S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంధులకు లేఖకుల సాయం

న్యూఢిల్లీ, మే 2: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించే సివిల్స్‌కు హాజరయ్యే అంధులు, మెదడు పక్షవాతం వచ్చినవారు, కీళ్లు-కండరాలకు సంబంధించిన బలహీనతలు ఉన్నవారు.. ఇకపై లేఖకుల సహకారంతో పరీక్షలు రాయొచ్చు. ఈ రకమైన వికలాంగులు పరీక్షలు రాసేందుకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు సహాయకులను ఏర్పాటు చేసుకునే సౌకర్యాన్ని యూపీఎస్సీ కల్పించింది. అంతే కాకుండా వీరు పరీక్ష రాసే సమయాన్ని కూడా గంటకు అదనంగా 20 నిమిషాలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ కోవకు చెందిన వికలాంగులు పరీక్ష రాసే సామర్థ్యం 40శాతం తక్కువగా ఉంటుంది కాబట్టి...

ఎస్‌పి త్యాగిని ప్రశ్నించిన సిబిఐ

న్యూఢిల్లీ, మే 2: అగస్టా వెస్ట్‌ల్యాండ్ హెలికాప్టర్ల కుంభకోణానికి సంబంధించి వచ్చిన అవినీతి ఆరోపణలపై భారత వాయుసేన (ఐఎఎఫ్) మాజీ అధినేత ఎస్‌పి త్యాగిని సిబిఐ సోమవారం ప్రశ్నించింది. త్యాగి ఉదయం పది గంటలకు ఢిల్లీలోని సిబిఐ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. భారత్‌కు హెలికాప్టర్లు సరఫరా చేయడానికి రూ. 3,600 కోట్ల విలువ గల ఒప్పందాన్ని కుదుర్చుకోవడం కోసం హెలికాప్టర్ల తయారీ సంస్థ ఫిన్‌మెక్కానికా, అగస్టా వెస్ట్‌ల్యాండ్ కంపనీలు భారత అధికారులకు మధ్యవర్తుల ద్వారా ముడుపులు చెల్లించిన విషయాన్ని ‘ద మిలన్ కోర్ట్ ఆఫ్ అప్పీల్స్’ (్భరత్‌లోని హైకోర్టుతో సమానమైనది) వివరించిన విషయం తెలిసిందే.

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే

న్యూఢిల్లీ, మే 2: విభజన గాయాల నుండి ఆంధ్రప్రదేశ్ బతికి బట్టకట్టాలంటే ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని తెలుగుదేశం పార్టీ సభ్యుడు అవంతి శ్రీనివాసరావు ఎన్‌డిఏ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా సాధించుకునేందుకు రాష్ట్ర ప్రజలు ఉద్యమ బాట పట్టే ప్రమాదం ఉన్నదని శ్రీనివాసరావు హెచ్చరించారు. అవంతి శ్రీనివాసరావు సోమవారం లోక్‌సభ జీరో అవర్‌లో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అంశాన్ని ప్రస్తావించారు. యుపిఏ సంకీర్ణ ప్రభుత్వం 2014లో రాష్ట్రాన్ని విభజించినప్పుడు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పిస్తామని పార్లమెంటులో ఇచ్చిన హామీ ఇంతవరకు అమలుకాలేదని ఆయన వాపోయారు.

ఐసిస్ అధినేతపై సిఐఎ చీఫ్ గురి

వాషింగ్టన్, మే 2: అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ అల్‌ఖైదా వ్యవస్థాపకుడు ఒసామా బిన్ లాడెన్‌ను హతమార్చి ఐదేళ్లు గడుస్తుండటంతో అమెరికా గూఢచార సంస్థ సిఐఎ (సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ) చీఫ్ జాన్ బ్రెన్నన్ ఇప్పుడు ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) ఉగ్రవాద సంస్థపై దృష్టి కేంద్రీకరించారు. ప్రస్తుతం సిరియా, ఇరాక్‌లను కేంద్రంగా చేసుకుని నరమేథం సృష్టిస్తున్న ఐసిస్ నాయకత్వాన్ని మట్టుబెట్టగలిగితే ప్రపంచానికి ఎంతో మేలు చేయగలుగుతామని ఆయన స్పష్టం చేశారు.

భారత్‌లో మత స్వేచ్ఛకు విఘాతం

వాషింగ్టన్, మే 2: భారత్‌లో మత సహన పరిస్థితులు క్షీణించాయని,మత స్వేచ్ఛ ఉల్లంఘనలూ పెరిగిపోయాయని అంతర్జాతీయ మత స్వేచ్ఛ అధ్యయన నివేదికలో అమెరికా స్పష్టం చేసింది. వివిధ మతాలకు చెందిన ప్రజలను చులకన చేస్తూ అధికారులు, మత నాయకులు చేసే ప్రకటనలు కట్టడి చేయాలని భారత ప్రభుత్వానికి అంతర్జాతీయ మత స్వేచ్ఛా కమిషన్ విజ్ఞప్తి చేసింది. 2015లో భారత దేశంలో మత సహనం క్షీణించిందని, మతపరమైన దాడులూ తీవ్రమయ్యాయని పేర్కొన్న అమెరికా కమిషన్ తన వాదనను దన్నుగా అనేక ఇతర అంశాలనూ ప్రస్తావించింది. తమ అధ్యయన బృందానికి కూడా ఈ ఏడాది వీసాలను భారత్ తిరస్కరించిందని తెలిపింది.

