S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంపాదకీయం

12/31/2015 - 04:40

బహిరంగ మద్యపాన నిషేధం సక్రమ చర్య అని మంగళవారం సుప్రీంకోర్టు తీర్పు చెప్పడం దేశ ప్రజల ఆరోగ్య పరిరక్షణకు దోహదం చేయగల పరిణామం. భారత రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణమైన నిర్ణయం. ఐదు నక్షత్రాల హోటళ్లలో తప్ప మిగిలిన హోటళ్లలో కాని, భార్‌లలో కాని మద్యం సరఫరా చేయరాదన్న కేరళ ప్రభుత్వ నిర్ణయం సముచితమైనదని సమున్నత న్యాయస్థానం చెప్పిన తీర్పు ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు సైతం అనుసరించదగింది.

12/29/2015 - 22:30

జమ్మూ కాశ్మీర్ ఉన్నత న్యాయస్థానం చేసిన నిర్ధారణ ఫలితంగా ఒకే దేశంలో రెండు పతాకాలు అన్న విచ్ఛిన్న సిద్ధాంతానికి బలం చేకూరింది. జమ్మూ కాశ్మీర్ రాజ్యాంగం ప్రకారం ఆ రాష్ట్రానికి ప్రత్యేకంగా మరో జెండా ఏర్పడివుంది. అందువల్ల భారత జాతీయ పతాకంతో పాటు జమ్మూ కాశ్మీరీ పతాకాన్ని కూడ రాజ్యాంగ ప్రక్రియలో భా గం చేయాలన్నది హైకోర్టు ఇచ్చిన తీర్పు.

12/28/2015 - 22:49

స్వయం సమృద్ధ గ్రామ వ్యవస్థను పునరుద్ధరించడానికి దేశవ్యాప్తంగా అనేక ప్రయోగాలు జరుగుతున్నాయి. కొన్ని విజయవంతం అవుతుండడం నడుస్తున్న చరిత్ర. కేరళ రాష్ట్రంలోని పాలక్కాడ్ ప్రాంతంలో అలతూరు మండలం ఇలాంటి విజయ విశ్వాసాలకు మరో ప్రతీక. ఎనిమిది గ్రామ పంచాయతీల సముదాయమైన ఈ మండల పంచాయతీలోని మొత్తం కూరగాయలు, పండ్లు సేంద్రియ సంప్రదాయ పద్ధతిలో పండిస్తుండడం వినూతన హరిత విప్లవం.

12/28/2015 - 00:34

సౌదీ అరేబియాలో ఒక యజమాని ముగ్గురు భారతీయులను కర్కశంగా కొట్టడం ఇటీవల దృశ్య మాధ్యమాలలో ఆవిష్కృతమైన భయానక దృశ్యం! ఇలా కొట్టి బాధించడానికి కారణం కేవలం కరడుకట్టిన క్రౌర్యం! కేరళ ప్రాంతానికి చెందిన ఈ ముగ్గురు భారతీయులు విద్యుత్ సాంకేతిక శిక్షణ పొందినవారు. ఈ ఎలక్ట్రీషియన్లను ఇటుకల బట్టీలో మట్టిమోసే పని చేయమని యజమాని ఆదేశించాడట! వారు నిరాకరించడంతో నిర్బంధించి పెద్ద చెక్కతో వారిని ఆ యజమాని కొట్టాడు.

12/25/2015 - 23:51

నరేంద్రమోదీ నవాజ్ షరీఫ్ జన్మదిన మహోత్సవానికి హాజరు కావడం నాటకీయతకు పరాకాష్ఠ. భారత ప్రధానమంత్రి జరిపిన రష్యా పర్యటన ప్రాధాన్యానికి గ్రహణం పట్టించిన ఘటన ఇది. రష్యా రాజధాని మాస్కోలో మన ప్రధానమంత్రి ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో గురువారం జరిపిన చర్చల విశేషాలను లాహోర్ విమానాశ్రయంలో మన ప్రధాని నరేంద్ర మోదీ పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్‌తో కరచాలనం చేసిన దృశ్యం మింగేసింది.

