S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

02/03/2017 - 01:50

హైదరాబాద్, ఫిబ్రవరి 2: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో తెలంగాణకు ఒరిగిందేమీ లేదని, రాష్ట్రప్రభుత్వం చేపట్టిన అనేక పథకాలపై కేంద్రం చిన్నచూపు చూసిందని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ విమర్శించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్..రెండూ కొత్తగా ఏర్పడినా కేంద్రం చూపు ఒకవైపే ఉన్నట్టు కేటాయింపులను చూస్తే తెలుస్తోందని అన్నారు.

02/03/2017 - 01:47

హైదరాబాద్, ఫిబ్రవరి 2:ఉద్యోగ నియామకాలకు సంబంధించి రాష్ట్ర మంత్రిమండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ మేరకు అర్హులైన హోంగార్డులను పోలీసులుగా నియమిస్తారు. మిగిలిన వారికి వేతనాలు పెంచుతారు. భాషా పండితులు, పిఇటిలను స్కూల్ అసిస్టెంట్లుగా అప్‌గ్రేడ్ చేస్తారు. వివిధ శాఖల్లో అదనంగా ఉన్న ఉద్యోగులను పని వత్తిడి ఉన్న శాఖలకు బదలాయించాలని నిర్ణయించారు.

02/03/2017 - 02:01

హైదరాబాద్, ఫిబ్రవరి 2:యాసిడ్ దాడులకు పాల్పడే వారి పట్ల మరింత కఠిన వైఖరి అవలంబించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు నిందితులకు జీవిత ఖైదు విధించేందుకు వీలు కల్పిస్తూ చట్ట సవరణ చేయాలన్న ప్రతిపాదనకు గురువారం మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ప్రస్తుతం యాసిడ్ దాడులకు పాల్పడే వారికి గరిష్ఠంగా పదేళ్ల జైలు శిక్ష విధించేందుకు మాత్రమే చట్టం అవకాశం కల్పిస్తోంది.

02/03/2017 - 02:09

హైదరాబాద్, ఫిబ్రవరి 2:పలు ప్రాజెక్టుల నిర్మాణంలో మార్పుచేర్పులు చేపట్టాలన్న ప్రభుత్వ నిర్ణయానికి మంత్రిమండలి ఆమోదముద్ర వేసింది. అలాగే గోదావరి నదిపై నిర్మించ తలపెట్టిన రాజీవ్‌సాగర్, ఇందిరాసాగర్ ప్రాజెక్టులను, కంతనపల్లి వద్ద బ్యారేజీ నిర్మాణాన్ని ప్రభుత్వం విరమించుకుంది. ఈ మేరకు గురువారం జరిగిన సమావేశంలో రాష్ట్ర మంత్రిమండలి సాగునీటి ప్రాజెక్టులపై కీలక నిర్ణయాలు తీసుకుంది.

02/03/2017 - 01:36

విజయవాడ, ఫిబ్రవరి 2:బయో ఉత్పత్తుల విక్రయాలను నియంత్రించేందుకు రాష్ట్రంలో త్వరలో చట్టం రూపొందించనున్నట్లు వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. నకిలీ విత్తనాలు విక్రయిస్తే క్రిమినల్ చర్యలు తప్పవన్నారు. వెలగపూడి సచివాలయంలో వ్యవసాయ శాఖ అధికారులు, ఎన్జీ రంగా వర్శిటీ శాస్తవ్రేత్తలతో గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు.

02/03/2017 - 01:32

అనంతపురం, ఫిబ్రవరి 2: బలవంతపు భూ సేకరణ ఓ రైతు నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. కార్ల కంపెనీ కోసం ప్రభుత్వం సేకరించిన భూమిలో తన మొత్తం భూమి పోయిందని తెలుసుకున్న రైతు బాలూనాయక్ (50) కుప్పకూలిపోయి ప్రాణాలు విడిచాడు. అనంతపురం జిల్లా పెనుకొండలో గురువారం జిల్లా అధికారులు, స్థానిక ఎమ్మెల్యే సమక్షంలోనే ఈ విషాదం చోటుచేసుకుంది.

02/03/2017 - 02:21

విజయవాడ, ఫిబ్రవరి 2: నిర్దేశిత లక్ష్యాలను సాధించే దిశగా బడ్జెట్‌ను రూపొందించాలని అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. బడ్జెట్ రూపకల్పనలో ఒక దృక్పథం ఉండాలన్నారు. గురువారం వెలగపూడి సచివాలయంలో బడ్జెట్ రూపకల్పనపై కసరత్తు, ఈనెల 6న కార్యదర్శులు, హెచ్‌ఓడిలపై జరిగే సమావేశ అజెండాపై చర్చించేందుకు ఆర్థిక, ప్రణాళికా శాఖాధికారులతో ముఖ్యమంత్రి సమావేశం నిర్వహించారు.

02/03/2017 - 01:28

విజయవాడ, ఫిబ్రవరి 2: రాజధాని అమరావతిలో భవన నిర్మాణాలకు సంబంధించి పనులు ప్రారంభించేందుకు తేదీలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం ఖరారు చేశారు. శాశ్వత అసెంబ్లీ భవన నిర్మాణాన్ని జూలై 20న, హైకోర్టు భవన నిర్మాణ పనులను ఆగస్టు 17న ప్రారంభించేందుకు నిర్ణయించారు. వెలగపూడి సచివాలయంలో రాజధాని నిర్మాణంపై సిఎం సమీక్ష నిర్వహించారు.

02/02/2017 - 08:23

* ఉద్యోగుల ప్రయోజనాలు కాపాడుదాం
* సమస్యలను స్నేహపూర్వకంగా పరిష్కరించుకుందాం
* ప్రతిపాదనలు ఇస్తే చర్చిద్దాం
* గవర్నర్ సమక్షంలో జరిగిన ఇరు రాష్ట్రాల మంత్రుల భేటీ
* 9న మళ్లీ సమావేశం

02/01/2017 - 04:59

చిత్రం..హైదరాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న దర్శకుడు దాసరినారాయణరావును పరామర్శించేందుకు తరలివచ్చిన దర్శకుడు రాఘవేంద్రరావు, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, మంత్రి తలసాని

Pages