ఉత్తరాఖండ్‌లో అదుపులోకొచ్చిన కార్చిచ్చు

న్యూఢిల్లీ, మే 2: ఉత్తరాఖండ్ అడవిని దగ్ధం చేస్తున్న దావానలం అదుపులోకి వచ్చిందని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ సోమవారం లోక్‌సభలో వెల్లడించారు. ఈ దావానలం కారణంగా ప్రాణనష్టం ఏదీ జరగలేదని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయంలో భయపడాల్సింది ఏమీ లేదని.. రాష్ట్ర పరిపాలనా యంత్రాంగం మంటల్ని అదుపులోకి తీసుకురావటంలో సమర్థంగా పనిచేస్తోందని రాజ్‌నాథ్ అన్నారు. తాను కూడా పరిస్థితిని సమీక్షించినట్లు వెల్లడించారు. జీరో అవర్‌లో తృణమూల్ కాంగ్రెస్ నేత సౌగతారాయ్, బీజేపీ నేత జగదంబికా పాల్ మరికొందరు అడిగిన ప్రశ్నకు రాజ్‌నాథ్ జవాబిచ్చారు.

బోగీల్లో కరెంటు లేదని ప్రయాణికుల ఆందోళన

గూడూరుటౌన్,మే 2: అహ్మదాబాద్ నుండి చైనె్న వెళ్లే నవజీవన్ ఎక్స్‌ప్రెస్ రైలు పరుగుకు అంతరాయం ఏర్పడింది. నెల్లూరు జిల్లా గూడూరు రైల్వే స్టేషన్‌కు సోమవారం మధ్యాహ్నం 3.20 నిమిషాలకు చేరుకున్న రైలు అందులో తాగునీరు,విద్యుత్ సరఫరా లేదని అగ్రహించిన ప్రయాణికులు గూడూరు స్టేషన్‌మాస్టర్‌కు ఫిర్యాదు చేయగా టిఎక్స్‌అర్ డిపాంట్‌మెంట్‌ను పిలిపించి సమస్యను పరిష్కరించారు. ఎస్ 3,ఎస్ 4,ఎస్ 5 బోగిల్లో లైట్లు, ఫ్యాన్లు పనిచేయకపోవడంతో పాటు ఎస్ 7,ఎస్ 10 బోగీల్లో నీరులేదని ప్రయాణికులు అందోళన చేశారు. దాదాపు ఒకటన్నర గంటసేపు రైలు గూడూరు రైల్వే సేష్టన్ అగింది.

రాజ్యసభ సభ్యత్వానికి మాల్యా రాజీనామా

న్యూఢిల్లీ, మే 2: అప్పుల ఊబిలో కూరుకుపోయిన ప్రముఖ మద్యం వ్యాపారి విజయ్ మాల్యా సోమవారం తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశాడు. దేశంలోని వివిధ బ్యాంకులకు ఉద్ధేశ్యపూర్వకంగా దాదాపు 9 వేల కోట్ల రూపాయల రుణాలను ఎగ్గొట్టి విదేశానికి పారిపోయిన మాల్యా ఈ వ్యవహారంలో రాజ్యసభ హక్కుల కమిటీకి సమాధానం ఇవ్వాల్సిన గడువు ముగియడానికి ఒక రోజు ముందే ఈ పరిణామం చోటుచేసుకుంది. విజయ్ మాల్యా సభ్యత్వాన్ని రద్దు చేయాలని గత నెల 25వ తేదీన జరిగిన సమావేశంలో రాజ్యసభ హక్కుల కమిటీ ఏకగ్రీవంగా సిఫారసు చేయడంతో పాటు ఈ విషయమై సమాధానమిచ్చేందుకు ఆయనకు వారం రోజుల గడువు ఇచ్చిన విషయం విదితమే.

నీట్‌పై మళ్లీ ‘సుప్రీం’కు కేంద్రం

న్యూఢిల్లీ, మే 2: నీట్ వ్యవహారంపై ఎన్‌డిఎ ప్రభుత్వం మరోసారి సుప్రీం కోర్టుకు వెళ్లేందుకు సిద్ధమవుతోంది. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ఎం.వెంకయ్య నాయుడు సోమవారం లోక్‌సభలో ఈ విషయాన్ని పరోక్షంగా వెల్లడించారు. నీట్‌పై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు మూలంగా విద్యార్థులు ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పలువురు ఎంపిలు సోమవారం లోక్‌సభ జీరో అవర్‌లో ప్రస్తావించారు.

పార్లమెంటులో వర్గీకరణ బిల్లుపెట్టాలి

న్యూఢిల్లీ, మే 2: కేంద్ర ప్రభుత్వం తక్షణమే పార్లమెంట్‌లో ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టాలని టీఆర్‌ఎస్ ఎంపీలు కవిత, వినోద్ కుమార్, జితేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణ కోరుతూ ఎమ్మార్పీఎస్ అధ్వర్యంలో ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ‘్ఢల్లీ దండోరా’ నినాదంతో ధర్నా నిర్వహించారు. ధర్నాలో టిఆర్‌ఎస్ ఎంపీలు పాల్గొని సంఘీభావం తెలిపారు. బిజెపి ప్రభుత్వం వర్గీకరణపై ఇచ్చిన మాట నిలబెట్టుకుని తక్షణమే బిల్లు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాలన్నారు. అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లో వర్గీకరణ బిల్లు పెడతామని బిజెపి ఎన్నికల్లో హామీ ఇచ్చిందని ఎంపీ కవిత చెప్పారు.

Pages