12/24/2015 - 22:36

భూమిని లోతుగా తవ్విపారేస్తుండడం పర్యావరణానికి కన్నాలు పెడుతున్న ప్రక్రియ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘బాక్సైట్’ తవ్వకాలను ‘‘తాత్కాలికంగా ఆపివేయడం’’ అందువల్ల హర్షించదగిన పరిణామం. ‘అల్యూమినియం’’ ఉత్పత్తికి అవసరమైన ఈ ఖనిజాన్ని భారీగా తవ్వివేయడం వల్ల అటవీ ప్రాంతాలలో పర్యావరణ సమతుల్యం నష్టమైపోతోంది.

12/24/2015 - 04:06

పార్లమెంటులో ఏమి జరుగుతుంది? అన్న ప్రశ్నకు సమాధానం ‘గొడవ’...గొడవ జరగని సమయంలో పార్లమెంటు సభలు ఖాళీగా ఉండడం పరిపాటి! పనివేళలలో పార్లమెంటులో లేని ప్రజాప్రతినిధులు నియోజకవర్గం అభివృద్ధికోసం ప్రభుత్వ కార్యాలయాలలో ఉంటున్నారట! ఇలా ఢిల్లీలో ‘ప్రతినిధులు’ ఉండవలసిన సమయంలో ఉండవలసిన చోట ఉండకపోవడం మన పార్లమెంటరీ ప్రజాస్వామ్య సంప్రదాయం అయిపోయింది!

12/23/2015 - 03:09

ప్రభుత్వ రంగ సంస్థల వాటాలను ప్రభుత్వేతరులకు అమ్మివేయడం ఈ సంవత్సరం మరింతగా పుంజుకోవడం ప్రపంచీకరణ ప్రభావం గొప్పగా విస్తరించ బోతున్నదనడానికి మరో నిదర్శనం. ఇలా తెగనమ్మడం వల్ల లభిస్తున్న ఆదాయాన్ని కేంద్ర రాష్ట్రాల ప్రభుత్వాలు వార్షిక ఆదాయ వ్యయాల ఖాతాలలో జమ కట్టుకుంటున్నాయి. తద్వారా కొత్త పన్నులు విధించకుండా సాలుసరి లోటును పూడ్చుకుంటున్నాయి.

12/22/2015 - 04:36

అంతర్గతంగా మన ప్రభుత్వాలు, క్రీస్తుశకం 1994 నుంచి, సంపన్న దేశాల ప్రయోజనాలను పెంపొందించడానికి వీలైన ఆర్థిక నీతిని అవలంబిస్తున్నాయి. సంపన్న దేశాల ఆర్థిక దురాక్రమణను అంతర్జాతీయ వేదికలపై నిరోధించడానికి మన ప్రభుత్వాలు యత్నిస్తుండడం సమాంతర పరిణామం. ఈ రెండు సమాంతర ప్రక్రియలు పరస్పరం వైరుధ్యాలుగా కొనసాగుతుండడం ఇటీవల ముగిసిన ప్రపంచ వాణిజ్య సంస్థ సదస్సులో మన వైఫల్యానికి నేపథ్యం.

12/21/2015 - 04:48

బాల నేరస్థుడు బయటికి వచ్చేశాడు.. మూడేళ్ల క్రితం భయంకరమైన లైంగిక అత్యాచారానికి గురయి ప్రాణాలు పోగొట్టుకున్న నిర్భయకు న్యాయం జరగకపోవడం మరోసారి నిగ్గుతేలిన నిజం! సహజ న్యాయంగా చెలామణి అవుతున్న ‘అసహజ న్యాయం’లో నిహితమై ఉన్న అన్యాయం ఇందుకు కారణం! పద్దెనిమిదేళ్లు నిండని యువకుడు లైంగిక అత్యాచారానికి పాల్పడినట్టయితే అది నేరం కాదన్నది ఈ అసహజ న్యాయం!

Pages