. తొలుత రాజధాని తరహాలో భూ సమీకరణ ద్వారా ఎయిర్‌పోర్టుకు అవసరమైన భూములు సేకరించాలని భావించారు. అయితే రైతులు నిరాకరించడంతో ప్రభుత్వం బలవంతంగా భూ సేకరణ చట్టాన్ని ప్రయోగించింది.

కర్నూలు నుంచి మరో ఇద్దరు జంప్!

కర్నూలు, మే 2: కర్నూలు జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో మిగిలిన ఐదుగురు ఎమ్మెల్యేల్లో ఇద్దరిపై తెలుగుదేశం పార్టీ నేతలు గురి పెట్టారు. వారిలో కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన రెడ్డిపై భారీ ఎత్తున ఒత్తిడి పెట్టారని, మరో వైపు నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్యతో కూడా సంప్రదింపులు జరుపుతున్నారని అధికార పార్టీలో చర్చ సాగుతోంది. ఎస్వీ మోహన రెడ్డి విషయంలో ఒక అడుగు ముందుకు వేసి ఆయన చేరిక ఖరారైందని అంటున్నారు. ఆ కారణంగానే కరవుపై వైకాపా ఇచ్చిన ఆందోళన పిలుపు కర్నూలు నగరంలో కనిపించ లేదని పేర్కొంటుండటం గమనార్హం.

డిజిటల్ డోర్ నెంబర్‌తో విస్తృత ప్రయోజనాలు

విజయవాడ (కార్పొరేషన్), మే 2: నగరంలో ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేస్తున్న డిజిటల్ డోర్ నెంబర్ ద్వారా విస్తృత ప్రయోజనాలుంటాయని విఎంసి అదనపు కమిషనర్ (జనరల్) పి అరణ్‌బాబు పేర్కొన్నారు. ఈ సందర్భంగా సోమవారం ఉదయం నగరంలోని 42వ డివిజన్ బవాజీపేటలో జరుగుతున్న డిజిటల్ డోర్ నెంబర్ల కేటాయింపు ప్రక్రియను పరిశీలించిన అరుణ్‌బాబు మాట్లాడుతూ శాటిలైట్ తో అనుసంధానమైయ్యే డిజిటల్ స్మార్ట్ డోర్ నెంబర్‌తో చిరునామా సులభంగా కనుగొనవచ్చునన్నారు. స్మార్ట్ ఫోన్ సహాయంతో ఇంటి చిరునామాను కనుగొనే విధంగా చేపట్టిన ఈప్రక్రియకు ప్రతి వీధికీ స్ట్రీట్ కోడ్‌ను కేటాయిస్తామన్నారు.

విద్యార్థుల్లో క్రీడా నైపుణ్యం పెంపొందించడమే ధ్యేయం

విజయవాడ (కార్పొరేషన్), మే 2: నగర విద్యార్థుల్లో క్రీడా నైపుణ్యాన్ని పెంపొందించి నగర కీర్తి ప్రతిష్ఠను పెంపొందించాలన్న లక్ష్యంతోనే విఎం సి ఆధ్వర్యంలో వేసవి క్రీడా శిక్షణ శిబరాలను నిర్వహిస్తున్నట్టు నగర మేయర్ కోనేరు శ్రీ్ధర్, విఎంసి కమిషనర్ వీరపాండియన్ పేర్కొన్నారు. సోమవారం ఉదయం సింగ్‌నగర్‌లోని మాకినేని బసవపున్నయ్య విఎంసి స్టేడియంలో వేసవి శిబిరాన్ని ప్రారంభించిన సందర్భంగా మేయర్ కోనేరు శ్రీ్ధర్ మాట్లాడుతూ విజయవాడ నగర విద్యార్థులను అన్ని రంగాల్లోనూ ముందుకు తీసుకెళ్లేందుకు ఎన్నో రకాల ప్రోత్సాహకాలను అందిస్తున్నామన్నారు.

Pages